ఇక నుంచి 3 గంటల సినిమాలేనా..?
స్టార్ సినిమాలే కాదు చిన్న సినిమాలు కూడా మంచి కథ కథనాలతో ఎక్కువ రన్ టైం తో వచ్చినా కూడా ఇంప్రెస్ చేస్తున్నారు.
By: Ramesh Boddu | 7 Dec 2025 4:00 PM ISTఒక సినిమా లెంగ్త్ ఎంత అన్నది డిసైడ్ చేయాల్సి వస్తే.. అనుకున్న కథ.. అనుకున్న విధంగా కన్వే అవుతుందా లేదా అన్నది రష్ చూసి ఫైనల్ ఎడిటింగ్ చేశాక డైరెక్ట్ డిసైడ్ చేస్తాడు. ఐతే కొన్నిసార్లు రన్ టైం ఇష్యూ అదే డ్యూరేషన్ ఎక్కువ అవ్వడం వల్ల కొన్ని మంచి సీన్స్ ని కూడా ట్రిమ్ చేయాల్సి వస్తుంది. ఒకప్పుడు అంటే రీల్ కాబట్టి అలా కట్ చేయడం కోసం ఎక్కువ ఇబ్బంది పడే వారు కానీ డిజిటల్ లోకి మారిన తర్వాత ఎంత కావాలంటే అంత తీసేస్తున్నారు. అయినా సరే ఇప్పటికీ రెండున్నర గంటల సినిమా కోసం 4 గంటల రష్ తీసే వాళ్లు ఉన్నారు.
సినిమా అంటే రెండున్నర గంటలే..
ఐతే ఈమధ్య డైరెక్టర్స్ పంథా మారింది సినిమా అంటే రెండున్నర గంటలే అన్న ఆడియన్స్ మైండ్ సెట్ మార్చేశారు. టైట్ స్క్రీన్ ప్లే.. గ్రిప్పింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లే ఉంటే సినిమా రన్ టైం 3 గంటల పైన ఉన్నా కూడా సినిమా చూస్తారని ప్రూవ్ చేస్తున్నారు. ఈమధ్య చాలా సినిమాలు అది నిరూపించాయి. పుష్ప 2, యానిమల్, బాహుబలి ఎపిక్ తో పాటు కొన్ని చిన్న సినిమాలు కూడా లెంగ్త్ ఎక్కువ ఉన్నా కూడా ఆడియన్స్ ని మెప్పించాయి.
ఇప్పుడు ఇదే తరహాలో బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ చేసిన దురంధర్ కూడా లెంగ్త్ ఎక్కువ ఉన్నా కూడా ఆడియన్స్ ఆ సినిమాను యాక్సెప్ట్ చేశారు. సినిమాలో మ్యాటర్ ఉంటే రన్ టైం కాస్త ఎక్కువ ఉన్నా ప్రేక్షకుల నుంచి ఆమోదం ఉంటుందని మరోసారి ఈ సినిమా ప్రూవ్ చేసింది. అనుకున్న కథను బోర్ కొట్టించకుండా తీసుకెళ్లినప్పుడే డైరెక్టర్ సక్సెస్ అవుతాడు. ఈ క్రమంలో పైన చెప్పిన పెద్ద సినిమాలతో పాటు దురంధర్ కూడా నిలిచింది.
ఎక్కువ రన్ టైం తో వచ్చినా కూడా..
స్టార్ సినిమాలే కాదు చిన్న సినిమాలు కూడా మంచి కథ కథనాలతో ఎక్కువ రన్ టైం తో వచ్చినా కూడా ఇంప్రెస్ చేస్తున్నారు. ఇంకాస్త సినిమా ఉంటే బాగుండేది అనేలా సీన్స్ పడటంతో తప్పకుండా ఆ సినిమా రన్ టైం ఎంత ఉన్నా సరే ప్రేక్షకులకు బోర్ కొట్టదు. సో డైరెక్టర్ తన సినిమాను ఇలా ల్యాగ్ లేకుండా బోర్ కొట్టించకుండా చెప్పాలనుకున్న కథ కాస్త లెంగ్త్ ఎక్కువ చేసినా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పొచ్చు.
సో చిన్నగా ఈ మూమెంట్ నే అందరు ఫాలో అయితే రెండున్నర గంటల సినిమా కాస్త నెక్స్ట్ 3 గంటల సినిమాగా మారే అవకాశం ఉంటుంది. ఐతే సినిమా డ్యూరేషన్ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంటే ఓకే కానీ అదే 3 గంటల సినిమా బోర్ కొట్టేస్తే మాత్రం నెక్స్ట్ ఆట నుంచే అంతకంత నెగిటివిటీ ఫేస్ చేయాల్సి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్స్ 3 గంటల లెంగ్త్ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది.
