Begin typing your search above and press return to search.

గట్టి కంబ్యాక్ ఇచ్చిన మృణాల్.. గొప్ప ఛాన్స్ మిస్ చేసుకున్న శృతిహాసన్!

మొత్తానికైతే డిజాస్టర్ తర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకొని ఇప్పుడు గట్టి కం బ్యాక్ ఇచ్చింది అంటూ అభిమానులు ఊపిరి పీల్చుకుంటూ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

By:  Madhu Reddy   |   11 April 2026 11:33 AM IST
గట్టి కంబ్యాక్ ఇచ్చిన మృణాల్.. గొప్ప ఛాన్స్ మిస్ చేసుకున్న శృతిహాసన్!
X

మృణాల్ ఠాకూర్.. సీతారామం , హాయ్ నాన్న వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత.. ఫ్యామిలీ స్టార్ సినిమాతో డిజాస్టర్ ను మూటగట్టుకున్న ఈమె మళ్లీ తెలుగులో సక్సెస్ అందుకోవాలని ఎంతో ఆరాటపడింది. కానీ సరైన అవకాశం లభించక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ ముద్దుగుమ్మ.. శృతిహాసన్ అనుకోకుండా ఒక సినిమా నుండి తప్పుకోవడంతో.. ఆ స్థానాన్ని భర్తీ చేసి ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమా హిట్ అయితే తప్ప ఈమెకు మళ్ళీ తెలుగులో అవకాశం రాదేమో అని అభిమానులు కూడా కంగారు పడ్డారు కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. డెకాయిట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందులో అటు సరస్వతి ఇటు జూలియట్ పాత్రలలో అదరగొట్టేసింది మృణాల్ .

గట్టి కం బ్యాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్..

మొత్తానికైతే డిజాస్టర్ తర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకొని ఇప్పుడు గట్టి కం బ్యాక్ ఇచ్చింది అంటూ అభిమానులు ఊపిరి పీల్చుకుంటూ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఈమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు . అవకాశం దొరికితే చాలు సక్సెస్ అందుకుంటుంది అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

డెకాయిట్ కి పాజిటివ్ టాక్.. తెరపైకి శృతిహాసన్..

అయితే ఇదే సమయంలో శృతిహాసన్ పేరును ప్రస్తావించడం గమనార్హం. వాస్తవానికి డెకాయిట్ సినిమాలో శృతిహాసన్ మొదట ఎంపికైంది. కొంత భాగం షూటింగ్ కూడా అయ్యింది.. కానీ అనూహ్యంగా ఈ ప్రాజెక్టు నుండి శృతిహాసన్ తప్పుకోవడంతో మృణాల్ ను రంగంలోకి దింపారు చిత్ర బృందం. అయితే ఏప్రిల్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో బంగారం లాంటి చాన్స్ ను శృతిహాసన్ మిస్ చేసుకుంది అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

గొప్ప ఛాన్స్ మిస్ చేసుకున్న శృతిహాసన్..

సలార్ చిత్రం తర్వాత బలమైన నటనకు , ప్రాధాన్యత ఉన్న పాత్రల కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అలాంటిది ఇలాంటి సమయంలో డెకాయిట్ సినిమా చేసి ఉండుంటే ఈమెకు బాగా ఉపయోగపడుండేది. కానీ అనూహ్యంగా వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంది. కానీ ఆ అవకాశాన్ని మృణాల్ ఒడిసిపట్టి తన నటన టాలెంటును చూపించి తన కెరీర్నే మలుపు తిప్పుకుందని చెప్పవచ్చు.. ఏది ఏమైనా శృతిహాసన్ కి మాత్రం డెకాయిట్ వదులుకోవడం అతిపెద్ద నష్టంగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అర్థవంతమైన పాత్రలు దొరకడం చాలా కష్టంగా ఉన్న ఈ రోజుల్లో డెకాయిట్ వంటి ఒక మంచి సినిమాని శృతిహాసన్ వదులుకోవడం నిజంగా బాధాకరం అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ఇటు ఇండియాలోనే కాకుండా అటు ఓవర్సీస్ లో కూడా ఘనంగా ప్రారంభమైంది. మృణాల్ ఠాకూర్ పోషించిన సరస్వతి, జూలియట్ పాత్రలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

శృతిహాసన్ ప్రస్తుత సినిమాలు..

శృతిహాసన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.. గత ఏడాది కూలీతో చివరిసారిగా ప్రేక్షకులను పలకరించిన ఈమె.. ఇప్పుడు ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చే సలార్ పార్ట్ 2: శౌర్యంగపర్వం చిత్రంలో భాగం కానుంది. అలాగే ఆకాశంలో ఒక తార అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న శృతిహాసన్ .. థ్రిల్లర్ మూవీ అయిన ట్రైన్ లో గెస్ట్ పాత్ర పోషిస్తుంది . అలాగే ది ఐ అనే హాలీవుడ్ చిత్రంలో కూడా నటిస్తోంది . పైగా ఇది సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.. . అంతేకాదు శృతిహాసన్ నటించిన తొలి హాలీవుడ్ మూవీ కూడా ఇదే కావడం విశేషం.