బాలీవుడ్ లో మృణాల్.. ప్లాన్ మార్చాల్సిందే!?
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి అందరికీ తెలిసిందే. నార్త్, సౌత్ లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్న అమ్మడు.. టాలీవుడ్ లో సీతారామంతో ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
By: M Prashanth | 3 Aug 2025 1:00 AM ISTహీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి అందరికీ తెలిసిందే. నార్త్, సౌత్ లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్న అమ్మడు.. టాలీవుడ్ లో సీతారామంతో ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీతామహాలక్ష్మిగా అందరి మనసులను గెలుచుకున్న మృణాల్.. తెలుగులో డెబ్యూ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది.
ఆ తర్వాత హాయ్ నాన్న మూవీతో మరో హిట్ మృణాల్ ఠాకూర్ ఖాతాలో పడింది. ఆ వెంటనే ఫ్యామిలీ స్టార్ తో హ్యాట్రిక్ కొడతుందని అంతా అనుకోగా.. అది జరగలేదు. కానీ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు డెకాయిట్ లో నటిస్తోంది. యంగ్ హీరో అడివి శేష్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఆ మూవీలో జూలియట్ గా సందడి చేయనుంది మృణాల్ ఠాకూర్.
అదే సమయంలో బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంటున్న బ్యూటీ.. ఇప్పుడు మూడు సినిమాల్లో నటిస్తుండడం విశేషం. బీ టౌన్ లో సరైన హిట్ కొట్టి చాలా కాలం అయినా.. ఆఫర్లు మాత్రం తెగ వస్తున్నాయి. సూపర్ 30, బాట్లా హౌస్ తర్వాత బ్లాక్ బస్టర్ ను ఇప్పటి వరకు సొంతం చేసుకోలేదు మృణాల్. కానీ ఆఫర్స్ మాత్రం అస్సలు తగ్గడం లేదు.
ప్రస్తుతం హై జవానీ తో ఇష్క్ హోనా హై, తుమ్ హో తో, పూజా మేరీ జాన్ సినిమాల్లో నటిస్తోంది అమ్మడు. రీసెంట్ గా సన్ ఆఫ్ సర్దార్ 2తో ప్రేక్షకుల ముందుకు మృణాల్ రాగా.. ఆ సినిమాలో అజయ్ దేవగన్ లీడ్ రోల్ లో నటించారు. విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహించిన ఆ మూవీ.. ఇటీవల వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది.
అయితే సినిమాతో హిట్ అందుకుంటారని ఎక్స్పెక్ట్ చేయగా.. బాక్సాఫీస్ వద్ద సన్ ఆఫ్ సర్దార్ 2 విఫలమైంది. దీంతో ఆమెకు మరోసారి నిరాశ ఎదురైంది. అదే సమయంలో నెక్స్ట్ హై జవానీ తో ఇష్క్ హోనా హైతో హిట్ అందుకోవాలని చూస్తోంది మృణాల్. బాలీవుడ్ లో ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించుకున్న డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఆ విషయంపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఎందుకంటే డేవిడ్ ధావన్ ఇప్పటికే మంచి హిట్స్ అందకున్నప్పటికీ.. ఇప్పటి జనరేషన్ కు ఆయన మేకింగ్ నచ్చదేమోనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆయన రీసెంట్ గా తీసిన సినిమాల విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మృణాల్ నిర్ణయం కరెక్ట్ కాదని అంటున్నారు.
ఇప్పటికే వరుస ప్లాఫులు ఉండగా.. ఇప్పుడు ఆ సినిమా ఏమవుతుందోనని డిస్కస్ చేసుకుంటున్నారు. ఆమె ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉందని అంటున్నారు. సెలక్షన్ విషయంలో ప్లాన్ మారాల్సిందేనని సూచిస్తున్నారు. అప్పుడే బాలీవుడ్ లో మంచి పొజిషన్ కు ఎదిగే అవకాశం వస్తుందని చెబుతున్నారు. మరి మృణాల్ ఏం చేస్తుందో వేచి చూడాలి.
