Begin typing your search above and press return to search.

'మౌగ్లీ' సయ్యారే మెలోడీ.. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమించేలా..

ఇప్పుడు రోషన్‌తో 'మౌగ్లీ 2025' అనే ఒక యూనిక్ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

By:  M Prashanth   |   24 Oct 2025 3:16 PM IST
మౌగ్లీ సయ్యారే మెలోడీ.. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమించేలా..
X

యాంకర్ సుమ కుమారుడు హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకోవాలి అని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. 'బబుల్‌గమ్'తో డీసెంట్ డెబ్యూ అందుకున్న ఈ యంగ్ హీరో , ఇప్పుడు తన రెండో సినిమాతో ఆడియన్స్‌ను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈసారి ఏకంగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సందీప్ రాజ్‌తో చేతులు కలపడం విశేషం. 'కలర్ ఫోటో' లాంటి ఫీల్ గుడ్ మూవీని అందించిన సందీప్, ఇప్పుడు రోషన్‌తో 'మౌగ్లీ 2025' అనే ఒక యూనిక్ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.




ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచగా, ఇప్పుడు మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్లను స్టార్ట్ చేశారు. అందులో భాగంగా, సినిమాలోని మొదటి సింగిల్ 'సయ్యారే'ను తాజాగా విడుదల చేశారు. ఈ పాట వింటుంటే, సినిమాలోని ఫీల్ ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది.

ఈ పాటలో ఒక యూనిక్ లవ్ స్టోరీని చూపించారు. హీరోయిన్ (సాక్షి మడోల్కర్)కు మాటలు రావు, వినపడదు. ఆమెను ప్రేమించిన హీరో (రోషన్ కనకాల), ఆమె ప్రపంచంలోకి వెళ్లడానికి, సౌండ్ బ్లాక్ చేసే ఒక ఇయర్ డివైజ్‌ను పెట్టుకుని తన వినికిడి శక్తిని త్యాగం చేస్తాడు. ఆమెకు బదులివ్వలేని ప్రేమను నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తానని ఒక లెటర్ రాసి ఇవ్వడం చాలా టచింగ్‌గా ఉంది.

'సయ్యారే' పాటను వినగానే మనసును తాకే ఒక స్వచ్ఛమైన ప్రేమకథ మన కళ్ల ముందు కదులుతుంది. టాలెంటెడ్ కంపోజర్ కాల భైరవ అందించిన మెలోడియస్ ట్యూన్, బ్యూటిఫుల్ ఆర్కెస్ట్రేషన్ పాటకు ప్రాణం పోశాయి. దీనికి ఆస్కార్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్ అంతే అందమైన, అర్థవంతమైన సాహిత్యాన్ని అందించారు. హీరో హీరోయిన్ల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమను ఆయన పదాలు అద్భుతంగా వర్ణించాయి.

కాల భైరవ స్వయంగా ఈ పాటను ఆలపించగా, ఐశ్వర్య దరూరి వాయిస్ పాటకు మరింత మాధుర్యాన్ని జోడించింది. రోషన్ కనకాల తన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. సాక్షి మడోల్కర్‌తో అతని కెమిస్ట్రీ చాలా క్యూట్‌గా ఉంది. 'సయ్యారే' పాట కచ్చితంగా చార్ట్‌బస్టర్‌గా నిలిచేలా ఉంది. మంచి కంపోజిషన్, అర్థవంతమైన సాహిత్యం, సోల్‌ఫుల్ వోకల్స్, అందమైన విజువలైజేషన్.. అన్నీ పర్ఫెక్ట్‌గా కుదిరాయి.

ఈ చిత్రంలో బండి సరోజ్ కుమార్ విలన్‌గా నటిస్తుండగా, హర్ష చెముడు కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. రామ మారుతి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, 'మౌగ్లీ 2025' డిసెంబర్ 12న థియేటర్లలోకి రానుంది. మరి ఈ సినిమాతో రోషన్ ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటాడో చూడాలి.