Begin typing your search above and press return to search.

పబ్లిక్ తో మృణాల్.. సరస్వతి నచ్చిందా లేక జూలియట్?

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తెలుగులో తొలిసారి సీతారామం సినిమాతో సీతామహాలక్ష్మి పాత్రతో తెలుగు అభిమానుల హృదయాలను దోచుకుంది.

By:  Madhu Reddy   |   10 April 2026 1:13 PM IST
పబ్లిక్ తో మృణాల్.. సరస్వతి నచ్చిందా లేక జూలియట్?
X

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తెలుగులో తొలిసారి సీతారామం సినిమాతో సీతామహాలక్ష్మి పాత్రతో తెలుగు అభిమానుల హృదయాలను దోచుకుంది. మొదటి సినిమా ఇచ్చిన క్రేజ్ తో ఆమె మళ్ళీ మళ్ళీ తెలుగులో అవకాశాలు అందుకుంది. అలా హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హాయ్ నాన్నతో సక్సెస్ అందుకుంది కానీ ఫ్యామిలీ స్టార్ తో బొక్క బోర్ల పడింది ఈ ముద్దుగుమ్మ. దీంతో తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. ఫలితంగా మిగతా భాషలలో దృష్టి పెట్టి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసినా ఈమె మనసంతా తెలుగు ప్రేక్షకుల పైనే.. అలా మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి డెకాయిట్ రూపంలో మన ముందుకు వచ్చింది.

సరస్వతి నచ్చిందా ? లేక జూలియట్?

శానిల్ డియో తొలి దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వచ్చిన చిత్రం డెకాయిట్. ప్రపంచవ్యాప్తంగా నేడు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అభిమానులను మెప్పించింది. ఇకపోతే చాలా కాలం తర్వాత మళ్లీ తనకు సక్సెస్ లభించడంతో పబ్లిక్ తో సందడి చేయడానికి నగరంలోని థియేటర్కు వచ్చింది మృణాల్ ఠాకూర్ . చిత్ర యూనిట్ తో పాటు హీరో అడివి శేష్ అలాగే మృణాల్ ఠాకూర్ ఆడియన్స్ తో ముచ్చటించారు. అందులో భాగంగానే సినిమా చూసి బయటకు వస్తున్న ఆడియన్స్ తో మృణాల్ ఠాకూర్ నేరుగా మాట్లాడారు. మీకు సరస్వతీ నచ్చిందా ? లేక జూలియట్ ? అంటూ అభిమానులను ప్రశ్నించింది.

ఆడియన్స్ రియాక్షన్ ఇదే..

ఇక మృణాల్ ఠాకూర్ అడిగిన ప్రశ్నకు సినిమా చూసిన ఆడియన్స్ అందరూ జూలియట్ అంటూ గట్టిగా అరవడంతో ఆమె ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి.. ఇకపోతే ఇందులో మృణాల్ ఠాకూర్ సరస్వతి అలియాస్ జూలియట్ అనే పాత్రలలో విభిన్నమైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఇకపోతే సరస్వతిగా , జూలియట్ గా నటించి అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె సరస్వతిగా కంటే జూలియట్ గానే ఎక్కువగా మెప్పించినట్లు ఇప్పుడు ఆడియన్స్ స్పష్టం చేశారు. ఏది ఏమైనా డెకాయిట్ సినిమాతో మృణాల్ హిట్ కొట్టింది అనే కామెంట్లు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి.

డెకాయిట్ సినిమా స్టోరీ..

సినిమా విషయానికి వస్తే.. తక్కువ కులానికి చెందిన హరిదాస్ (అడివి శేష్) ను అగ్రకులానికి చెందిన సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాల్ ఠాకూర్) ప్రేమిస్తుంది. అయితే ఈ కులం కారణంగానే వీళ్లిద్దరూ విడిపోతారు. ఈ క్రమంలోనే హరిని ఒక కేసులో అబద్ధపు సాక్ష్యం చెప్పి జైలుకి పంపిస్తుంది సరస్వతి. 13 ఏళ్ల పాటు జైల్లో గడిపిన తర్వాత హరి అక్కడి నుంచి పారిపోయి బయటకు వస్తాడు. ఇక తనను తప్పుడు సాక్ష్యంతో జైలుకు పంపించిన సరస్వతి మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని హరి అనుకుంటాడు. కానీ అప్పటికే సరస్వతి తన కుటుంబ సమస్యలతో సతమతమవుతూ ఉంటుంది . అటు సరస్వతికి ఇటు హరికి ఇద్దరికీ డబ్బు సమస్య వస్తుంది.

ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

ఇక ఆ డబ్బు కోసం విడిపోయిన ఈ ఇద్దరు మళ్లీ కలుస్తారు.. ఆ తర్వాత ఏం చేశారు? ఏం జరిగింది? అసలు హరినీ సరస్వతి జైలుకెందుకు పంపించింది? చివరికి తన జూలియట్ కోసం హరి ఏం చేస్తాడు? అనేది ఈ సినిమా కథ .. ఇకపోతే రొటీన్ స్టోరీ అయినప్పటికీ దీనిని తెరపై చూపించే విధానంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు అని చెప్పాలి. ఈ సినిమాతో మృణాల్ తన ఖాతాలో హిట్టు వేసుకుందనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.