Begin typing your search above and press return to search.

బన్నీ కోసం మృణాల్ ప్రాక్టీస్?

యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి అందరికీ తెలిసిందే. అందం, అభినయంతో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అమ్మడు.. టాలీవుడ్ లో స్పెషల్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుందనే చెప్పాలి.

By:  M Prashanth   |   19 Dec 2025 12:34 AM IST
బన్నీ కోసం మృణాల్ ప్రాక్టీస్?
X

యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి అందరికీ తెలిసిందే. అందం, అభినయంతో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అమ్మడు.. టాలీవుడ్ లో స్పెషల్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుందనే చెప్పాలి. బ్లాక్ బస్టర్ సీతారామం మూవీతో తెలుగులోకి వచ్చిన మృణాల్.. ఆ సినిమాతో ఓ రేంజ్ లో అందరినీ మెప్పించింది.

టాలీవుడ్ డెబ్యూ మూవీతోనే హిట్ అందుకున్న బ్యూటీ.. ఆ తర్వాత ఆమె నటించిన రెండో సినిమా హాయ్ నాన్న కూడా హిట్ గా నిలిచింది. కానీ ఫ్యామిలీ స్టార్ మూవీతో హ్యాట్రిక్ అందుకుంటారని అంతా అంచనా వేయగా.. అలా జరగలేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది.

ఇప్పుడు రొమాంటిక్ యాక్షన్ డ్రామా డెకాయిట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. యంగ్ హీరో అడివి శేష్ సరసన నటిస్తున్న ఆ మూవీ.. వచ్చే ఏడాది మార్చి 19వ తేదీన థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఆ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ నేడు జరగ్గా.. మృణాల్ ఠాకూర్ అటెండ్ అయ్యారు. పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

సినిమాలో డ్యాన్స్ చేస్తూ, ఉల్లాసంగా ఉండే మృణాల్ ఠాకూర్‌ ను ప్రేక్షకులు ఎప్పుడు చూడగలరని ఆమెను మీడియా ప్రతినిధి అడగ్గా.. వచ్చే ఏడాది అదే జరుగుతుందని తెలిపారు. ఇప్పుడు ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీలో మృణాల్ యాక్ట్ చేయడం నిజమేలా ఉందని అంటున్నారు.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో బన్నీ చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఆ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. అనేక మంది బ్యూటీలు ఇప్పటికే మూవీలో భాగమయ్యారు. అందులో మృణాల్ ఠాకూర్ కూడా ఒకరని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.

అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినప్పటికీ.. మృణాల్ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఆమె కామెంట్ తర్వాత.. బన్నీ, అట్లీ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సినిమాలో మృణాల్ కు సంబంధించిన డ్యాన్స్ మూమెంట్స్ ఉండనున్నాయని, అందుకోసం ఇప్పుడు రిహార్సల్స్ లో కూడా పాల్గొంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి అత్యాధునిక సాంకేతికతో రూపొందుతున్న బన్నీ, అట్లీ మూవీలో మృణాల్ ఏ రోల్ లో కనిపించనున్నారో.. ఎలా ఆకట్టుకుంటారో వేచి చూడాలి.