బ్రదర్ ఆఫ్ మృణాల్.. హీరోగా గట్టి స్కెచ్‌తోనే
బాలీవుడ్ లో నటవారసులకు కొదవేమీ లేదు. ఖాన్‌లు, కపూర్‌లు, బచ్చన్ ల కుటుంబాల నుంచి నటవారసులు పెద్ద తెరను ఏలేందుకు దూసుకొస్తున్నారు.
By: Sivaji Kontham | 1 Aug 2025 3:58 PM ISTబాలీవుడ్ లో నటవారసులకు కొదవేమీ లేదు. ఖాన్‌లు, కపూర్‌లు, బచ్చన్ ల కుటుంబాల నుంచి నటవారసులు పెద్ద తెరను ఏలేందుకు దూసుకొస్తున్నారు. అగ్ర సినీకుటుంబాల నుంచి నటీమణుల వెల్లువ కూడా అంతకంతకు పెరుగుతోంది. ఇలాంటి సమయంలో అందాల కథానాయిక మృణాల్ ఠాకూర్ తన సోదరుడు ధవల్ ఠాకూర్ ని వెండితెరకు పరిచయం చేస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. ధవల్ ఠాకూర్ `తుక్రా కే మేరా ప్యార్` అనే ప్రేమకథా చిత్రంతో ఓటీటీలో ఆరంగేట్రం చేసాడు. ఇది గత ఏడాది నవంబర్ లో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు పెద్దతెరపై కథానాయకుడిగా రాణించేందుకు అతడు భారీ ప్రణాళికల్ని కలిగి ఉన్నాడు.
పక్కింటి అబ్బాయిలా...
ధవల్ చూడటానికి పక్కింటి అబ్బాయిలా కనిపిస్తున్నాడు. షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ లా, ట్వల్త్ ఫెయిల్ విక్రాంత్ మాస్సేలా నేచురల్ లుక్స్ తో ఆకర్షిస్తున్నాడు. తన సోదరి మృణాల్ సలహాలు సూచనలు అనుసరిస్తూ బుద్ధిమంతుడిలా అతడు పరిశ్రమను అల్లుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తొలి ప్రయత్నం `తుక్రా కే మేరా ప్యార్` అతడి టీనేజీ దూకుడుకు తగ్గ కథాంశంతో రూపొందింది. ఈ చిత్రంలో ప్రేమకథతో పాటు, కుల వర్గ పోరాటాల నేపథ్యం.. కొత్త తరహా ప్రతీకార గాథ ఆకట్టుకున్నాయి. అతడు తొలి ప్రయత్నమే అందరి దృష్టిని ఆకర్షించినా, పెద్ద తెరపై ఇంకా చాలా నిరూపించుకోవాల్సి ఉంది. పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఎదిగేసిన మృణాల్ మార్గదర్శనంలో ధవల్ ఠాకూర్ మరింత షైన్ అయ్యేందుకు ఛాన్సుంది. ప్రస్తుతం అతడు బాక్సింగ్ ప్రాక్టీస్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. జిమ్ లో కసరత్తులు చేస్తూ పర్ఫెక్ట్ ఫిట్ బాడీని ప్రిపేర్ చేస్తున్న వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.
వెంట పడ్డ ఫోటోగ్రాఫర్లు:
తాజాగా 'సన్ ఆఫ్ సర్ధార్ 2' స్పెషల్ స్క్రీనింగ్ లో తన సోదరుడు ధవల్ ఠాకూర్ తో పాటు మృణాల్ కనిపించింది. అజయ్‌దేవగన్- మృణాల్ ప్రధాన పాత్రల్లో నటించిన సన్ ఆఫ్ సర్ధార్ 2 చక్కని కామిక్ టైమింగ్ తో రూపొందించిన ఎమోషనల్ డ్రామా.. ఈ గురువారం సాయంత్రం ప్రివ్యూ షోలో సెలబ్రిటీలు సందడి చేసారు. అందరిలో యువహీరో ధవల్ ఛామింగ్ లుక్స్, ఫ్యాషన్ సెన్స్, అతడి అందమైన చిరునవ్వు చూపరులను ఆకర్షించాయి. ఇక మృణాల్- ధవల్ జోడీని కెమెరాల్లో బంధించేందుకు స్టిల్ ఫోటోగ్రాఫర్లు పోటీపడ్డారు. `సన్ ఆఫ్ సర్ధార్ 2` స్పెషల్ స్క్రీనింగ్ కోసం కాస్టింగ్ తో పాటు, పలువురు టాప్ బాలీవుడ్ స్టార్లు ఎటెండయ్యారు.
పంజాబ్ నుంచి యుకేకి కథ షిఫ్ట్:
సన్ ఆఫ్ సర్దార్ 2 ట్రైలర్ ప్రకారం.. ఈ సినిమా కథ పంజాబ్ నుండి బ్రిటన్ కి షిఫ్టయింది. `యమ్లా పగ్లా దీవానా` తరహా సాంస్కృతిక నేపథ్యం ఈ చిత్రంలో కనిపిస్తోంది. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ రబియా పాత్రను పోషించింది. అయితే తాను స్వతహాగా మహారాష్ట్రకు చెందిన యువతి కావడంతో పంజాబీ అమ్మాయిగా నటించడానికి కొంత ప్రాక్టీస్ చేయాల్సి వచ్చిందని, ఇది అంత కష్టం కాలేదని మృణాల్ తెలిపింది. పంజాబీ డిక్షన్ నేర్చుకోవడం నుండి ధోల్ నేర్చుకోవడం వరకూ... అందమైన ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చేందుకు. అజయ్ దేవ్‌గన్‌తో సహజ కెమిస్ట్రీని మ్యాచ్ చేసేందుకు ప్రయత్నించానని మృణాల్ చెబుతోంది.
