Begin typing your search above and press return to search.

సెన్సార్ బోర్డుకు 'మోగ్లీ' మేకర్స్ సారీ.. ఏం జరిగిందంటే?

ఆ సమయంలో సెన్సార్ సభ్యులు ఏ సర్టిఫికెట్ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. మోగ్లీ సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చిందని, కానీ సినిమా ఏం అసభ్యంగా ఉండదని సరోజ్ తెలిపారు.

By:  M Prashanth   |   11 Dec 2025 9:59 PM IST
సెన్సార్ బోర్డుకు మోగ్లీ మేకర్స్ సారీ.. ఏం జరిగిందంటే?
X

నిజానికి డిసెంబర్ 12వ తేదీన మోగ్లీ విడుదల కావాల్సి ఉండగా.. బాలయ్య అఖండ 2 తాండవం మూవీ వస్తుండడంతో ఒక రోజు ఆలస్యంగా వస్తోంది. సెన్సార్ బోర్డు అధికారులు ఏ సర్టిఫికెట్ ఇవ్వగా.. 160 నిమిషాల క్రిస్పీ రన్ టైమ్ తో విడుదల అవుతుంది. అయితే రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. సినిమాలో విలన్ గా చేసిన బండి సరోజ్ కూడా అటెండ్ అయ్యారు.

ఆ సమయంలో సెన్సార్ సభ్యులు ఏ సర్టిఫికెట్ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. మోగ్లీ సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చిందని, కానీ సినిమా ఏం అసభ్యంగా ఉండదని సరోజ్ తెలిపారు. సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ భయపడిపోయాడంటా అంటూ ఎద్దేవా చేస్తున్నట్లు మాట్లాడారు. ఎవడ్రా వీడు... వీడి పెర్ఫార్మెన్స్ ఏంటి... అని అన్నారని తెలిపారు.

రూత్‌ లెస్‌ కాప్‌ లా నటించలేదని భయపడి ఏ సర్టిఫికెట్ ఇచ్చారంటా.. ఆ విషయం తనకు డైరెక్టర్ సందీప్ రాజ్ చెప్పారంటూ మాట్లాడారు. దీంతో సరోజ్ కామెంట్స్ వైరల్ గా మారాయి. కాస్త వివాదానికి దారితీశాయి. దీంతో ఆ తర్వాత 'సెన్సార్ ఆఫీసర్ గారు.. నా ప్రవర్తనకు సారీ' అంటూ సోషల్ మీడియాలో సరోజ్ కుమార్ బహిరంగ క్షమాపణలు తెలిపారు.

ఆ తర్వాత నిర్మాత విశ్వప్రసాద్ కూడా సారీ చెప్పారు. సెన్సార్ ఆఫీసర్, మెంబర్స్ ను ఉద్దేశించి స్పెషల్ నోట్ ను తాజాగా విడుదల చేశారు. బండి సరోజ్ అనుకోకుండా చేసిన వ్యాఖ్యలకు తాము విచారం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. సెన్సార్ ప్రక్రియను తాము ఎప్పుడూ అత్యంత గౌరవంగా భావిస్తామని తెలిపారు. ఎంతో గౌరవం ఉందని చెప్పారు.

అత్యుత్తమ పరిపాలనా నైపుణ్యం, పరిశ్రమలో విశేష అనుభవం ఉన్న సభ్యులతో కూడిన సెన్సార్ బృందం అందించే మార్గదర్శకాలను ఎప్పుడూ పాటిస్తామని వెల్లడించారు. అందుకే సరోజ్ వ్యాఖ్యలు అనుకోకుండా చేసినవిగా భావించి, క్షమించాలని కోరుతున్నామని తెలిపారు. ఆ కంటెంట్ ను సోషల్ మీడియా నుంచి కూడా తొలగిస్తున్నామని అన్నారు. సెన్సార్ అధికారుల నిరంతర సహకారం, మద్దతుకు కృతజ్ఞతలు చెప్పారు విశ్వప్రసాద్.