Begin typing your search above and press return to search.

ఫెస్టివ్ వైబ్.. ఎలిగెంట్ లుక్ లో మృణాల్ సోయగాలు..

దంతేరాస్ సందర్భంగా నటి మృణాల్ ఠాకూర్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఐవరీ కలర్ మిర్రర్ వర్క్ డిజైనర్ శారీలో ఎలిగెంట్‌గా కనిపించింది. మ్యాచింగ్ హెవీ చోకర్, పెద్ద చెవిపోగులతో తన లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుకుంది. 'సీతారామం'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ.. హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్, డెకాయిట్ వంటి చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం పలు భాషా చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది.

By:  Madhu Reddy   |   7 Nov 2026 10:46 AM IST
ఫెస్టివ్ వైబ్.. ఎలిగెంట్ లుక్ లో మృణాల్ సోయగాలు..
X

ఫెస్టివల్స్ మొదలయ్యాయి అంటే చాలు సెలబ్రిటీలు అందంగా, సాంప్రదాయంగా ముస్తాబవుతూ అభిమానులకు కన్నుల విందుగా కనిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే దంతేరాస్ సందర్భంగా తెలుగు ప్రేక్షకులను సీతామహాలక్ష్మి పాత్రతో కట్టిపడేసిన మృణాల్ ఠాకూర్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యేక వైరల్ గా మారుతున్నాయి. చీరకట్టులో కనిపించి తన ఎలిగెంట్ లుక్కుతో అభిమానులను మెస్మరైజ్ చేసింది.

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సీమ గుజ్రాల్ కలెక్షన్స్ నుండి ఎంపిక చేసిన ఐవరీ కలర్ డిజైనర్ సారీ కట్టుకొని , తన లుక్ తో అభిమానులను ఆకట్టుకుంది. ఈ జార్జెట్ చీర పై క్లిష్టమైన పైస్లీ ఎంబ్రాయిడరీ డిజైన్ తో రూపొందించారు. మొత్తం అద్దాల పనితనం , పూసల అమరిక చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. దీనికి మ్యాచింగ్ గా స్ట్రాపీ స్టైల్ లో నెక్ లైన్ కలిగిన హెవీ మిర్రర్ వర్క్ బ్లౌజ్ జత చేసింది. ఈ ఔట్ ఫిట్ లో మృణాల్ తన లుక్ ను మరింత రాయల్ గా మార్చడానికి మెడలో మ్యాచింగ్ హెవీ చౌకర్ నెక్లెస్ ధరించి పెద్ద చెవిపోగులతో తన అందాన్ని రెట్టింపు చేసుకుంది. మొత్తానికైతే దంతేరాస్ స్పెషల్ సందర్భంగా తన లేటెస్ట్ అవుట్ ఫిట్ తో ఎలిగెంట్గా కనిపించి అభిమానుల హృదయాలను దోచుకుంది .అంతేకాదు మిర్రర్ వర్క్ తో డిజైన్ చేసిన శారీలో దీపావళి మొత్తం మీలోనే కనిపిస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

2012లో ముజ్ సే కుచ్ కెహెతి.. ఏ ఖామోషియాన్ అనే హిందీ సీరియల్ ద్వారా నటన రంగంలోకి అడుగుపెట్టిన ఈమె.. 2014లో విట్టిదండు అనే మరాఠీ చిత్రం ద్వారా నటిగా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత హిందీ, తెలుగు చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగు సినిమా విషయానికొస్తే 2022లో హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నేరుగా తెలుగులో చేసిన చిత్రం సీతారామం. ఈ చిత్రం ద్వారా వెండితెరకు సీతామహాలక్ష్మి పాత్రతో పరిచయమై అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఏకంగా భారీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకోవడంతో వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి.

ఆ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలలో నటించినా.. ఈమె సరైన సక్సెస్ అందుకోలేదు. ఆ తర్వాత డెకాయిట్ చిత్రంలో నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రీసెంట్ గా పూజ మేరీ జాన్ అనే ఓటిటీ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం రాకాసినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా వెలువడలేదు.

ఏది ఏమైనా మృణాల్ ఠాకూర్ ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ తన స్టార్ స్టేటస్ ను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.