Begin typing your search above and press return to search.

క‌ళాత్మ‌క చిత్రాల‌ ద‌ర్శ‌కుడు 'సీతారామం' మాడ్యూల్?

ప్ర‌స్తుతం మృణాల్ ఠాకూర్, సిద్ధాంత్ చతుర్వేది జంట‌గా న‌టిస్తున్న‌ మోడ్ర‌న్ డే రొమాంటిక్ డ్రామా దో దీవానే సెహెర్ మే చిత్రానికి నిర్మాత‌గా భ‌న్సాలీ మ‌ద్ధ‌తునిస్తున్నారు.

By:  Sivaji Kontham   |   22 Nov 2025 5:00 PM IST
క‌ళాత్మ‌క చిత్రాల‌ ద‌ర్శ‌కుడు సీతారామం మాడ్యూల్?
X

క‌ళాత్మ‌క చిత్రాల ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ ఒక చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించినా, లేదా నిర్మాత‌గా మ‌ద్ధ‌తు ఇచ్చినా దానిపై మార్కెట్లో అంతో ఇంతో ఫాలోయింగ్ ఉంటుంది. ప్ర‌స్తుతం మృణాల్ ఠాకూర్, సిద్ధాంత్ చతుర్వేది జంట‌గా న‌టిస్తున్న‌ మోడ్ర‌న్ డే రొమాంటిక్ డ్రామా దో దీవానే సెహెర్ మే చిత్రానికి నిర్మాత‌గా భ‌న్సాలీ మ‌ద్ధ‌తునిస్తున్నారు.

ఈ చిత్రం 20 ఫిబ్రవరి 2026న ప్రేమికుల దినోత్సం అనంత‌రం విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇది భ‌న్సాలీ జాన‌ర్ కంటే భిన్న‌మైన‌ది. ఆయ‌న‌లా భారీత‌నం నిండిన సెట్ల‌లో సాగే ప్రేమ‌క‌థా చిత్రం కాదు. ఇది లైఫ్ లో సాగే డ్రామా, ఎమోష‌న్స్ తో ముందుకు సాగే ఒక అంద‌మైన ప్రేమ‌క‌థ‌. బ‌హుశా మృణాల్ ఇంత‌కుముందు న‌టించేసిన సీతారామం మాడ్యూల్ ని అనుస‌రిస్తుందనే భావ‌న తాజాగా భ‌న్సాలీ బృందం రిలీజ్ చేసిన యానిమేటెడ్ విజువ‌ల్ వెల్ల‌డించింది.

ఇది నిజ జీవిత ప్రేమ‌క‌థ‌తో రూపొందిస్తున్న సినిమా అని కూడా చెబుతున్నారు. మృణాల్ ఈ చిత్రంలో త‌న‌దైన న‌ట‌న‌తో మ‌రోసారి అభిమానులను రంజింప‌జేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. సీతారామం, హాయ్ నాన్న త‌ర‌హాలోనే ఈ కొత్త చిత్రం లైట‌ర్ వెయిన్ స‌న్నివేశాల‌తో, ఘాడ‌మైన ఎమోష‌న్స్ తో సాగుతుంద‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల మృణాల్ కి సీతారామం రేంజులో న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌ల‌లో అవ‌కాశం ల‌భించ‌లేదు. ముఖ్యంగా హిందీ చిత్రాల‌లో త‌న‌కు ఎప్పుడూ అలాంటి స్కోప్ రాలేదు. ఇటీవ‌లే విడుద‌లైన‌ సన్ ఆఫ్ సర్దార్ 2లోను అంత‌గా ప్రాధాన్య‌త లేని రొటీన్ పాత్ర‌లో క‌నిపించాల్సి వ‌చ్చింది.

హిందీ ప‌రిశ్ర‌మ చాలా కాలంగా త‌న‌ను లైట్ తీస్కుంటూనే ఉంది. దీని కార‌ణంగానే మృణాల్ చూపులు ఎప్పుడూ టాలీవుడ్ పైనే ఉంటాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఒక సీతారామం, ఒక హాయ్ నాన్న త‌నకు గొప్ప పేరు తెచ్చిన సినిమాలు. మ‌ళ్లీ అలాంటి గుర్తింపు బాలీవుడ్ లో ఎప్ప‌టికి సాధ్య‌మ‌వుతుందో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి. అందుకే ఇప్పుడు `దో దీవానే సెహెర్ మే` హిందీ చిత్రసీమ‌లో త‌న‌కు తొలి పెద్ద గుర్తింపునిచ్చే సినిమా అవ్వాల‌ని మృణాల్ క‌ల‌లు కంటోంది.

ఈ చిత్రానికి `మామ్` ఫేం రవి ఉద్యవార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన యానిమేటెడ్ ఫస్ట్ లుక్ కవితాత్మకమైన ట్యూన్ తో ర‌క్తి క‌ట్టించింది. ఇది శ‌శాంక్ - రోష్ని అనే అంద‌మైన ప్రేమికుల జీవితానికి సంబంధిచిన క‌థ‌. అద్భుత‌మైన క‌ళాత్మ‌క డ్రామాతో ర‌క్తి క‌ట్టిస్తుందని భావిస్తున్నారు. భ‌న్సాలీ మ‌ద్ధ‌తుతో వ‌స్తున్న సినిమా గ‌నుక మృణాల్ పాత్ర‌కు ప్ర‌త్యేక‌త ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.