Begin typing your search above and press return to search.

మృణాల్ క‌ల‌ల్లో LEAN MAN ఎవ‌రో ఊహించారా?

త‌న‌దైన అందం న‌ట ప్ర‌తిభ‌తో మాయాజాలం సృష్టించిన మృణాల్ ఠాకూర్ ఇటీవ‌ల ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లోకొస్తోంది.

By:  Sivaji Kontham   |   8 Aug 2025 9:24 AM IST
మృణాల్ క‌ల‌ల్లో LEAN MAN ఎవ‌రో ఊహించారా?
X

త‌న‌దైన అందం న‌ట ప్ర‌తిభ‌తో మాయాజాలం సృష్టించిన మృణాల్ ఠాకూర్ ఇటీవ‌ల ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లోకొస్తోంది. మృణాల్ ప్ర‌స్తుతం త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ తో డేటింగ్ లో ఉందంటూ పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఈ వార్త‌ల‌ను మృణాల్ కానీ, ధ‌నుష్ కానీ ఖండించ‌డం లేదు.. అవును..లేదు..! అని ఎవ‌రూ చెప్ప‌డం లేదు. కానీ ఆ ఇద్ద‌రి క‌ద‌లికలు చాలా సందేహాల‌ను లేవ‌నెత్తుతున్నాయి.

బ‌ర్త్ డే పార్టీలు, స‌క్సెస్ పార్టీల్లో క‌లుసుకోవ‌డం, ఒక‌రితో ఒక‌రు ఛీర్ చేయ‌డం.. ఆప్యాయంగా కౌగిలించుకుని అత్యంత స‌న్నిహితంగా క‌నిపించ‌డం వంటివి బ‌ల‌మైన‌ పుకార్ల‌కు ఆజ్యం పోసాయి. అస‌లు ధ‌నుష్- మృణాల్ మధ్య ఏం జ‌రుగుతోందో ఎవ‌రికీ తెలీదు. కానీ ఏదో జ‌రుగుతోంద‌నే అనుమానాలు రేకెత్తించేలా ఆ ఇద్దరూ ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

ఇప్పుడు ఈ సిరీస్ లో మ‌రో హింట్ ఇచ్చింది మృణాల్. ధ‌నుష్ సోద‌రీమ‌ణులైన డా. కార్తీక కార్తీక్, విమ‌ల గీత ఇద్ద‌రినీ మృణాల్ సోష‌ల్ మీడియాలో సీరియ‌స్ గా ఫాలో చేస్తోంది. ఓవ‌రాల్ గా ధ‌నుష్ కుటుంబంతో ఎంతో స‌న్నిహితంగా క‌లిసిపోతోంది. ఇది దేనికి సంకేతం? అస‌లు ఒక్క సినిమాలో అయినా క‌లిసి న‌టించ‌ని ఈ జంట‌, ఇప్పుడిలా చెట్టాప‌ట్టాల్ అంటూ క‌లిసి క‌నిపించ‌డం వెన‌క అర్థం ఏమిటో తెలుసుకోవ‌చ్చా? అంటూ ఒక‌టే ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి. అయితే వీటికి స‌మాధానం ఇచ్చేందుకు మృణాల్ సిద్ధంగా లేదు.

ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో త‌న భ‌విష్య‌త్ ప్రాజెక్టుల గురించి కానీ, రిలేష‌న్ షిప్ స్టాట‌స్ వ‌గైరా విష‌యాల గురించి కానీ ఏదీ అంతిమంగా ఒక నిర్ధార‌ణ‌కు రాకుండా బ‌య‌టికి చెప్ప‌ను! అని సీరియ‌స్ అయ్యారు మృణాల్. త‌న‌కే ఇంకా విష‌యాలేవీ స్ప‌ష్ఠ‌త లేదని కూడా దీనిని బ‌ట్టి అభిమానులు అర్థం చేసుకున్నారు. ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ నుంచి విడిపోయిన ధ‌నుష్ ప్ర‌స్తుతం ఒంట‌రి. అందుకే అత‌డితో మృణాల్ సాన్నిహిత్యం చాలా సందేహాల‌కు దారి తీసింది. ధ‌నుష్ త‌న కోస‌మే స‌న్ ఆఫ్ స‌ర్ధార్ 2 స‌క్సెస్ మీట్ కి వెళ్లాడ‌ని, బ‌ర్త్ డే పార్టీకి కూడా వెళ్లాడ‌ని చాలా గుస‌గుస‌లు వినిపించాయి.

త్రోబ్యాక్ మ్యాట‌ర్ వైర‌ల్:

ఇటీవ‌ల ఒక పాత‌ ఇంట‌ర్వ్యూలో మృణాల్ కామెంట్లు ఇప్పుడు మ‌రోసారి ఇంటర్నెట్ లో వైర‌ల్ గా మారాయి. త్రోబ్యాక్ మ్యాట‌ర్ అయినా మృణాల్ తాను ఎలా ఉండాల‌నుకుంటోందో ఇందులో మాట్లాడింది. తాను సింపుల్ గా ప్ర‌శాంతంగా జీవితాన్ని గ‌డ‌పాలి. పిల్లా పాప‌ల‌తో సాధార‌ణ జీవితాన్ని గ‌డిపేందుకు ఇష్ట‌ప‌డ‌తాన‌ని అంది. అంతేకాదు `సన్నగా, జోరు(స‌క్సెస్‌)న్న‌ మ‌గాడిని ఇష్టపడతానని కూడా పేర్కొంది. దిష్ఠి క‌న్ను ప్ర‌భావం ఉంటుంది. దిష్ఠి (దుష్ట‌) క‌న్ను నిజ‌మే.. నేను న‌మ్ముతాన‌ని మృణాల్ చెప్పింది. డేటింగ్ లో ఉన్న‌వారిని ఈ దుష్ట క‌న్ను వెంబ‌డిస్తుంద‌ని అన్నారు. మృణాల్ పాత ఇంట‌ర్వ్యూనే ఇప్పుడు వైర‌ల్ చేస్తూ నెటిజనులు దీనిపై ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా మృణాల్ క‌ల‌ల్లో `లీన్ మ్యాన్` ఎవ‌రు? అంటూ కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు.