Begin typing your search above and press return to search.

నా వ్యాఖ్యల అర్థం మార్చేశారు : మృణాల్‌

సీతారామం చిత్రంతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన మృణాల్‌ ఠాకూర్‌ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.

By:  Ramesh Palla   |   8 Aug 2025 10:53 AM IST
నా వ్యాఖ్యల అర్థం మార్చేశారు : మృణాల్‌
X

సీతారామం చిత్రంతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన మృణాల్‌ ఠాకూర్‌ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. మొదటి సినిమాతోనే టాలీవుడ్‌లోనే స్టార్‌ హీరోయిన్‌గా నిలిచిన మృణాల్‌ ఠాకూర్‌ బాలీవుడ్‌లోనూ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. బాలీవుడ్లో దశాబ్ద కాలం పాటు సినిమాలు చేసినా దక్కని గుర్తింపు, స్టార్‌డం మృణాల్‌ ఠాకూర్‌కి టాలీవుడ్‌లో మొదటి సినిమా సీతారామంతో వచ్చింది. ఆ వెంటనే నానితో కలిసి హాయ్ నాన్న అంటూ నటించిన ఈ అమ్మడు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మృణాల్‌ ఉంది. సౌత్‌లో కంటే బాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేసే ఆసక్తిని ఈ అమ్మడు కనబర్చుతుంది.

మృణాల్‌ ఠాకూర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

ఎప్పుడూ అందమైన ఫోటోలు, వీడియోలు, సినిమాలతో వార్తల్లో ఉండే మృణాల్‌ ఠాకూర్‌ ఈసారి అనూహ్యంగా తన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా వార్తల్లో నిలిచింది. ఒక ఇంటర్వ్యూలో మృణాల్‌ ఠాకూర్‌ అందం గురించి మాట్లాడుతూ అందం ప్రమాణాలను నిర్ధేశించింది. అందం గురించి మృణాల్‌ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. చాలా మంది మృణాల్‌ చేసిన ఆ వ్యాఖ్యలను సమర్ధిస్తే కొందరు మాత్రం ఆమెను సోమరి అంటూ విమర్శలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు వ్యంగ్యంగా ఉన్నాయని కొందరు, ఆమె తీరు ఏమాత్రం కరెక్ట్‌ కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తానికి మృణాల్ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.

సోషల్‌ మీడియా విమర్శలకు క్లారిటీ

మృణాల్‌ తాజా ఇంటర్వ్యూలో తాను గతంలో అందం గురించి చేసిన వ్యాఖ్యల గురించి స్పందించింది. తన వ్యాఖ్యల యొక్క అర్థం పూర్తిగా మార్చేశారు. తాను అన్నట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు నేను చేయలేదు. నేను అందం గురించి ప్రమాణాలను నిర్దేశిస్తాను అని కొందరు అనుకుంటున్నారు, దాంతో జనాలు నేను సోమరి అని భావించారు. నా ఉద్దేశం ప్రకారం వంకరగా ఉండటానికి మరియు సోమరిగా ఉండటానికి మధ్య చాలా తేడా ఉంది. ఆ విషయం తెలియని వారు చాలా రకాలుగా విమర్శలు చేస్తున్నారు. వారు అందరికీ తాను ఈ సందర్భంగా వివరణ ఇస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. నా వ్యాఖ్యలను పూర్తిగా మార్చేసి కొందరు చేస్తున్నారు. చాలా మంది చాలా రకాలుగా తప్పుగా అర్థం చేసుకుంటున్న కారణంగా నేను ఇలా ముందుకు రావాల్సి వచ్చిందని మృణాల్‌ పేర్కొంది.

అల్లు అర్జున్‌-అట్లీ కాంబో మూవీలో మృణాల్‌

ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది ఇప్పటికే హిందీ మూవీ సన్నాఫ్‌ సర్దార్‌ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఆ సినిమా ఫలితం నుంచి బయట పడ్డ మృణాల్ ఠాకూర్‌ త్వరలో డెకాయిట్‌ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అడవి శేష్‌ హీరోగా రూపొందుతున్న ఆ సినిమాలో మృణాల్‌ ఠాకూర్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించబోతుంది. మృణాల్‌ ఠాకూర్‌ మరో వైపు అల్లు అర్జున్‌, అట్లీ కాంబోలో రూపొందుతున్న సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమాలు కాకుండా మరికొన్ని హిందీ సినిమాల్లోనూ ఈ అమ్మడు నటిస్తుంది. హిందీలో మరిన్ని సినిమాలు ఈ అమ్మడు ముందు ముందు చేసే అవకాశాలు ఉన్నాయి.