Begin typing your search above and press return to search.

సినిమా ప్లాపైతే ఎడిటర్స్ ను ఎందుకు నిందిస్తున్నారు... మూవీ రిజల్ట్ లో ఆయన పాత్ర ఎంత..?

కొంతమంది దర్శకులు ఎడిటర్ నిర్ణయానికి వాల్యూ ఇస్తున్నారు. కానీ కొందరు దర్శకులు మాత్రం ఎడిటర్లకి పూర్తి స్వేచ్చనైతే ఇవ్వడం లేదు.

By:  Gopi Velupala   |   29 Sept 2026 10:25 AM IST
సినిమా ప్లాపైతే ఎడిటర్స్ ను ఎందుకు నిందిస్తున్నారు... మూవీ రిజల్ట్ లో ఆయన పాత్ర ఎంత..?
X

ఒక సినిమా సక్సెస్ అయితే సినిమాలో నటించిన నటీనటులకు సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు వస్తుంది. ఇక సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఒకరిని ఒకరు దూషించుకుంటూ ఆ సినిమా నీవల్లే ఫ్లాప్ అయిందని నిందించుకుంటూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే సినిమా కథ బాగుంటే ప్రేక్షకుడికి నచ్చుతుంది. దర్శకుడు దానిని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసినప్పుడు మిగతా అన్ని క్రాఫ్ట్ ల వారు దర్శకుడికి పూర్తి సహాయ సహకారాలను అందిస్తే సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా బ్లాక్ బాస్టర్ సక్సెస్ గా నిలుస్తుంది.

ఇలాంటి క్రమంలోనే సినిమా బాగుంటే అది అందరి క్రెడిట్ గా భావిస్తున్నారు. సినిమా అంత ఎఫెక్టివ్ గా లేకపోతే దాన్ని ఎడిటర్ మిస్టేక్ గా పరిగణిస్తున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అంటే దానికి ఎడిటర్ మిస్టేక్ అంటూ చాలామంది చాలా రకాల వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు. నిజానికి ఒక సినిమా సక్సెస్ లో గాని ఫెయిల్యూర్ లో గాని ఎడిటర్ పాత్ర ఎంత ఉంటుందనే డౌట్ మనలో చాలామందికి వచ్చే ఉంటుంది.

దర్శకుడు షూటింగ్ స్పాట్ లో తన మేకింగ్ విజువల్స్ ని తీసుకుని వస్తాడు. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ తను పెట్టిన బ్లాక్స్ బాగుండాలి అలాగే సినిమాలోని కథని ఎలివేట్ చేస్తుండాలి. డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ షూట్ చేసుకొని వచ్చిన రా పుటెజ్ లో ఉన్న షాట్స్ ను చూస్తూ ఎమోషన్ ను బ్యాలెన్స్ చేస్తూ ఎడిటర్ ఏ షాట్ తర్వాత ఏ షాట్ ఉండాలి అనేది ఎడిట్ టేబుల్ మీద కట్ చేసి పెడతాడు. దర్శకుడు అతనికి నచ్చితే దాన్ని అదే ఫ్లోలో కంటిన్యూ చేస్తాడు. నచ్చకపోతే ఇంకొంచెం చేంజ్ చేయమని చెప్తాడు. ఎక్కడైతే కొంచెం స్లోగా అనిపిస్తుందో అక్కడ దర్శకుడు ఎడిటర్ కి చెప్పి లెంత్ ను కొంచెం కట్ చేయిస్తాడు. కొంతమంది దర్శకులు ఎడిటర్ నిర్ణయానికి వాల్యూ ఇస్తున్నారు. కానీ కొందరు దర్శకులు మాత్రం ఎడిటర్లకి పూర్తి స్వేచ్చనైతే ఇవ్వడం లేదు. దర్శకులే చాలా వరకు ఇన్వాల్వ్ అయి వాళ్లకి ఎక్కడైతే సినిమా ఫ్లో కరెక్ట్ గా లేదో అక్కడ చెప్పి మరి కట్ చేయిస్తున్నారు.

కొన్ని సన్నివేశాలు సినిమా ఫ్లో కి అడ్డంగా ఉన్నాయని ఎడిటర్ చెప్పిన కూడా కొంతమంది దర్శకులు ఆ సీన్స్ సినిమాకి కీలకమని అవి లేకపోతే సినిమా డిటెలింగ్ పోతుందని భావిస్తున్నారు. అందువల్ల ఆ సన్నివేశాలను కట్ చేయడానికి ఇష్టపడటం లేదు. దీనివల్ల సినిమా ఫ్లాప్ అయితే అందులో ఎడిటర్ పాత్ర ఏముంది... కొన్ని సినిమాలు చాలా స్లోగా ఉన్నాయి ఎడిటర్ దానిని ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు తరచుగా వ్యక్తం అవుతుంటాయి. నిజానికి దర్శకుడి అభిప్రాయాన్ని బట్టే ఎడిటర్ కట్ చేయాలి. ఒకవేళ తన ఓన్ డిసిజన్ తో కట్ చేసిన మళ్ళీ డైరెక్టర్ చూసి అందులో ఏం కట్ చేయాలి ఏది కట్ చేయకూడదనేది డిసైడ్ చేస్తున్నాడు. ఒకవేళ ఎడిటర్ కి కట్ చేయాలని ఉన్నా కూడా దర్శకుడితో డిస్కస్ చేసిన తర్వాత తను కట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు.

ఒకవేళ దర్శకుడు వద్దు అది ఆ ఫ్లోకి పర్ఫెక్ట్ గా కుదిరిందని చెబితే దానిని కట్ చేయకుండా వదిలేస్తాడు. ఇక్కడ ఫైనల్ డెసిజన్ దర్శకుడిదే కాబట్టి అందులో ఎడిటర్ చేసిన మిస్టేక్ ఏముంది. ఎందుకని సినిమాలు స్లో గా ఉన్న సినిమాలు ఫ్లాప్ అయిన ఎడిటర్లని దూషిస్తున్నారు...ఒక డైరెక్టర్ తను కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి రాసుకున్న కథలో ఏం ఉంటే ప్రేక్షకుడికి రిచ్ అవుతుందనే విషయంలో ఆయనకి ఒక క్లారిటీ ఉంటుంది. అందుకోసమే వాటిని ఎడిట్ టేబుల్ మీద కట్ చేయకుండా సినిమాలో పెట్టించే ప్రయత్నం చేస్తాడు. కొన్ని సార్లు అది వర్కౌట్ కావచ్చు, మరి కొన్ని సందర్భాల్లో వర్కౌట్ కాకపోవచ్చు...