Begin typing your search above and press return to search.

బాదం నూనేతోనే బ్యూటీ రెట్టింపు!

తాజాగా ముంబై బ్యూటీ మృణాల్ ఠాకూర్ స్కిన్ టోన్ మెరుపున‌కు గ‌ల కార‌ణాన్ని రివీల్ చేసింది.

By:  Srikanth Kontham   |   14 Sept 2025 12:00 AM IST
బాదం నూనేతోనే బ్యూటీ రెట్టింపు!
X

ఫిట్ నెస్, బ్యూటీ విష‌యంలో సెల‌బ్రిటీలు ఎంత‌కేర్ పుల్ గా ఉంటార్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ రెండు విష‌యాల్లో సెల‌బ్రిటీలు ఎంత మాత్రం రాజీ ప‌డ‌రు. యోగా, జిమ్ , డైట్ లాంటివి త‌ప్ప‌నిస‌రిగా భావిస్తారు. డే షెడ్యూల్ ఎంత బిజీగా ఉన్నా కొంత స‌మ‌యాన్ని త‌ప్ప‌క కేటాయిస్తారు. ఇలా ఫిట్ నెస్ విష‌యంలో ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా? బ్యూటీకి సంబంధించి భామా మ‌ణులంతా ప్ర‌త్యేక‌మైన టిప్స్ ఫాలో అవుతుంటారు. ఈ విష‌యంలో ఎవ‌రి ప్ర‌త్యేక‌త వారిది. కింగ్ నాగార్జున బ్యూటీ సీక్రెట్ ఏంటి? అంటే వాట‌ర్ అంటారు.

ఎంత వాట‌ర్ తాగితే అంత యాక్టివ్ గా, స్కిన్ టోన్ బాగుంటుందంటారు. సూపర్ స్టార్ మ‌హేష్ ను అడిగితే త‌న సీక్రెట్ ర‌న్నింగ్ అంటారు. రోజు గంట పాటు ర‌న్నింగ్ చేయ‌మంటారు. ఇక హీరోయిన్ల విషయంలో ఇలాంటి టిప్స్ అనేకం. తాజాగా ముంబై బ్యూటీ మృణాల్ ఠాకూర్ స్కిన్ టోన్ మెరుపున‌కు గ‌ల కార‌ణాన్ని రివీల్ చేసింది. రోజు రాత్రి ప‌డుకునే ముందు క్ర‌మం తప్ప‌కుండా ఓ స్పెష‌ల్ ఆయిల్ శ‌రీర‌మంతా అప్లై చేస్తాన‌ని తెలిపింది. ఈ టిప్ చెప్పింది త‌న మామ్ గా పేర్కొంది. ఇంత‌కీ ఆ టిప్ ఏంటి అంటే? శ‌రీర‌మంతా బాదం నూనే రాసుకోవ‌డం అంది. ఈ నూన వ‌ల్ల శ‌రీరం కాంతివంతంగా మారుతుందంది.

ఇందులో ఉండే విట‌మిన్ -ఇ, ఓమేగా ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు, ఇత‌ర ఖ‌నిజాలు పుష్క‌లంగా శ‌రీరానికి అందించా ల్సిన వాటిని స‌మ పాళ‌లో అందిస్తాయి. ఇది చ‌ర్మాన్ని స‌హ‌జ‌సిద్ద‌మైన మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది. యాంటీ ఏజింగ్ గుణాలు ఉండ‌టం వ‌ల్ల మ‌రింత య‌వ్వ‌నంగా, కాంతి వంతంగా క‌నిపిస్తామంది. వృద్ధాప్య ఛాయ‌లు కూడా త్వ‌ర‌గా రావంది. క‌ళ్ల‌కింద ఉండే న‌ల్ల మ‌చ్చ‌ల‌కు ఆ అయిల్ మంచి ప‌రి ష్కారంగా ప‌ని చేస్తుందంది. ఇలా రెగ్యుల‌ర్ గా చేయ‌గ‌లిగితే స‌హ‌జ‌సిద్ద‌మైన అందంగా క‌నిపిస్తామంది. ప్ర‌తీ సంద‌ర్బంలోనూ మ్యాక‌ప్ వేసుకునే అవ‌స‌రం కూడా ఉండ‌దు.

స‌హ‌జ‌సిద్ద‌మైన అందం ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తుంది. మ‌న‌సుకు ప్ర‌శాంతంగా అనిపిస్తుంద‌న్నారు. అదీ మృణాల్ ఠాకూర్ బ్యూటీ సీక్రెట్. ఇక ఈ బ్యూటీ కెరీర్ విష‌యానికి ఎంత బిజీగా ఉంద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగు, హిందీ సినిమాల‌తో క్ష‌ణం తీర‌క లేకుండా గ‌డుపుతోంది. ఈ అమ్మ‌డు న‌టించిన తెలుగు సినిమా న‌టించి కూడా ఏడాదికి పైగానే అవుతుంది. `ఫ్యామిలీ స్టార్` త‌ర్వ‌త క‌నిపించ‌లేదు. త్వ‌రలోనే `డెకాయిట్` పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది. తెలుగు, హిందీలో తెర‌కెక్కిస్తోన్న చిత్ర‌మిది. అలాగే అల్లు అర్జున్ -అట్లీ కాంబినేష‌న్ లో తెర‌క్కుతోన్న చిత్రంలోనూ న‌టిస్తుంది.