నయనతారపై టీఎన్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు!
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె. స్టాలిన్‌ని విమర్శించే క్రమంలో స్టార్ హీరోయిన్ నయనతారపై ఏఐఏడీఎంకె ఎంపీ షణ్ముగం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
By: Ravindar Gorantla | 17 March 2026 5:07 PM ISTరాజకీయ నాయకులు, సీనియర్ నటుల ఈ మధ్య స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకోగానే అన్నీ మరిచి ఇష్టానుసారం స్టేట్‌మెంట్‌లు ఇస్తుండటం, అవి వివాదాస్సదంగా మారి చివరికి ట్రోలింగ్‌కి గురై విమర్శలు వెల్లువెత్తడంతో క్షమాపణలు చెప్పడం సర్వసాధారణంగా మారింది. రాజకీయ నాయకులు ఈ మధ్య హద్దులు దాటి మాట్లాడటం, ఆ తరువాత చేసిన తప్పు తెలుసుకుని ఫీలవ్వడం కూడా జరిగిన సంఘటనలున్నాయి. తాజాగా అలాంటి ఓ ఘటనే ఇప్పుడు తమిళనాడులో జరిగింది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె. స్టాలిన్‌ని విమర్శించే క్రమంలో స్టార్ హీరోయిన్ నయనతారపై ఏఐఏడీఎంకె ఎంపీ షణ్ముగం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ప్రజలు తమ కలలను పంచుకోవాలని, వాటిని నెరవేర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇస్తూ టీఎన్ ముఖ్యమంత్రి స్టాలిన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలని ఉద్దేశిస్తూ తమిళనాడులో మహిళలకు మరింత భద్రతను, గౌరవాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న షణ్ముగం సంచలన వ్యాఖ్యలు చేశారు.
అబ్దుల్ కలాం కలలు కనమన్నారు. మన సీఎం స్టాలిన్ మీ కలలేవో చెప్పండి ప్రభుత్వం నెరవేరుస్తుంది అని చెప్పారు. మరి నాకు నయనతార కావాలి. నా కలను నిజం చేస్తారా? ఎవరైనా ఆమెతో పెళ్లి కుదర్చమని అడిగితే ఆ కోరికను నెరవేరుస్తారా?` అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు తమిళనాట తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మహిళలకు సంబంధించిన మీటింగ్‌లో పాల్గొన్న ఎంపీ ఇలాంటి చౌకబారు, దిగజారుడు వ్యాఖ్యలు చేయడం ఏంటని నెటిజన్‌లు ఎంపీపై విమర్శలు గుప్పిస్తున్నారు.
మహిళల రక్షణ కోసం చేస్తున్న పోరాటం అని చెబుతున్న ఎంపీ మహిళల సాక్షిగా మరో మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని, ఇలాంటి వాళ్లని రాజకీయల నుంచి సస్పెండ్ చేయాలని ఫైర్ అవుతున్నారు. దీంతో ఏఐఏడీఎంకె ఎంపీ షణ్ముగం నెట్టింట వైరల్‌గా మారి తీవ్ర చర్చకు తెరలేపింది. స్టేజ్‌పై రాజకీయ నాయకులు ఒళ్లు తెలియకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇలాంటి వారిని పార్టీలు ఎలా ప్రోత్సహిస్తున్నాయని, తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఎంపీ షణ్ముగంపై ఏఐఏడీఎంకె చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవల తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు త్రిషలో అనుచిత వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. విజయ్‌ని విమర్శించే క్రమంలో గత కొన్నేళ్లుగా త్రిష ఇంట్లో ఉంటున్న విజయ్ అందులోంఇ బయటికి రావాలని స్టేట్‌మెంట్ ఇవ్వడం తమిళనాట పెద్ద చర్చకు దరి తీసింది. దీనిపై త్రిష తీవ్ర స్థాయిలో స్పందించడంతో సదరు బీజేపీ లీడర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించడంతో వివాదం సద్దుమనిగింది. తాజా వివాదంపై నయనతార ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
