Begin typing your search above and press return to search.

మిస్ట‌ర్ బీస్ట్ త‌ర్వాత ప్ర‌పంచ‌వ్యాప్త ఆద‌ర‌ణ‌లో టి-సిరీస్ రికార్డ్!

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ (జిమ్మీ డోనాల్డ్‌సన్) తన అసాధార‌ణ‌మైన‌ రోజువారీ దినచర్యను తాజాగా విడుదలైన ఒక డాక్యుమెంటరీలో వెల్లడించారు.

By:  Sivaji Kontham   |   13 Jun 2026 10:00 PM IST
మిస్ట‌ర్ బీస్ట్ త‌ర్వాత ప్ర‌పంచ‌వ్యాప్త ఆద‌ర‌ణ‌లో టి-సిరీస్ రికార్డ్!
X

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ (జిమ్మీ డోనాల్డ్‌సన్) తన అసాధార‌ణ‌మైన‌ రోజువారీ దినచర్యను తాజాగా విడుదలైన ఒక డాక్యుమెంటరీలో వెల్లడించారు. జాన్ యూషాయ్ రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో పెద్ద పెద్ద ప్రొడక్షన్ ప్రాజెక్ట్‌లను చిత్రీకరించే సమయంలో తను సమయాన్ని ఎలా మేనేజ్ చేస్తాడో వివరించాడు. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం చేస్తున్న సరికొత్త టెలివిజన్ షో `బీస్ట్ గేమ్స్` చిత్రీకరణ సమయంలో రోజుకు కనీసం 15 గంటల కంటే తక్కువ పనిచేసిన రోజు లేదని.. అది ఒక అద్భుతమని అత‌డు పేర్కొన్నాడు. ప్రస్తుతం తన షెడ్యూల్ ప్రతి నిమిషానికి లెక్కగట్టి ప్లాన్ చేస్తున్నామ‌ని తెలిపాడు.

ఈ భారీ ప్రొడక్షన్ కోసం మిస్టర్ బీస్ట్ ఒకే సమయంలో తన ప్రధాన యూట్యూబ్ ఛానెల్‌ను.. కొత్త అమెజాన్ ప్రైమ్ షోను సమన్వయం చేసుకుంటూ రోజువారీగా ఎంతో ఒత్తిడితో కూడిన వ్యాపార వ్యవహారాలను బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఈ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ప్రాజెక్ట్ ప్రారంభమైన తర్వాత అతడి పనిభారం విపరీతంగా పెరిగింది. సమయాన్ని ఆదా చేయడానికి ప్రొడక్షన్ క్రూ ప్రత్యేకంగా స్టాండ్-ఇన్‌లను (డూప్స్) ఉపయోగిస్తోంది. వీరు ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తూ జిమ్మీ ఫైనల్ ఫోటో లేదా షాట్ కోసం వచ్చే ముందే ఫ్లోర్‌పై ఉన్న గ్రిడ్ సిస్టమ్ ఆధారంగా ప్రతి లైటింగ్, కెమెరా సెటప్‌ను సిద్ధం చేసి ఉంచుతారు. దీనివల్ల మిస్టర్ బీస్ట్ చాలా తక్కువ సమయంలో తన షూటింగ్స్ పూర్తి చేయగలుగుతున్నాడు.

భారీ చిత్రీకరణ రోజుల్లో జిమ్మీ డోనాల్డ్‌సన్ రోజుకు ఏకంగా 20 గంటల పాటు శ్రమిస్తున్నాడు. ఒకవైపు `బీస్ట్ గేమ్స్` కోసం 12లేదా 15 గంటు.. కొన్నిసార్లు 18 నుండి 20 గంటలు పనిచేస్తూ ఆ వెంటనే మళ్లీ తన మెయిన్ యూట్యూబ్ ఛానెల్ కంటెంట్ షూటింగ్‌లో పాల్గొనాల్సి వస్తోందని ఆ తర్వాత తిరిగి మళ్లీ బీస్ట్ గేమ్స్ పనిలోకి వెళ్తున్నానని ఆయన వివరించాడు. ఈ నిరంతర వ‌ర్క్ సైకిల్ వల్ల తనకు వ్యక్తిగత సమయం అస్సలు దొరకడం లేదని చెప్పాడు. ఇంటర్నెట్ ప్రపంచంలో నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతటి తీవ్రమైన ఒత్తిడి ఉంటుందో ఈ డాక్యుమెంటరీ హైలైట్ చేసింది. ఈ విధంగా అటు అంతర్జాతీయ డిజిటల్ రంగంలో మిస్టర్ బీస్ట్ తన కఠినమైన దినచర్యతో పక్కా ప్లానింగ్‌తో ప్రపంచంలోనే అతిపెద్ద వీడియోలను సృష్టిస్తూ కోట్లాది మందిని ఆకర్షిస్తున్నాడు.

నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉన్న యూట్యూబ‌ర్ మిస్ట‌ర్ బీస్ట్ ని ఇప్ప‌టివ‌ర‌కూ 50 కోట్ల మంది (500 మిలియ‌న్లు) అనుస‌రిస్తుండ‌గా.. ఆ త‌ర్వాతి స్థానంలో టీ సిరీస్ 312 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ తో రెండో స్థానంలో ఉంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఖ్యాతి ఘ‌డించిన మిస్ట‌ర్ బీస్ట్ తో పోటీప‌డేందుకు టి-సిరీస్ అధినేతలు అత్యంత భారీగా ఖ‌ర్చు చేస్తూ ఒరిజిన‌ల్ కంటెంట్ ని క్రియేట్ చేస్తోంది.