బ్లాక్ డ్రెస్‌లో హీట్ పెంచేసిన మృణాల్ ఠాకూర్.. కిల్లర్ లుక్స్‌తో రచ్చ!
సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్‌లో దేవకన్యలా మెరిసిపోతున్న మృణాల్ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతూ ఫ్యాన్స్‌ను తీవ్రంగా ఆకట్టుకుంటున్నాయి.
By: Madhu Reddy | 19 Sept 2026 5:44 PM ISTతెలుగు ప్రేక్షకుల గుండెల్లో సీతారామం'తో చెరగని ముద్ర వేసుకున్న అందాల భామ మృణాల్ ఠాకూర్, తాజాగా పోస్ట్ చేసిన హాట్ పిక్స్‌తో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. క్లాసీ బ్లాక్ డ్రెస్‌లో తనదైన స్టైల్ మార్క్ చూపిస్తూ ఈ ముద్దుగుమ్మ ఇచ్చిన పోజులు నెటిజన్లను అవాక్కయ్యేలా చేస్తున్నాయి. సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్‌లో దేవకన్యలా మెరిసిపోతున్న మృణాల్ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతూ ఫ్యాన్స్‌ను తీవ్రంగా ఆకట్టుకుంటున్నాయి.
షాహిన్ మన్నన్ డిజైనర్ డ్రెస్‌లో మృణాల్ :
ఈ ప్రత్యేక ఫోటోషూట్ కోసం మృణాల్ ఠాకూర్ 'షాహిన్ మన్నన్' బ్రాండ్‌కు చెందిన ప్యాపీ ఫ్లవర్ బ్లౌజ్ అండ్ స్టేట్‌మెంట్ స్కర్ట్ అవుట్‌ఫిట్‌ను ఎంచుకుంది. ఇక ఫుల్ స్లీవ్స్ క్రాప్డ్ బ్లౌజ్, దానికి తగ్గట్టుగా ఉన్న హై-వేస్ట్ ఫుల్లీ ఫ్లేర్డ్ స్కర్ట్‌పై కింద భాగంలో ఎరుపు రంగు పూల ఎంబ్రాయిడరీ వర్క్ ఆమె లుక్‌కు గ్రాండ్ అప్పీల్‌ను తెచ్చిపెట్టింది. నడుము వద్ద సన్నని బెల్ట్, డోప్ కట్స్‌తో మృణాల్ ఎంతో రాయల్‌గా మెరిసిపోయింది.
ఫ్యాన్స్ ఫిదా.. నెట్టింట లైకుల వర్షం:
ఈ అద్భుతమైన పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. "బ్రీత్‌టేకింగ్ ప్రిన్సెస్", "అబ్సల్యూట్లీ స్టన్నింగ్ అండ్ గార్జియస్", "బ్లాక్ కలర్‌లో నీ అందం వేరే లెవెల్" అంటూ నెటిజన్లు పొగడ్తలతో నింపేస్తున్నారు. వెలుతురులో చిరునవ్వుతో ఉన్న మృణాల్ పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి.
బుల్లితెర నుంచి స్టార్ హీరోయిన్ వరకు :
మహారాష్ట్రకు చెందిన మృణాల్ ఠాకూర్, 'కుంకుమ భాగ్య' సీరియల్‌తో మంచి పాపులారిటీ సాధించి, 'లవ్ సోనియా' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 'సుపర్ 30', 'బాట్లా హౌస్' చిత్రాల్లో నటిగా మెప్పించిన ఈ భామ, 'సీతారామం'తో పాన్ ఇండియా లెవెల్లో భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత 'హాయ్ నాన్న', 'జర్సీ', 'ది ఫ్యామిలీ స్టార్' వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకుంది.
చేతిలో వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులు:
ఇక రీసెంట్ గా సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి 'దో దివానే షెహర్ మే', అడివి శేష్ సరసన బైలింగువల్ డ్రామా 'డెకాయిట్: ఏ లవ్ స్టోరీ', వరుణ్ ధావన్‌తో కలిసి 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' చిత్రాల్లో నటించి మంచి సక్సెస్ అందుకుంది..ఇక తన అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌తో పాటు విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకుంటున్న మృణాల్ ఠాకూర్, రాబోయే రోజుల్లో అన్ని భాషల్లోనూ మరిన్ని భారీ విజయాలు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
