అందాలతో బ్లాస్ట్ చేస్తున్న మౌని రాయ్..
మౌని రాయ్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. తరచూ దుబాయ్ వెళుతున్న నేపథ్యంలో యూఏఈ ఈమెకు గోల్డెన్ వీసా అందించింది.
By: Madhu Reddy | 29 Jan 2026 1:56 PM ISTఅద్భుతమైన నటనతోనే కాదు మైమరిపించే అందాలతో ఆకట్టుకుంటున్న అది కొద్ది మంది హీరోయిన్స్ లో మౌని రాయ్ కూడా ఒకరు. హిందీ టెలివిజన్ సీరియల్స్ లో నటిస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈమె.. నాగిన్ సీరియల్ తో మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. ఇదే సీరియల్ తెలుగులో నాగిని అంటూ విడుదల చేయగా.. ఇటు తెలుగు బుల్లితెర ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు సీరియల్స్ లోనే కాకుండా మరొకవైపు సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా మారింది.
2006లో 'క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ' అనే టెలివిజన్ షో తో నటన జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించిన ఈమె ' హీరో హిట్లర్ ఇన్ లవ్' అనే పంజాబీ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. 2018లో వచ్చిన గోల్డ్ చిత్రంతో హిందీ సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఇందులో ఉత్తమ నటన కనబరిచినందుకు గానూ ఉత్తమ మహిళ అరంగేట్రం కోసం ఫిలింఫేర్ అవార్డుకు నామినేట్ కూడా చేయబడింది మౌని రాయ్. అలాగే 2022లో బ్రహ్మాస్త్ర పార్ట్ 1 లో నటించి విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది.. ఇకపోతే ఈ చిత్రం ఉత్తమ సహాయక ఫిలింఫేర్ అవార్డుకు నామినేషన్ కూడా అందుకుంది.
ఒకవైపు సినిమాలలో నటిస్తూ బిజీగా మారిన ఈమె మరొకవైపు ఇటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.. తాజాగా వెకేషన్ కి వెళ్ళిన ఈమె.. అక్కడి అందాలను ఆరబోస్తూ అభిమానులలో చక్కిలిగింతలు పెడుతోంది. ముఖ్యంగా మౌని రాయ్ షేర్ చేసిన ఫోటోలు చూస్తుంటే అందాలతోనే బ్లాస్ట్ చేస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా తన ఫ్రెండుతో కలిసి దిగిన కొన్ని వీడియోలను కూడా ఈమె తన ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ప్రస్తుతం మౌని షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.
మౌని రాయ్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. తరచూ దుబాయ్ వెళుతున్న నేపథ్యంలో యూఏఈ ఈమెకు గోల్డెన్ వీసా అందించింది. మూడు సంవత్సరాల రిలేషన్ తర్వాత గోవాలోని పనాజీలో దుబాయ్ కి చెందిన మలయాళీ వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ తో 2022 జనవరి 27న ఏడడుగులు వేసింది. బెంగాలీ సాంప్రదాయం ప్రకారం ఒకసారి మలయాళీ సంప్రదాయం ప్రకారం మరోసారి అలా రెండుసార్లు వివాహం చేసుకుంది మౌని రాయ్.
మౌని రాయ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటించింది. ఈ సినిమా ఈ ఏడాది విడుదల కాబోతున్నట్లు ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అలాగే హిందీలో హై జవానీతో ఇష్క్ హోనా హై అనే సినిమాలో నటిస్తోంది. అంతేకాదు మరో హిందీ చిత్రంలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.
