Begin typing your search above and press return to search.

MRP.. నీకెంత?.. నాకెంత?

టాలీవుడ్‌ లో మరో ఇంట్రెస్టింగ్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. MRP నీకెంత నాకెంత అనే టైటిల్‌ తో తెరకెక్కుతున్న ఆ సినిమా ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌ తోనే దృష్టిని ఆకర్షించింది.

By:  M Prashanth   |   21 April 2026 3:46 PM IST
MRP.. నీకెంత?.. నాకెంత?
X

టాలీవుడ్‌ లో మరో ఇంట్రెస్టింగ్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. MRP నీకెంత నాకెంత అనే టైటిల్‌ తో తెరకెక్కుతున్న ఆ సినిమా ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌ తోనే దృష్టిని ఆకర్షించింది. తాజాగా విడుదలైన టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఆసక్తిని పెంచుతోంది. "మూడు ముఖాలు.. ఒకటే మ్యాడ్ నెస్" అనే క్యాప్షన్‌ తో వచ్చిన ఆ పోస్టర్ సినిమాలో ఏదో విభిన్నమైన కాన్సెప్ట్ ఉండబోతుందనే చెప్పకనే చెబుతోంది.





MRP చిత్రాన్ని దర్శకుడు శ్రవణ్ జెస్టా తెరకెక్కిస్తున్నారు. ప్రత్యేకత ఏమిటంటే.. ఆయనే సినిమాను నిర్మిస్తున్నారు కూడా. తక్కువ బడ్జెట్‌ తో కొత్త కథలు చెప్పే ప్రయత్నాలు పెరుగుతున్న ప్రస్తుత రోజుల్లో.. శ్రవణ్ జెస్టా ప్రయత్నం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారుతోంది. పోస్టర్‌ ను చూస్తేనే సినిమా టోన్ ఫన్, మాస్, కొంచెం మ్యాడ్‌ నెస్ మిక్స్‌ గా ఉండబోతుందనిపిస్తోంది.

ఇక క్యాస్టింగ్ విషయానికి వస్తే, ఆసక్తికరమైన నటీనటుల టీమ్ కనిపిస్తోంది. యువ నటుడు నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్‌ కు చెందిన డోనల్ బిష్ట్ హీరోయిన్‌ గా కనిపించనున్నారు. వీరితో పాటు నటుడు రాజ్ కుమార్, సుదర్శన్, అలాగే వెన్నెల కిషోర్ వంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హర్షవర్ధన్, స్నేహా సింగ్ వంటి నటీనటులు సినిమాలో భాగమయ్యారు.

క్యాస్టింగ్ ను బట్టి చూస్తే, సినిమాలో ఎంటర్టైన్మెంట్ కు పెద్దపీట వేసినట్లు అర్థమవుతోంది. టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్‌లో ముగ్గురు పాత్రలు వేర్వేరు యాటిట్యూడ్స్‌ తో కనిపించడం విశేషం. వారి చేతుల్లో ఉన్న ఆయుధాలు, స్టైలిష్ లుక్స్, బ్యాక్‌ గ్రౌండ్‌ లో ఉన్న సెటప్.. అన్నీ కలిపి సినిమా కథలో యాక్షన్, కామెడీ, డ్రామా ఉండనున్నట్టు సూచిస్తున్నాయి. ముఖ్యంగా పోస్టర్‌ లో ఉన్న కలర్ టోన్, లైటింగ్ స్టైల్ యువతను ఆకట్టుకునేలా ఉంది.

సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సంగీతం అజయ్ అరసడ అందిస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలను మార్తాండ్ కె వెంకటేష్ నిర్వహిస్తున్నారు. సినిమాటోగ్రఫీని రాకేష్ కొలంచి అందిస్తున్నారు. ఆ టీమ్ కలిసి సినిమాకు టెక్నికల్‌ గా మంచి అవుట్‌ పుట్ ఇవ్వబోతున్నారని చిత్ర యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తోంది. పాంచజన్య ఫీచర్స్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయని పోస్టర్‌ ను చూసి చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. సినిమా టీజర్ బుధవారం విడుదల కానుంది. టీజర్‌ తో సినిమా అసలు కాన్సెప్ట్ ఏమిటి, కథ ఎలా ఉండబోతుందన్నదానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పోస్టర్‌ తోనే ఆసక్తి రేకెత్తించిన ఈ మూవీ.. టీజర్‌ తో మరింత బజ్ క్రియేట్ చేసేలా ఉంది. మొత్తానికి.. విభిన్నమైన టైటిల్, క్రేజీ క్యాస్టింగ్, యూత్‌ ఫుల్ టోన్ కలిపి MRP సినిమాను ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ గా మార్చుతున్నాయి.