Begin typing your search above and press return to search.

సార్‌పై అభిమానం వెన‌క అంత క‌థ ఉంది!

నిజానికి ధ‌నుష్ తో పెళ్లి వార్తలపై స్పందిస్తూ.. ఫిబ్రవరి 14న నా పెళ్లి అని ప్రచారం చేస్తున్నారు.. నాకైతే అది ఏప్రిల్ ఫూల్స్ డే లా అనిపిస్తోంది.. అని నవ్వుతూ కొట్టిపారేసింది.

By:  Sivaji Kontham   |   21 Feb 2026 5:00 AM IST
సార్‌పై అభిమానం వెన‌క అంత క‌థ ఉంది!
X

మృణాల్ ఠాకూర్ - ధనుష్ మధ్య ఏదో నడుస్తోందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంలో మృణాల్ స్పందించిన తీరు.. ప‌బ్లిక్ స్టేట్‌మెంట్లు చూస్తుంటే` `ధనుష్‌పై అమితమైన అభిమానం`` ఒక కారణమైతే, ఆయనతో కలిసి నటించే అవకాశం మరొక కారణం కావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ ఇష్యూలో అసలేం జరుగుతుందో ప‌రిశీలిస్తే, మృణాల్ ప్ర‌కారం.. అది జస్ట్ ఫ్యాన్ గర్ల్ మూమెంట్. మృణాల్ తన తాజా ఇంటర్వ్యూలలో ధనుష్ గురించి చాలా గొప్పగా చెబుతోంది గ‌నుక కేవ‌లం అభిమానం మాత్ర‌మే అనుకోవాలి.

ఆయన ఒక ఇన్స్టిట్యూషన్ లాంటి వారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, సింగర్‌గా, లిరిసిస్ట్‌గా ఆయన ప్రతిభ అమోఘం అని మృణాల్ పొగిడారు. ధనుష్ నటించిన అసురన్, రంజానా, కెప్టెన్ మిల్లర్ సినిమాలు చూసి తాను ఆయనకు పెద్ద ఫ్యాన్ అయిపోయానని తెలిపారు. ఈ సింప్ట‌మ్స్ అన్నీ చూస్తుంటే కేవ‌లం అభిమానిగా అత‌డితో న‌టించాల‌ని త‌పించే అమ్మాయి అని భావించ‌వ‌చ్చు.

నిజానికి ధ‌నుష్ తో పెళ్లి వార్తలపై స్పందిస్తూ.. ఫిబ్రవరి 14న నా పెళ్లి అని ప్రచారం చేస్తున్నారు.. నాకైతే అది ఏప్రిల్ ఫూల్స్ డే లా అనిపిస్తోంది.. అని నవ్వుతూ కొట్టిపారేసింది. దీని అర్థం..కేవలం సినిమా ఛాన్స్ కోసమే ధ‌నుష్ ని ఇంత‌గా అభిమానిస్తోందా? అనే అనుమానాలు రైజ్ అవుతున్నాయి. ఇంత‌కుముందు ధనుష్‌ను తాను స్వయంగా తన సినిమా `సన్ ఆఫ్ సర్దార్ 2` స్క్రీనింగ్‌కు ఆహ్వానించానని, ఆయన రావడం తనను ఆశ్చర్యపరిచిందని మృణాల్ వెల్లడించింది. అలాగే ధనుష్‌తో ఒక్క సినిమాలోనైనా నటించాలన్నది నా కోరిక! అని ఓపెన్ గానే చెప్పేస్తోంది.

ప్రస్తుతం ధనుష్ పాన్ ఇండియా లెవల్లో బిజీగా ఉన్నారు. ఆయన సినిమాల్లో హీరోయిన్ రోల్స్ కి చాలా వెయిటేజ్ ఉంటుంది. అందుకే మృణాల్ ఇలా తన అభిమానాన్ని చాటుకోవడం వెనుక ఆయన సినిమాలో ఛాన్స్ కొట్టాలనే ప్లాన్ ఉండొచ్చనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ప్రేమనా? లేక ప్రమోషనా?

మృణాల్ ప్రస్తుతం తన కొత్త సినిమా `దో దివానే షహర్ మే` రిలీజ్ డే ప్రమోషన్లలో ఉంది. ఇలాంటి సమయంలో ధనుష్ లాంటి పెద్ద హీరోతో లింక్ అప్ రూమర్స్ రావడం వల్ల త‌న‌కు విపరీతమైన పబ్లిసిటీ లభిస్తోంది.

నేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా నాకు రాని పబ్లిసిటీ ఈ రూమర్స్ వల్ల వస్తోంది.. థాంక్యూ! అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. మృణాల్ మాట‌ల‌ను బ‌ట్టి చూస్తుంటే, ఇది కేవ‌లం ఇద్దరి మ‌ధ్యా వృత్తిప‌ర‌మైన గౌర‌వం మాత్ర‌మే ఉంద‌ని అనుకోవ‌చ్చు.