Begin typing your search above and press return to search.

డెకాయిట్ పని అయిపోవ‌చ్చిందిగా!

టాలెంటెడ్ హీరో అడివి శేష్ చేతిలో ప్ర‌స్తుతం రెండు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. వాటిలో ఒక‌టి డెకాయిట్ కాగా మ‌రోటి గూఢ‌చారి2.

By:  Sravani Lakshmi Srungarapu   |   5 Jan 2026 5:30 PM IST
డెకాయిట్ పని అయిపోవ‌చ్చిందిగా!
X

టాలెంటెడ్ హీరో అడివి శేష్ చేతిలో ప్ర‌స్తుతం రెండు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. వాటిలో ఒక‌టి డెకాయిట్ కాగా మ‌రోటి గూఢ‌చారి2. ఈ రెండు సినిమాల షూటింగ్ లో బిజిబిజీగా ఉన్నారు శేష్. అయితే ఈ రెండింటిలో ముందుగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సినిమా డెకాయిట్. షానియ‌ల్ డియో ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా రొమాంటిక్ రివెంజ్ డ్రామాగా రూపొందుతుంది.





డెకాయిట్ టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్

ఈ సినిమాలో అడివి శేష్ స‌ర‌స‌న మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా న‌టిస్తున్నారు. రీసెంట్ గా డెకాయిట్ నుంచి రిలీజైన టీజ‌ర్ కు ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావ‌డంతో సినిమాపై అంచ‌నాలు బాగా పెరిగాయి. వాస్త‌వానికి ఈ సినిమా డిసెంబ‌ర్ లోనే రిలీజ‌వాల్సింది కానీ షూటింగ్ లేట‌వ‌డం వ‌ల్ల ఈ సినిమా వాయిదా ప‌డి మార్చి 19కు పోస్ట్ పోన్ అయింది.

లాస్ట్ షెడ్యూల్ లో డెకాయిట్

అయితే డెకాయిట్ గురించి మూవీలో హీరోయిన్ గా న‌టిస్తున్న మృణాల్ ఠాకూర్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను షేర్ చేసి వార్తల్లో నిలిచారు. డెకాయిట్ లాస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేయడానికి తాను హైద‌రాబాద్ వెళ్తున్న‌ట్టు మృణాల్ త‌న ఇన్‌స్టా స్టోరీలో వెల్ల‌డించారు. మృణాల్ అప్డేట్ తో డెకాయిట్ షూటింగ్ దాదాపు ఆఖ‌రి ద‌శ‌కు చేరుకున్న‌ట్టు తెలుస్తోంది.

టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న అనురాగ్ క‌శ్య‌ప్

అయితే ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా శృతి హాస‌న్ ను తీసుకుని కొంత భాగం షూటింగ్ కూడా అయ్యాక ఆమె ఈ సినిమా నుంచి త‌ప్పుకోవ‌డంతో ఆ ప్లేస్ లో మృణాల్ ను రీప్లేస్ చేశారు మేక‌ర్స్. కాగా డెకాయిట్ మూవీతో అనురాగ్ క‌శ్య‌ప్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుండ‌గా, ఈ సినిమాలో ప్ర‌కాష్ రాజ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నారు. తెలుగు, హిందీ భాష‌ల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమాను సుప్రియ యార్ల‌గ‌డ్డ‌, సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు.