Begin typing your search above and press return to search.

మృణాల్ మరో తెలుగు మూవీ.. ఏంటి సంగతి?

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   20 Jan 2026 3:34 PM IST
మృణాల్ మరో తెలుగు మూవీ.. ఏంటి సంగతి?
X

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. తన అందం, అభినయంతో అదిరిపోయే ఫేమ్ ను సొంతం చేసుకుంది అమ్మడు. సీతారామం మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ, డెబ్యూతో సూపర్ హిట్ ను అందుకున్నారు. అంతకుమించి స్పెషల్ ఫ్యాన్ బేస్ ను కూడా క్రియేట్ చేసుకున్నారు.





ఆ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్స్ సినిమాల్లో నటించిన మృణాల్.. ఇప్పుడు యంగ్ హీరో అడవి శేష్ సరసన డెకాయిట్ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. ఆ సినిమాతో ఉగాది కానుకగా మార్చి 19వ తేదీన థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. రీసెంట్ గా మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ అవ్వగా.. మృణాల్ తన ప్రామెసింగ్ యాక్షన్ తో అందరినీ ఆకట్టుకున్నారు.

అయితే తాజాగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు మృణాల్ ఠాకూర్. కొత్త ఏడాది.. కొత్త స్క్రిప్ట్.. కొత్త బిగినింగ్ అంటూ రాసుకొచ్చారు. సాబ్ న్యూ న్యూ.. అంటూ హలో హైదరాబాద్ అంటూ పలకరించారు. దీంతో ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. అదే సమయంలో మరో తెలుగు మూవీలో యాక్ట్ చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

కానీ ఆ సినిమా ఏంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లీడ్ రోల్ లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్టులో మృణాల్ యాక్ట్ చేస్తున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. షూటింగ్ లో పాల్గొంటున్నట్లు కూడా టాక్ వినిపించింది. కానీ దీనిపై మృణాల్ గానీ.. మూవీ టీమ్ గానీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.

దీంతో మృణాల్ ఆ సినిమా గురించి పోస్ట్ పెట్టి ఉండవచ్చని కొందరు నెటిజన్లు భావిస్తున్నారు. అయితే కొత్త స్క్రిప్ట్ అని ఆమె మెన్షన్ చేయడంతో ఆ మూవీ కాదని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఆమె చెప్పిన కొత్త కథ మరో కొత్త ప్రాజెక్ట్‌ కు సంబంధించినది అయ్యి ఉండొచ్చని అంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు మృణాల్ ఠాకూర్ పోస్ట్.. వైరల్ గా మారి చర్చకు దారితీసింది.

అయితే మృణాల్ కొత్త మూవీ దర్శకుడు ఎవరు, హీరో ఎవరు, నిర్మాతలు ఎవరు అన్న వివరాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే ఆ కొత్త ప్రాజెక్ట్‌ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా మృణాల్ ఒక్క పోస్ట్ తో ఆమె తన కొత్త తెలుగు ప్రాజెక్ట్‌ వైపు అందరి దృష్టి తిప్పుకున్నారు. మరి ఆ మూవీ వివరాలు ఎప్పుడు వస్తాయో వేచి చూడాలి.