Begin typing your search above and press return to search.

భ‌ర్త పుట్టిన‌రోజున మౌని వ్యాఖ్య అస్స‌లు ఊహించ‌లేదు!

త‌న‌దైన అందం, న‌ట ప్ర‌తిభ‌తో యువ‌త‌రం హృద‌యాల‌ను గెలుచుకుంది మౌని రాయ్.

By:  Sivaji Kontham   |   9 Aug 2025 6:00 PM IST
భ‌ర్త పుట్టిన‌రోజున మౌని వ్యాఖ్య అస్స‌లు ఊహించ‌లేదు!
X

త‌న‌దైన అందం, న‌ట ప్ర‌తిభ‌తో యువ‌త‌రం హృద‌యాల‌ను గెలుచుకుంది మౌని రాయ్. నాగిన్ పాత్ర‌తో దేశ‌వ్యాప్తంగా పాపుల‌రైన మౌని, అక్ష‌య్ కుమార్ లాంటి అగ్ర హీరో స‌ర‌స‌న `గోల్డ్` అనే చిత్రంతో వెండితెర‌కు ప‌రిచ‌య‌మైంది. అటుపై పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ `కేజీఎఫ్`లో ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించి సౌత్ కి కూడా ప‌రిచ‌య‌మైపోయింది. ఇటీవ‌ల భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `బ్ర‌హ్మాస్త్ర‌`లో త‌న‌దైన అద్బుత న‌టన‌తో మ‌రోసారి పాత్ర‌కు జీవం పోసింది మౌని. న‌ట‌న‌తోనే కాదు, త‌న స్నేహాల‌తోను అంద‌రి అటెన్ష‌న్ ని త‌న‌వైపు తిప్పేసుకోవ‌డం ఈ బ్యూటీకే చెల్లింది. ముఖ్యంగా సీకే బ్యూటీ దిశా ప‌టానీతో మౌని ఫ్రెండ్షిప్ ఇంట‌ర్నెట్‌లో చ‌ర్చ‌గా మారుతోంది.

ఇంత‌లోనే మౌని త‌న స్నేహితుడు, బిజినెస్‌మేన్ సూర‌జ్ నంబియార్ ని పెళ్లాడేసిన సంగ‌తి తెలిసిందే. నంబియార్ తో మౌని ప్రేమ‌క‌థ ఒక సినిమా స్టోరీకి త‌క్కువేమీ కాద‌ని చెబుతారు. పెళ్లికి ముందే ఆ ఇద్ద‌రి జంట షికార్లు, విదేశీ విహార‌యాత్ర‌ల గురించి గుస‌గుస‌లు వినిపించాయి. ఇక పెళ్లి త‌ర్వాత ఈ జంట అన్యోన్య దాంప‌త్యానికి సంబంధించిన‌ ర‌క‌ర‌కాల ఫోటోలు, వీడియోల రూపంలో వైర‌ల్ అయ్యాయి. సోష‌ల్ మీడియాల్లో వీటిని షేర్ చేస్తూ, మౌని త‌న భ‌ర్త‌తో అద్భుత‌మైన‌ రొమాంటిక్ లైఫ్ ని ఆస్వాధిస్తోంద‌ని ఫ్యాన్స్ వ్యాఖ్యానిస్తున్నారు.

తాజాగా భ‌ర్త‌ నంబియార్ బ‌ర్త్ డే విషెస్ చెబుతూ అత‌డితో రొమాంటిక్ డేట్ కి సంబంధించిన కొన్ని ఫోటోల‌ను మౌని సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసింది. అత‌డు ఓ ఫోటోలో ఆప్యాయంగా మౌని బుగ్గ‌పై ముద్దాడిన ఫోటో లేదా ఎంతో స‌న్నిహితంగా భుజంపై చేయి వేసి ద‌గ్గ‌ర‌కు తీసుకునే స్టిల్ .. చేయి చేయి క‌లిపి హీరో హీరోయిన్ లా డ్యూయెట్ కి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు క‌నిపించిన‌ ఫోటోలు వెబ్ లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. ఇవ‌న్నీ ఈ జంట అన్యోన్య‌త‌కు సింబాలిక్‌గా క‌నిపించాయి. నంబియార్ తో అత్యంత స‌న్నిహితంగా ఉన్న ఫోటోల‌ను మౌని షేర్ చేసింది. వీటిలో ప‌డ‌వ‌పై ఈ జంట రొమాన్స్ సాన్నిహిత్యం ముచ్చ‌ట‌గొలిపింది. ఒక ఫోటోలో అర్జెంటీనా ఫుట్‌బాల్ టీమ్ జెర్సీలను ధరించి, జంట‌గా కలిసి మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్నారు. మ‌రో ఫోటోగ్రాఫ్ లో మౌని మెరూన్ స్లీవ్‌లెస్ డ్రెస్ లో క‌నిపించ‌గా, సూరజ్ సింపుల్ గా షార్ట్ టీష‌ర్ట్ లో క‌నిపించాడు. ర‌క‌ర‌కాల డిజైన‌ర్ దుస్తుల్లో అంద‌మైన జంట‌ ఫోటోలు క్ష‌ణాల్లో ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి.

అనారోగ్యం లేదా ఆరోగ్యంగా.. హ్యాపీ బ‌ర్త్ డే హ‌బ్బీ! అని కాస్త వెరైటీగానే విష్ చేసింది మౌని. అయితే క‌ష్ట సుఖాల్లో భ‌ర్త వెన్నంటే ఉంటాన‌ని మౌని ప్రామిస్ చేసింద‌ని అభిమానులు భావిస్తున్నారు. త‌న భ‌ర్త‌పై ప్రేమ‌ను ఏమాత్రం దాచుకోకుండా మౌని ప్ర‌తిదీ ఇంట‌ర్నెట్‌లో షేర్ చేస్తోంది. తాజా ఫోటోషూట్ ఇప్పుడు వెబ్ లో వైర‌ల్ గా మారుతోంది.