మళ్లీ వివాదంలో మృణాల్.. ఎందుకు ఈ విరోధం?
ఇదిలా ఉండగానే, ఇప్పుడు మృణాల్ ఓ కొత్త వివాదంలో చిక్కుకుంది. ఈసారి బాలీవుడ్ లో ప్రముఖ కథానాయికను ఉద్ధేశించి పేరు ప్రస్థావించకుండానే మృణాల్ చేసిన ఓ కామెంట్ హాట్ టాపిగ్గా మారింది.
By: Sivaji Kontham | 4 Sept 2025 11:51 PM ISTఇటీవల రకరకాల కారణాలతో మృణాల్ ఠాకూర్ పేరు నిరంతరం మీడియా హెడ్ లైన్స్‌లోకొస్తోంది. ప్రముఖ కోలీవుడ్ నటుడు ధనుష్ తో మృణాల్ ప్రేమలో ఉందని నెటిజనులు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ పుకార్లను మృణాల్ ఖండించనూ లేదు ఔనని అనలేదు.
ఇదిలా ఉండగానే, ఇప్పుడు మృణాల్ ఓ కొత్త వివాదంలో చిక్కుకుంది. ఈసారి బాలీవుడ్ లో ప్రముఖ కథానాయికను ఉద్ధేశించి పేరు ప్రస్థావించకుండానే మృణాల్ చేసిన ఓ కామెంట్ హాట్ టాపిగ్గా మారింది. ``గతంలో ఓ స్టార్ హీరో సినిమాలో అవకాశం వస్తే నిరాకరించాను. ఆ సినిమాలో నటించిన కథానాయిక స్టార్ డమ్ సంపాదించినా కానీ, ఇప్పుడు సినిమాలు చేయడం లేదు!`` అని కామెంట్ చేసింది.
అయితే `సుల్తాన్` చిత్రంలో సల్మాన్ సరసన నటించిన అనుష్క శర్మ గురించే ఈ కామెంట్ చేసిందంటూ నెటిజనులు గెస్ చేస్తున్నారు. అనుష్క శర్మను మృణాల్ టార్గెట్ చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అనుష్కశర్మతో మృణాల్ పోలికేమిటో అర్థం కావడం లేదని నెటిజనులు విమర్శించడం కొసమెరుపు.
అనుష్క శర్మ బాలీవుడ్ లో అగ్ర కథానాయికగా కొనసాగుతుండగానే పెళ్లి, పిల్లలు అంటూ లైఫ్ లో సెటిలైంది. ప్రస్తుతం తన వారసుల ఆలనాపాలనా చూడటం, కుటుంబ జీవనానికి ప్రాధాన్యతనిస్తోంది. స్టార్ డమ్ కంటే వ్యక్తిగత జీవితాన్ని అనుష్క శర్మ ప్రేమిస్తోంది. పైగా ఆధ్యాత్మిక పంథాలో గొప్ప సాంప్రదాయాన్ని అనుసరించే అనుష్క శర్మపై మృణాల్ కామెంట్లు చేయడాన్ని చాలా మంది నెటిజనులు తప్పు పడుతున్నారు. మృణాల్ ప్రస్తుతం అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్ చిత్రంతోపాటు, అడివి శేష్ డెకాయిట్ లోను నటిస్తోంది. మరో రెండు హిందీ చిత్రాల్లోను నటిస్తూ బిజీగా ఉంది. సినిమాల్లో నటించకపోయినా అనుష్క శర్మ క్రేజ్ అభిమానుల్లో ఏమాత్రం తగ్గలేదన్నది ఈ భామ గుర్తించాలని నెటిజనులు సూచిస్తున్నారు.
