బిపాసాకు మృణాల్ సారీ.. షాకింగ్ కారణం!
అయితే `సీతారామం` బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఓ సందర్భంలో స్టార్ హీరోయిన్ బిపాసాపై ఘాటైన వ్యాఖ్యలు చేసింది.
By: Sivaji Kontham | 15 Aug 2025 2:15 PM ISTఒకరి అందాన్ని పొగడటం వరకూ ఓకే కానీ, వ్యంగ్యంగానో వెకిలిగానో లేదా సరదాగానో ఒకరి అందాన్ని కామెంట్ చేస్తే మాత్రం దానికి కచ్ఛితంగా క్షమాపణలు చెప్పాల్సిందే. ఈరోజుల్లో ప్రతిదీ మారిపోయింది. ఒకరి అందం గురించి లేదా శరీరాకృతి గురించి మాట్లాడితే చట్టపరమైన చర్యలు కూడా తీసుకునేవాళ్లు ఉన్నారు.
అయితే `సీతారామం` బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఓ సందర్భంలో స్టార్ హీరోయిన్ బిపాసాపై ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన త్రోబ్యాక్ వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతోంది.
ఈ వీడియోలో మృణాల్ తన సహనటుడితో సంభాషిస్తూ, ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? కండలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? అని ప్రశ్నించింది. అతడు అవును అనగానే... అయితే బిపాసాను పెళ్లి చేసుకో అని సూచించింది. బిపాసా కంటే తాను చాలా అందంగా ఉన్నానని కూడా మృణాల్ అంది. నిజానికి ఇది ఒక అబ్యూజ్. బిపాసాను తప్పుగా ప్రొజెక్ట్ చేయడం.. అందుకే ఈ వీడియో చూడగానే బిపాసా అభిమానులు మృణాల్ పై విరుచుకుపడ్డారు. ఈరోజుల్లో బలమైన మహిళలు ఒకరికొకరు ఆదరణ కలిగి ఉండాలని, మహిళలు శారీరకంగా, మానసికంగా బలంగా ఉండటానికి కండలు పెంచుకుంటే తప్పులేదని నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే ఈ మాటలకు మృణాల్ ఇప్పుడు క్షమాపణలు చెప్పింది. 19 వయసులో సరదాగా మాట్లాడాను. ఎవరినీ కించపరిచే ఉద్ధేశం లేదు. కానీ ఒకరిని బాధ కలిగించేలా ఒకరి శరీరాన్ని అవమానిస్తూ మాట్లాడకూడదని తెలుసుకున్నాను! అని మృణాల్ అంది. సరదాగా మాట్లాడినా అవి ఒకరికి ఎంత బాధను కలిగిస్తాయో తెలుసుకున్నానని, నేను అలా కాకుండా ఉత్తమంగా మాట్లాడాల్సిందని కూడా అంది. ప్రతి రూపంలోని అందానికి విలువ ఇవ్వడం తాను నేర్చుకున్నానని కూడా మృణాల్ చెప్పింది. గత వ్యాఖ్యలకు క్షమించండి.. ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించండి అని మృణాల్ పేర్కొంది. మృణాల్ ఎవరో తెలియని రోజుల్లో కామెంట్ అది.. పాత వీడియోని కొత్తగా తెరపైకి తెచ్చి దానిని వైరల్ చేయడం ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది.
