పెళ్లయిన హీరోయిన్ నడుముపై చెయ్యేసి తాతయ్యల చేష్టలు
మౌనీ రాయ్ ముఖ్యంగా ఇద్దరి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారు తాత వయస్సు ఉన్నవారైనా.. స్టేజ్ ముందు నిలబడి ఆమెను చూస్తూ అసభ్యకరమైన కామెంట్స్ చేస్తూ, వెకిలి సైగలు చేశారని ఆరోపించారు.
By: Sivaji Kontham | 25 Jan 2026 11:08 AM ISTకొందరు తాతయ్యలు అందాల హీరోయన్ నడుముపై చెయ్యేసారు. అసభ్యంగా తాకుతూ వెకిలిగా నవ్వారు. అక్కడితో ఆగకుండా సెల్ఫీలు దిగడం కోసం పోటీపడ్డారు. అంతేనా.. సదరు హీరోయిన్ ఎంతగా వారించినా వినకుండా ఆమెపైకి గులాబీలు విసిరారు... ఈ ఎపిసోడ్ గురించి వింటుంటే ఔరౌరా! అనిపించడం లేదూ?
హర్యానాలోని కర్నాల్‌లో జరిగిన ఒక వివాహ వేడుకలో తనపై జరిగిన వేధింపుల గురించి నటి మౌనీ రాయ్ సోషల్ మీడియా వేదికగా వివరించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో ఈ చేదు అనుభవాన్ని షేర్ చేసింది. తాను ఎంతగానో అవమానానికి, మానసిక వేదనకు గురయ్యానని పేర్కొన్నారు.
ఈవెంట్ ప్రారంభమై ఆమె స్టేజ్ వైపు వెళ్తుండగా, కొంతమంది మగాళ్లు (అతిథులు, కుటుంబ సభ్యులు) ఫోటోల పేరుతో ఆమె నడుముపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించారు. `సార్, దయచేసి చేయి తీయండి` అని ఆమె కోరినా వారు పట్టించుకోలేదు.
మౌనీ రాయ్ ముఖ్యంగా ఇద్దరి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారు తాత వయస్సు ఉన్నవారైనా.. స్టేజ్ ముందు నిలబడి ఆమెను చూస్తూ అసభ్యకరమైన కామెంట్స్ చేస్తూ, వెకిలి సైగలు చేశారని ఆరోపించారు. మౌని వారించినా వినకుండా ఆమెపైకి గులాబీ పువ్వులు విసిరారు.
స్టేజ్ ఎత్తుగా ఉంది.. ఆ వ్యక్తులు తనను కింది నుండి అసభ్యకరమైన కోణాల్లో వీడియోలు తీశారని, ఎవరైనా వారిని అడ్డుకుంటే బూతులు తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ జరుగుతున్నా అక్కడున్న ఆ వృద్ధుల కుటుంబ సభ్యులు కానీ, నిర్వాహకులు కానీ ఆ వ్యక్తులను అక్కడి నుంచి పంపించకపోవడంపై ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
``నాలాంటి నటికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, పరిశ్రమలోకి వచ్చే కొత్త అమ్మాయిల పరిస్థితి ఏంటి? కళాకారులమైన మేము గౌరవప్రదంగా జీవనం సాగిస్తున్నాం. ఇలాంటి వారిని అధికారులు కఠినంగా శిక్షించాలి``అని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఘటనపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది.
నటి మౌనిరాయ్ కి ఇప్పటికే పెళ్లయింది. కథానాయికగా క్షణం తీరిక లేనంత బిజీగా ఉంది. అయినా అంత పెద్ద హీరోయిన్ నడుముపై చెయ్యేసి చిలిపి చేష్టలకు పాల్పడ్డారంటే ఈ తాతయ్యలు గడుగ్గాయ్‌లే! అంటూ నెటిజనులు సీరియస్ గా స్పందిస్తున్నారు.
