ఈ హైప్ ఎక్కించే పనులు అవసరమా..?
స్టార్ సినిమా అయినా మీడియా రేంజ్ సినిమా అయినా సరే ఈమధ్య మేకర్స్ సినిమాపై కావాల్సినంత కాదు కాదు దానికి మించి హైప్ ఎక్కిస్తున్నారు.
By: Ramesh Boddu | 17 Oct 2025 4:00 PM ISTస్టార్ సినిమా అయినా మీడియా రేంజ్ సినిమా అయినా సరే ఈమధ్య మేకర్స్ సినిమాపై కావాల్సినంత కాదు కాదు దానికి మించి హైప్ ఎక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఈ హీరో లెక్క వేరేలా ఉంటుంది.. ఈ సినిమాలో మా హీరో విశ్వరూపం చూపించాడంటూ చెబుతుంటారు. అలా విశ్వరూపం అని డైరెక్టర్ లేదా సినిమా నిర్మాతలు ఎవరైనా చెబితే మాత్రం ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సందర్భాలు ఉన్నాయి.
హైప్ కి తగ్గ కథ కథనాలు లేకపోతే మొదటి షోతోనే..
ఉదాహరణలు చాలా ఉన్నాయి కానీ అలాంటివి తీసుకుని చెప్పడం కన్నా సినిమాపై ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే క్రమంలో మేకర్స్ చేసే ఈ కామెంట్స్ వల్ల హైప్ ఎక్కించడం అటుంచితే ఆ హైప్ కి తగ్గ కథ కథనాలు లేకపోతే మొదటి షోతోనే తేడా వచ్చేస్తుంది. అసలే ఆడియన్స్ థియేటర్ కి వెళ్లి సినిమా చూసే శాతం బాగా తగ్గింది. ఇలాంటి టైం లో హీరో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్, మీరంతా షాక్ అవుతారు.. హీరో విశ్వరూపం లాంటి స్టేట్మెంట్స్ బజ్ క్రియేట్ చేస్తాయి.
ఆ రేంజ్ ఉన్నా కూడా ఎంత తక్కువ అంచనాలతో వస్తే అంత ఎక్కువ ఇంపాక్ట్ అవుతుందని మేకర్స్ భావించాలి. ఐతే కొన్ని సినిమాల గురించి ముందు హింట్ ఇస్తే ఆడియన్స్ దానికి ప్రిపేర్ అయ్యి వస్తారన్నది తెలుసు. కానీ అదేదో కాస్త రిలీజ్ ముందు వరకు ఆగితే సరిపోతుంది. ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లో వచ్చే సినిమాకు ఇప్పుడు అదిరిపోతుంది అని ఊరించినా ఫలితం ఉండదు.
డైరెక్టర్స్ స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకుంటే మాత్రం..
రీసెంట్ గా ఒక డైరెక్టర్ నెక్స్ట్ ఒక క్రేజీ హీరో సినిమా గురించి చెబుతూ హీరోని ఆ సినిమాలో చూసి షాక్ అవుతారు.. విశ్వరూపం చూపిస్తాడని అన్నారు. ఐతే ఇలా డైరెక్టర్స్ స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకుంటే మాత్రం అది రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అఫ్కోర్స్ సినిమా బాగా వస్తుండొచ్చు కానీ ఈ కామెంట్స్ వల్ల ఆడియన్స్ ఇంకా భారీ అంచనాలతో వస్తాడు. దానికి ఏమాత్రం తగ్గినా కూడా పెదవి విరిచేస్తాడు. సో ప్రమోషన్ అనేది సినిమాకు ప్లస్ అయ్యేలా ఉండాలి కానీ ఆడియన్స్ ని మిస్ గైడ్ చేయకూడదు అన్నది సినీ విశ్లేషకుల కామెంట్.
కొన్ని సినిమాలు హైప్ తక్కువతో వచ్చినా సరే రిలీజ్ తర్వాత ఆ సినిమా ఇచ్చే హై తో ఆడియన్స్ దాన్ని పెద్ద హిట్ చేస్తారు. మరికొన్ని సినిమాలు పెద్ద స్టేట్మెంట్స్, భారీ హైప్ తో వచ్చినా అవి ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ అవ్వలేక చతికిల పడతాయి. ఐతే ఆడియన్స్ కు ఎంగేజ్ అయ్యేలా సినిమా చేయాలన్న ఫోకస్ తప్ప సినిమాను హైప్ ఎక్కిస్తే వచ్చే లాభం ఏమి ఉండదు. ఈ విషయంలో ప్రతి డైరెక్టర్ కచ్చితంగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
