నార్త్ లో రూ.500 కోట్లు.. ఏఏ సినిమాలు వసూలు చేశాయంటే?
అలా అన్ని అంశాలు సెట్ అయితే వందల కోట్ల వసూళ్లు సాధిస్తాయి చిత్రాలు. అయితే ఇప్పటి వరకు నార్త్ లో వివిధ మూవీలు రూ.500 కోట్లు సాధించాయి. ఆ వివరాలు..
By: M Prashanth | 16 Oct 2025 1:00 AM ISTనార్త్ మార్కెట్.. ఏ సినిమాకు అయినా అది కీలకం. లాభాలు రావాలంటే అక్కడ మూవీ మంచి వసూళ్లు సాధించాలి. కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్ గా కలెక్షన్లు వస్తాయి. అలా అన్ని అంశాలు సెట్ అయితే వందల కోట్ల వసూళ్లు సాధిస్తాయి చిత్రాలు. అయితే ఇప్పటి వరకు నార్త్ లో వివిధ మూవీలు రూ.500 కోట్లు సాధించాయి. ఆ వివరాలు..
బాహుబలి 2: ది కన్క్లూజన్ మూవీ నార్త్ లో రూ.500 కోట్ల క్లబ్ లోకి మొదటగా ప్రవేశించింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎనిమిది సినిమాలు ఆ మార్క్ ను అందుకున్నాయి. అందులో కొన్ని హిందీ సినిమాలు కూడా ఆ మార్కును తాకగలిగాయి. ఆ సినిమాలు ఏంటి? ఎంత వసూళ్లు సాధించాయి? వంటి వివరాలు తెలుసుకుందాం.
1. బాహుబలి 2: ది కన్క్లూజన్
2. పుష్ప 2: ది రూల్
3. స్త్రీ 2
4. జవాన్
5. పఠాన్
6. గదర్ 2
7. చావా
8. యానిమల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లీడ్ రోల్ లో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప 2: ది రూల్ మూవీ నార్త్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. భారీ వసూళ్లను సాధించి అనేక కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఫుల్ రన్ లో రూ.750 కోట్ల వసూళ్లు సాధించింది. మరోవైపు, హారర్ కామెడీ మూవీ.. నార్త్ లో రూ.585 కోట్ల కలెక్షన్లు సాధించి సత్తా చాటింది.
విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చావా మూవీ అనేక మందిని మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద రూ.570 కోట్లు సాధించింది. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ లీడ్ రోల్ లో నటించి జవాన్ మూవీ.. నార్త్ లో రూ.565 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది.
షారుక్ మరో మూవీ పఠాన్ రూ. 515 కోట్ల మార్కును తాకాయి. యాక్షన్ డ్రామా గదర్ 2 మూవీ రూ.525 కోట్ల వసూళ్లు సాధించింది. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా.. రూ.500 కోట్లు సాధించాయి. మరి ఫ్యూచర్ లో ఎన్ని సినిమాలు నార్త్ లో రూ.500 కోట్ల వసూళ్లు సాధిస్తాయో వేచి చూడాలి.
