Begin typing your search above and press return to search.

వీడియో : మృణాల్‌ను ఇలా సర్‌ప్రైజ్‌ చేసిన హీరో

మృణాల్‌ ఆగస్టు 1న పుట్టిన రోజు జరుపుకోనుంది. హీరో అడవి శేష్‌ 'డెకాయిట్‌' యూనిట్‌ సభ్యులతో కలిసి మృణాల్ ఠాకూర్‌ని సర్‌ప్రైజ్ చేశాడు.

By:  Ramesh Palla   |   31 July 2025 1:22 PM IST
వీడియో : మృణాల్‌ను ఇలా సర్‌ప్రైజ్‌ చేసిన హీరో
X

'సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించిన ముద్దుగుమ్మ మృణాల్‌ ఠాకూర్‌. ఇండస్ట్రీలో అడుగు పెట్టి బాలీవుడ్‌ సినిమాలు చేయడం మొదలు పెట్టి దాదాపుగా దశాబ్ద కాలం అవుతున్నా దక్కని గుర్తింపు టాలీవుడ్‌లో చేసిన సీతారామం సినిమాతో దక్కింది. తక్కువ సమయంలోనే మృణాల్‌ ఠాకూర్‌ టాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌గా నిలిచింది. హాయ్‌ నాన్నతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. టాలీవుడ్‌లో ఇబ్బడి ముబ్బడిగా సినిమా ఆఫర్లు వస్తున్నప్పటికీ చాలా సెలక్టివ్‌గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఉంది. ప్రస్తుతం తెలుగులో ఈమె అడవి శేష్‌ తో కలిసి 'డెకాయిట్‌' సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ ఏడాది చివర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు చకచక జరుగుతున్నాయి.

హ్యాపీ బర్త్‌డే మృణాల్‌ ఠాకూర్‌

మృణాల్‌ ఆగస్టు 1న పుట్టిన రోజు జరుపుకోనుంది. హీరో అడవి శేష్‌ 'డెకాయిట్‌' యూనిట్‌ సభ్యులతో కలిసి మృణాల్ ఠాకూర్‌ని సర్‌ప్రైజ్ చేశాడు. షూటింగ్‌ కాస్ట్యూమ్స్‌లోనే అందరూ ఉన్నారు. మృణాల్‌ సైతం ఆ సినిమాలోని పాత్ర లుక్‌లోనే ఉంది. ఆమెకు తెలియకుండా ఒక రూం లో యూనిట్‌ సభ్యులు అంతా బర్త్‌డేకి ప్లాన్‌ చేశారు. ఆమె తన బర్త్‌డేకి టైం ఉంది కదా అని కనీసం ఊహించలేదు. డోర్‌ తీసిన వెంటనే మృణాల్‌ కి ఒక్కసారిగా అంతా హ్యాపీబర్త్‌డే అంటూ గట్టిగా చెప్పడంతో పాటు, పెద్ద కేక్‌ ను ఏర్పాటు చేయడంతో మృణాల్‌ సర్‌ప్రైజ్‌ అయింది. ఆమె ఫేస్‌లో ఆనందం కనిపించింది. చాలా సంతోషంగా కేక్‌ను కట్‌ చేసింది. డెకాయిట్‌ నిర్మాత సుప్రియతో పాటు, హీరో అడవి శేష్‌ ఇతర యూనిట్‌ సభ్యులకు కేక్‌ ను షేర్ చేసింది.

డెకాయిట్‌ షూటింగ్‌ అప్‌డేట్‌

యూనిట్‌ సభ్యులు అంతా హ్యాపీ బర్త్‌డే అంటూ మృణాల్‌ కోసం పాట పాడుతున్న సమయంలో సరదాగా స్టెప్స్ వేసి చాలా ఉల్లాసంగా మృణాల్‌ ఠాకూర్ కనిపించింది. ఈ మొత్తం వీడియోను డెకాయిట్‌ సినిమాను నిర్మిస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌ అఫిషియల్‌ ఎక్స్‌ పేజ్‌ లో షేర్‌ చేయడం జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో చాలా కాలం తర్వాత రాబోతున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అడవి శేష్‌ నుంచి సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే అభిప్రాయం ఉంటుంది. ఈ సినిమా గత ఏడాదిలోనే ప్రారంభం అయినా కొన్ని కారణాల వల్ల హీరోయిన్‌ తప్పుకోవడం, ఆ స్థానంలో మృణాల్‌ను తీసుకోవడం, చకచక షూటింగ్‌ చేయడం జరుగుతుంది. ఈ ఏడాది క్రిస్మస్‌ కానుకగా 'డెకాయిట్‌' రాబోతున్నట్లు మృణాల్‌ బర్త్‌డే వీడియోతో అధికారికంగా ప్రకటన చేశారు.

అల్లు అర్జున్‌ - అట్లీ సినిమాలోనూ మృణాల్‌ ఠాకూర్‌

తెలుగులో మృణాల్‌ ఠాకూర్‌ చేస్తున్న మరో మూవీ అల్లు అర్జున్‌ - అట్లీ కాంబో మూవీ. దీపికా పదుకునే మెయిన్ లీడ్‌ గా ఆ సినిమాలో కనిపించబోతుండగా మృణాల్‌ ఠాకూర్‌తో పాటు మరో ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్‌ కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం అందుతోంది. మృణాల్‌ ఠాకూర్‌ తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్‌లో వరుసగా సినిమాలను చేస్తూనే ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటికే సన్నాఫ్ సర్ధార్‌ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వచ్చే ఏడాదిలో ఈమె మూడు హిందీ సినిమాలతో రాబోతుంది.

టాలీవుడ్‌లో ఉన్నంత క్రేజ్ బాలీవుడ్‌ లో ఇప్పటి వరకు దక్కించుకోలేక పోయిన మృణాల్‌ ఠాకూర్‌ ఆఫర్లను మాత్రం భారీగానే సంపాదించుకుంటుంది. తెలుగులో దక్కిన విజయాల కారణంగా హిందీలోనూ ఈమెకు ఆఫర్లు వస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.