Begin typing your search above and press return to search.

ఈసారి పూర్తిగా కొత్తగా కనిపిస్తా

పాన్-ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మరోసారి ఛాలెంజింగ్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   6 April 2026 10:54 AM IST
ఈసారి పూర్తిగా కొత్తగా కనిపిస్తా
X

పాన్-ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మరోసారి ఛాలెంజింగ్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. యాక్షన్, రొమాన్స్, ఎమోషన్‌ల మేళవింపుగా తెరకెక్కుతున్న డెకాయిట్ సినిమాలో ఆమె పోషించిన సరస్వతి రోల్ తన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని ఆమె చాలా ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్యంగా రిస్కీ యాక్షన్ స్టంట్స్ చేయడం ఈ సినిమాకు హైలైట్‌గా మారనుందని ఆమె చెప్పడం ఆసక్తిని పెంచుతోంది.

ఏప్రిల్ 10న డెకాయిట్ రిలీజ్

బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్న అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ పాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్‌కు షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై భారీ అంచనాలను సృష్టించగా, ఏప్రిల్ 10న డెకాయిట్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఛాలెంజింగ్ క్యారెక్ట‌ర్లు చేయ‌డం ఇష్టం

ప్ర‌మోష‌న్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన మృణాల్ ప‌లు విశేషాల‌ను షేర్ చేసుకున్నారు. డెకాయిట్‌లో చేసిన సరస్వతి పాత్ర చాలా కాంప్లెక్స్ అని, కానీ మేకర్స్ దాన్ని యాక్టర్‌కు సులభంగా అర్థమయ్యేలా రూపొందించార‌ని, ఛాలెంజింగ్ పాత్రలు చేయడ‌మంటే త‌న‌కెప్పుడూ ఇష్ట‌మేన‌ని, ఈ క్యారెక్ట‌ర్ త‌న‌కు మంచి సంతృప్తినిచ్చిన‌ట్టు ఆమె తెలిపారు.

రిస్కీ స్టంట్స్ చేశా

ఈ సినిమాలో కొన్ని రిస్కీ కొన్ని రిస్కీ స్టంట్స్ చేశాన‌ని, ఛేజింగ్ సీన్స్, డ్రైవింగ్ సీన్స్ ను చాలా ఎంజాయ్ చేశాన‌ని, ముఖ్యంగా హ్యాండ్ బ్రేక్ లేని అంబులెన్స్ ను డ్రైవ్ చేసే సీక్వెన్స్ చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింద‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా తెలుగు ప్రేక్షకులతో తన అనుబంధాన్ని కూడా మృణాల్ గుర్తు చేసుకున్నారు. సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో త‌న‌ను తెలుగు అమ్మాయిలా అంగీకరించార‌ని, ఆడియ‌న్స్ ప్రేమాభిమానాల‌ను ఎప్పటికీ మర్చిపోలేన‌ని, సరస్వతి పాత్ర కూడా అంద‌రికీ త‌ప్ప‌క నచ్చుతుందని నమ్ముతున్న‌ట్టు ఆమె చెప్పారు.

శేష్ కెరీర్లో బెస్ట్ ఫిల్మ్

హీరో శేష్ స్వయంకృషితో ఎదిగిన స్టార్ అని, సినిమాపై ఆయనకు ఉన్న ప్యాషన్ అద్భుతమ‌ని, ఈ సినిమా ఆయన కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్స్‌లో ఒకటిగా నిలుస్తుంద‌ని మృణాల్ ప్రశంసించారు. అలాగే ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్‌లతో కలిసి పనిచేయడం మంచి అనుభవంగా అభివర్ణించారు. అనురాగ్ తో క‌లిసి తెలుగు డైలాగ్స్ నేర్చుకోవ‌డం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్ అని మృణాల్ చెప్పారు. ఇప్ప‌టికే ప‌లు పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో న‌టించిన మృణాల్ డెకాయిట్ కోసం ఒకేసారి రెండు భాష‌ల్లో న‌టించ‌డం ఛాలెంజింగ్ గా ఉంద‌ని, దాన్నుంచి చాలా నేర్చుకున్నట్టు ఆమె చెప్పారు.

డైరెక్ట‌ర్ షానియ‌ల్ డియో అద్భుత‌మైన డైరెక్ట‌ర్ అని, ఈ సినిమా విజువ‌ల్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయ‌ని, డైరెక్ట‌ర్, కెమెరామెన్, ఎడిట‌ర్ టీమ్ వ‌ర్క్ అంతా అద్భుతంగా ఉంద‌ని చెప్పిన మృణాల్, ఈ సినిమా ఒక డిఫరెంట్ ల‌వ్ స్టోరీ అని చెప్పారు. నిర్మాత సుప్రియ చాలా గొప్ప నిర్మాత అని, న‌టీన‌టుల ఆరోగ్యం గురించి ఆమె ఎంతో కేర్ తీసుకుంటార‌ని, త‌న‌కు జ్వ‌రం రావ‌డంతో షూటింగ్ ను రెండ్రోజుల పాటూ హోల్డ్ చేశార‌ని గుర్తు చేసుకున్నారు.మొత్తానికి యాక్ష‌న్, ఎమోష‌న్, ల‌వ్ అన్నీ క‌లగలిపిన ప్యాకేజ్ గా డెకాయిట్ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంద‌ని మృణాల్ చెప్తున్న దాన్ని బ‌ట్టి అర్థ‌మ‌వుతుంది. మ‌రి ఈ సినిమా ప్రేక్ష‌కులను ఏ మేర ఆక‌ట్టుకుంటుందో చూడాలి.