Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు మృణాల్‌ కి కౌంటర్ ఇచ్చిన బ్యూటీ

మృణాల్‌ వ్యాఖ్యల గురించి ఇన్ని సంవత్సరాలు పట్టించుకోని బిపాసా ఎట్టకేలకు స్పందించింది. బాడీ షేమింగ్‌ గురించి మృణాల్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ అన్నట్లుగా బిపాసా సోషల్‌ మీడియా ద్వారా స్పందించింది.

By:  Ramesh Boddu   |   14 Aug 2025 4:00 PM IST
ఎట్టకేలకు మృణాల్‌ కి కౌంటర్ ఇచ్చిన బ్యూటీ
X

మృణాల్‌ ఠాకూర్ ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ ఇతర భాషల్లోనూ వరుస సినిమాలు చేయడం వల్ల బిజీ హీరోయిన్‌గా పేరు సొంతం చేసుకుంది. సుదీర్ఘ కాలం పాటు ఇండస్ట్రీలో స్ట్రగుల్స్ ఎదుర్కొన్న మృణాల్‌ ఠాకూర్‌ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. సోషల్‌ మీడియాలో ఆమె రెగ్యులర్‌గా ఏదో ఒక కారణం వల్ల వివాదాస్పదం అవుతూనే ఉంటుంది. తాజాగా మృణాల్‌ ఠాకూర్‌ గతంలో చేసిన ఒక వ్యాఖ్య కారణంగా తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటూ వార్తల్లో నిలుస్తోంది. దాదాపు పదేళ్ల క్రితం మృణాల్ ఒక కార్యక్రమంలో భాగంగా అర్జత్‌ తనేజాతో మాట్లాడుతున్న సమయంలో కండలు తిరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అంటూ ప్రశ్నించింది. అదే సమయంలో ఆమె బిపాసా ను బాడీ షేమింగ్ చేసింది.

బాడీ షేమింగ్‌ వ్యాఖ్యలతో మృణాల్‌ వివాదాస్పదం

ఆ సమయంలో మృణాల్‌ కి పెద్దగా ఫేమ్‌ లేదు, ఆ వ్యాఖ్యలను జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఆమెకు ఫేమ్‌ వచ్చిందో, ఎప్పుడైతే ఆమె సినిమాలు జనాల్లోకి వస్తున్నాయో అప్పటి నుంచి బిపాసా గురించి మృణాల్‌ చేసిన వ్యాఖ్యలు సైతం మళ్లీ వార్తల్లోకి రావడం మొదలు అయింది. జనాలు ఆమె యొక్క వ్యాఖ్యలను తిరిగి షేర్‌ చేయడం ద్వారా వివాదాస్పదం అయింది. ఒక అమ్మాయి అయ్యి ఉండి మరో అమ్మాయి గురించి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ విమర్శలు చేసిన వారు చాలా మంది ఉన్నారు. బిపాసా వంటి స్టార్‌ హీరోయిన్‌, ఆమె ఫిజిక్ ఎంతో మందికి ఆదర్శంగా ఉంటుంది. అలాంటి హీరోయిన్‌ను ఎలా మీరు బాడీ షేమింగ్‌ చేస్తారు అంటూ ట్రోల్స్ మొదలు అయ్యాయి.

బిపాసా సోషల్‌ మీడియా పోస్ట్‌ వైరల్‌

మృణాల్‌ వ్యాఖ్యల గురించి ఇన్ని సంవత్సరాలు పట్టించుకోని బిపాసా ఎట్టకేలకు స్పందించింది. బాడీ షేమింగ్‌ గురించి మృణాల్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ అన్నట్లుగా బిపాసా సోషల్‌ మీడియా ద్వారా స్పందించింది. బలమైన మహిళలు ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటారు, అందమైన స్త్రీలు మనం బలంగా ఉండాలి అనుకుంటారు. దీన్ని బాడీ షేమింగ్‌ చేయడం ఏమాత్రం సరి కాదు. గతంలో ఎవరు ఏం మాట్లాడినా అది తప్పుడు వ్యాఖ్యలు అవుతాయి అన్నట్లుగా బిపాసా వ్యాఖ్యలు చేసింది. తన వ్యాఖ్యలకు మృణాల్ ఇప్పటికే స్పందించింది. తన వ్యాఖ్యలను తప్పుడు అర్థం వచ్చేలా ప్రచారం చేస్తున్నారు అంటూ ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఇప్పుడు బిపాసా స్పందించడంతో మరింతగా ఈ వివాదం ముదిరినట్లు అయింది.

మృణాల్‌కి మద్దతుగా నెటిజన్స్‌

ఈ మధ్య కాలంలో మృణాల్‌ సినిమాలతో ఎంతగా పాపులర్ అవుతుందో, అంతకు మించి వివాదాలతో వార్తల్లో నిలుస్తుంది. ఒక మోస్తరు వరకు వివాదాలు పర్వాలేదు, శృతి మించితే ఖచ్చితంగా కెరీర్‌ పై ప్రభావం ఉంటుంది అంటూ కొందరు మృణాల్‌ ను హెచ్చరిస్తున్నారు. గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మృణాల్‌ను వెంటాడుతున్నాయి. కనుక అప్పుడు చేసిన వ్యాఖ్యల విషయంలో విచారం వ్యక్తం చేస్తూ, తెలియక, అనుకోకుండా చేసిన వ్యాఖ్యలు అంటూ మృణాల్‌ క్షమాపణ అడిగితే అన్ని విధాలుగా బాగుంటుంది అనేది కొందరి అభిప్రాయం. ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన ఇప్పుడు ఎందుకు ప్రచారం చేస్తున్నారు అని, మృణాల్‌ ఎదుగుదలను ఓర్వలేక కొందరు ఇలా చేస్తున్నారని ఆమె అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.