Begin typing your search above and press return to search.

ఐస్ బ్లూ డ్రెస్ లో మృణాల్ కొత్త లుక్.. ఫ్యాషన్ సెన్స్ కి కేరాఫ్ అడ్రస్!

మృణాల్ లేటెస్ట్ అవుట్ ఫిట్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఐస్ బ్లూ కలర్ వెస్ట్రన్ వేర్ ధరించి ఆకట్టుకుంది.

By:  Madhu Reddy   |   11 Jun 2026 10:36 AM IST
ఐస్ బ్లూ డ్రెస్ లో మృణాల్ కొత్త లుక్.. ఫ్యాషన్ సెన్స్ కి కేరాఫ్ అడ్రస్!
X

హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నేరుగా తెలుగులో చేసిన చిత్రం సీతరామం. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్. సీతా మహాలక్ష్మి పాత్రలో చీరకట్టులో సాంప్రదాయంగా కనిపించి తన అద్భుతమైన నటనతో అందరిని మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా సీత పాత్రలో మృణాల్ ఒదిగిపోయింది. ఈమె నటనకు అభిమానులు మంత్రముగ్ధులు కాగా విమర్శకులు ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఈ సినిమా అప్పట్లో కలెక్షన్ వర్షం కురిపించి.. దుల్కర్ కు హీరోగా తెలుగులో ఒక స్థానాన్ని కల్పించింది.




హీరోయిన్గా తెలుగు ప్రేక్షకుల హృదయాలను సొంతం చేసుకున్న మృణాల్.. ఈ సినిమా తర్వాత శౌర్యువ్ (తొలి పరిచయం) దర్శకత్వంలో నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాలో జ్యోత్స్న పాత్రతో మరోసారి అభిమానుల హృదయాలను దోచుకుంది. ఈ సినిమా తర్వాత ఈమె చేసిన ది ఫ్యామిలీ స్టార్ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇక ఈ సినిమా డిజాస్టర్ కావడంతో కొంతకాలం టాలీవుడ్ కి దూరమైన ఈమెకు తెలుగులో అవకాశాలు లభించడం కష్టమే అనే కామెంట్లు వినిపిస్తున్న సమయంలో సడన్గా అడివి శేష్ డెకాయిట్ మూవీ నుండి శృతిహాసన్ తప్పుకోవడంతో ఆ స్థానం ఈమెకు లభించింది.అలా వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకున్న ఈమె.. ఈ సినిమాలో సరస్వతి, జూలియట్ పాత్రలతో మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో జూలియట్ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి.




ఇక ఇటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అందులో భాగంగానే వరుణ్ ధావన్, పూజా హెగ్డే లతో కలిసి హై జవానీతో ఇష్క్ హోనా హై అనే సినిమాలో నటించింది. జూన్ 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అటు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్న మృణాల్ లేటెస్ట్ అవుట్ ఫిట్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఐస్ బ్లూ కలర్ వెస్ట్రన్ వేర్ ధరించి ఆకట్టుకుంది.




డిజైనర్ లేబుల్ నేహా న్హాటా అఫీషియల్ వారి ఐస్ బ్లూ కేఫ్ సెట్ ధరించింది. ఇక ఈ డ్రెస్ విషయానికి వస్తే చేతితో ఎంబ్రాయిడరీ చేసిన స్లీవ్ లెస్ లేత నీలిరంగు జాకెట్ ధరించింది. ఇక దీనిపై క్లిష్టమైన పూలతో సాంప్రదాయంగా చేతితో డిజైన్ చేశారు. ఇక దీనికి కాంబినేషన్లో వదులుగా ఉండే హై వేస్టేడ్ ఆర్గాన్జ ట్రేప్ ఫాంట్ ధరించింది. ఇక దీనికి పైన స్లీవ్ లెస్ ఫుల్ లెంత్ కలిగిన కోట్ ధరించి తన మేకోవర్ ను ఫుల్ ఫిల్ చేసుకుంది. మొత్తానికి అయితే మృణాల్ లేటెస్ట్ ట్రెండీ అవుట్ ఫిట్ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటుంది.




మృణాల్ ఠాకూర్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి హీరోగా సోషియో ఫాంటసీ డ్రామాగా వస్తున్న విశ్వంభర సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా విడుదల తేదీపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోవడం గమనార్హం. అలాగే మరో హిందీ చిత్రంలో ఈమె నటిస్తోంది. ఇలా వరుస చిత్రాలతో బిజీగా మారింది ఈ ముద్దుగుమ్మ.