'MRP నీకెంత.. నాకెంత' ట్రైలర్.. ఎలా ఉందంటే?
నరేష్ అగస్త్య, వెన్నెల కిశోర్, సుదర్శన్ లీడ్ రోల్స్ లో నటించిన ఆ చిత్రానికి శ్రవణ్ జేస్తా దర్శకత్వం వహించారు.
By: M Prashanth | 11 July 2026 11:27 AM ISTఒక శవాన్ని కిడ్నాప్ చేసి కోట్ల రూపాయలు సంపాదించాలనుకునే నలుగురు యువకులు.. ఆ ప్లాన్ చుట్టూ తిరిగే వరుస ట్విస్టులు.. మధ్యలో పుట్టే నవ్వులు.. ఇవన్నీ కలిపి ఇంట్రెస్టింగ్ క్రైమ్ కామెడీని చూపించే ప్రయత్నమే 'MRP: నీకెంత.. నాకెంత'. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే ఇదొక రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాకుండా, డార్క్ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంగా కనిపిస్తోంది.
నరేష్ అగస్త్య, వెన్నెల కిశోర్, సుదర్శన్ లీడ్ రోల్స్ లో నటించిన ఆ చిత్రానికి శ్రవణ్ జేస్తా దర్శకత్వం వహించారు. ట్రైలర్ ప్రారంభం నుంచే కథలోని మెయిన్ ఎలిమెంట్ ను ప్రేక్షకుల ముందుంచుతూ ఆసక్తిని పెంచుతుంది. ఆస్పత్రిలోని మార్చురీలో పనిచేసే కొందరు యువకులు ఈజీగా డబ్బు సంపాదించాలని భావించి, గుర్తుతెలియని శవాన్ని కిడ్నాప్ చేసి భారీ మొత్తం డిమాండ్ చేయాలనే ప్లాన్ వేస్తారు. అయితే ఆ నిర్ణయం వారి జీవితాలను ఎలాంటి మలుపు తిప్పిందన్నదే కథగా కనిపిస్తోంది.
ట్రైలర్ లో క్రైమ్, థ్రిల్, కామెడీ మూడు అంశాలను ఈక్వల్ గా చూపించే ప్రయత్నం కనిపించింది. ముఖ్యంగా ప్రతి సీన్ లో కామెడీ మిక్స్ చేయడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఒకవైపు టెన్షన్ కొనసాగుతుండగా, మరోవైపు వెన్నెల కిశోర్, సుదర్శన్ పాత్రలు పంచే ఎంటర్టైన్మెంట్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఉంది. మత్తు వదలరా వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నరేష్ అగస్త్య మరోసారి భిన్నమైన పాత్రను ఎంచుకున్నారు.
ట్రైలర్ లో ఆయన యాక్టింగ్ నేచురల్ గా కనిపిస్తూ కామెడీ, సీరియస్ సీన్స్ లో కూడా ఆకట్టుకున్నారు. కథలోని ట్విస్టులను ముందుగానే బయటపెట్టకుండా ట్రైలర్ ను కట్ చేసిన తీరు కూడా సినిమాపై ఇంట్రెస్ట్ పెంచుతోంది. మూవీలో బాలీవుడ్ భామ డోనాల్ బిష్ట్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. హర్షవర్ధన్, కసిరెడ్డి రాజ్ కుమార్, చైతన్య జొన్నలగడ్డ, పృథ్వీరాజ్, గగన్ విహారి, నందగోపాల్, స్నేహ సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పాత్రలకు తగిన క్యాస్టింగ్ సెలెక్ట్ చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
టెక్నికల్ టీమ్ సినిమాకు స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. అజయ్ అరసాడ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ లోని థ్రిల్లింగ్ మూమెంట్స్ కు మరింత బలం చేకూర్చింది. రాకేష్ కొలాంచి సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ కూడా కథకు తగ్గట్టుగా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెరుగ్గా కనిపిస్తున్నాయి. శ్రవణ్ జేస్తా స్వయంగా దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టడం విశేషం.
ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. అదే సమయంలో టాలీవుడ్ లో కొత్త తరహా క్రైమ్ కామెడీలకు మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో, ఈ సినిమా కూడా అదే కోవలో నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. MRP: నీకెంత.. నాకెంత జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తే, ఎంటర్టైన్మెంట్ పాటు థ్రిల్ కోరుకునే ప్రేక్షకులకు సినిమా నచ్చేలా కనిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.
