'రాకా' వల్లే ఆఫర్లన్నీ వదిలేస్తుందా..?
అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రూపొందుతున్న 'రాకా' సినిమాలో దీపికా పదుకునే మెయిన్ లీడ్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే.
By: Ramesh Palla | 13 Oct 2026 8:00 PM ISTఅల్లు అర్జున్, అట్లీ కాంబోలో రూపొందుతున్న 'రాకా' సినిమాలో దీపికా పదుకునే మెయిన్ లీడ్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. రాకాలో దీపికా కాకుండా మరో ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ కూడా నటిస్తున్నారనే వార్తలు చాలా నెలలుగా వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు అట్లీ అండ్ టీం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ముఖ్యంగా ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న కీలక పాత్రల్లో కనిపించబోతున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు కన్ఫర్మేషన్ రాలేదు. సినిమాలో వారిద్దరి ప్రజెన్స్ దాదాపుగా కన్ఫర్మ్ అని అంతా అంటున్నారు. సినిమా విడుదల సమయంలో అయినా వీరి పాత్రల గురించి ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి. అట్లీ సినిమా, అదీ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడంతో రాకా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కనుక మృణాల్ ఠాకూర్ చిన్న పాత్రలో కనిపించినా మంచి గుర్తింపు వస్తుందనే విశ్వాసంతో ఉన్నట్లు తెలుస్తోంది.
మృణాల్ ఠాకూర్ కొత్త సినిమా...
ఇటీవల ఒక మీడియా చిట్‌చాట్‌లో మృణాల్ తన కొత్త ప్రాజెక్ట్‌ల గురించి స్పందించింది. కొత్తగా ఈ మధ్య కాలంలో సినిమాలకు ఓకే చెప్పలేదు. అంతకు ముందు కమిట్ అయిన సినిమాలనే చేస్తున్నాను. మంచి కథల కోసం వెయిట్ చేస్తున్నాను, తప్పకుండా ఈసారి మంచి కథతో, మంచి పాత్రతో రావాలని అనుకుంటున్నాను అని మృణాల్ చెప్పుకొచ్చింది. గత 9 నెలల్లో ఒక్క కొత్త సినిమాకు సైన్ చేయలేదని చెప్పిన మృణాల్ ఠాకూర్ 'రాకా' సినిమాలో నటించే విషయాన్ని కన్ఫర్మ్ చేయలేదు. అంతే కాకుండా రాకా సినిమాలో నటించడం లేదు అని కూడా చెప్పలేదు. అందుకే మృణాల్ ఠాకూర్ రానా సినిమాలో ఉందనే చాలా మంది బలంగా నమ్ముతున్నారు. ఇక 9 నెలలుగా కొత్త సినిమాలకు సైన్ చేయక పోవడం వెనుక 'రాకా' సినిమా ఉందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాకా సినిమా తర్వాత మృణాల్ పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ పెట్టాలి అనుకుంటుందేమో అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
అల్లు అర్జున్ రాకా సినిమాలో...
మృణాల్ ఠాకూర్ ఈ మధ్య కాలంలో హిందీలో ఇతర భాషల్లో చేసిన సినిమాలు ఎక్కువగా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశను మిగిల్చాయి. ఒక్క డెకాయిట్ తప్ప అన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్‌గా నిలిచిన విషయం తెల్సిందే. డెకాయిట్ కూడా కమర్షియల్ గా గొప్ప విజయం కాకపోయినా, ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి, అలాగే సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. అందుకే డెకాయిట్ తో మృణాల్‌కి కాస్త ఊరట దక్కిందని చెప్పాలి. చేసిన సినిమాల్లో మెజార్టీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరుస్తున్న నేపథ్యంలో కొత్త సినిమాల ఎంపిక విషయమై మృణాల్ ఆచితూచి వ్యవహరిస్తుందని ఆమె సన్నిహితులు అంటున్నారు. పైగా ఆమె వద్దకు మంచి పాత్రలు కాకుండా చిన్న సినిమాలు, మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు మాత్రమే వస్తున్నాయట. అందుకే వాటిల్లోంచి ఒక సినిమాను మృణాల్ పిక్ చేసుకోలేక పోతుందనే టాక్ వినిపిస్తుంది.
అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న రాకా...
రాకా సినిమా విడుదల తర్వాత కచ్చితంగా తనకు మంచి పేరు వస్తుంది కనుక, రాకాతో పాన్ ఇండియా రేంజ్ లో మళ్లీ తన పేరు మారుమ్రోగుతుంది కనుక అప్పుడు పెద్ద సినిమా ఆఫర్లు, స్టార్స్ కు జోడీగా నటించే అవకాశాలు వస్తాయని మృణాల్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఆమె వచ్చిన ఆఫర్లన్నింటిని సున్నితంగా తిరస్కరిస్తూ వస్తుంది. రాకా సినిమాపై ఆమె పెట్టుకున్న నమ్మకం చాలా ఎక్కువగా ఉందని, ఆ స్థౄయిలో విజయం సాధించి, ఆమెకు అనుకున్న స్థాయిలో మంచి పేరు తెచ్చి పెట్టి, అప్పుడు ఆఫర్లు వస్తాయా అనేది చూడాలి. బాలీవుడ్‌తో పాటు, అన్ని వుడ్స్ లోనూ మృణాల్ ఠాకూర్ సినిమాలు చేసిన విషయం తెల్సిందే. కానీ ఇప్పుడు మాత్రం ఏ భాషలోనూ కొత్త సినిమాలు కమిట్ కాకుండా తిరస్కరిస్తూ వస్తుంది. వచ్చే ఏడాదిలో మృణాల్ కొత్త సినిమాలకు కమిట్ అయ్యేనా లేదంటే రాకా వచ్చిన తర్వాతే కొత్త సినిమాను కమిట్ అవుతుందా అనేది చూడాలి.
