Begin typing your search above and press return to search.

మౌని రాయ్ కొత్త లుక్ చూసాక గుండె గ‌ల్లంతే!

అందాల‌ నటి మౌనీ రాయ్ నిరంత‌రం త‌న ఇన్ స్టా పోస్టుల‌తో యువ‌హృద‌యాల‌ను కొల్ల‌గొడుతున్న సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   17 Oct 2026 12:00 AM IST
మౌని రాయ్ కొత్త లుక్ చూసాక గుండె గ‌ల్లంతే!
X

అందాల‌ నటి మౌనీ రాయ్ నిరంత‌రం త‌న ఇన్ స్టా పోస్టుల‌తో యువ‌హృద‌యాల‌ను కొల్ల‌గొడుతున్న సంగ‌తి తెలిసిందే. తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో సోషల్ మీడియాలో మరోసారి హల్‌చల్ చేశారు. A స్టోరియ‌న్..బిసో.. బిసోవ్ ఎక్స్ అనే క్యాప్షన్‌తో మౌని షేర్ చేసిన‌ ఫోటో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఆకర్షణీయమైన లుక్‌తో ఉన్న ఈ ఫోటోను చూసి అభిమానులు, నెటిజన్లు లైకులు, గుండె గుర్తు ఎమోజీలతో కామెంట్ సెక్షన్‌ను ముంచెత్తారు.




ఈ పోస్ట్‌కు ఆమె తోటి సెలబ్రిటీల నుంచి కూడా విశేష స్పందన లభించింది. ప్రముఖ నటులు అర్జున్ బిజ్లానీ, అనుషా దండేకర్, అషీమా వర్ధన్, ప్రముఖ స్టైలిస్ట్ అనుసోరు వంటి పరిశ్రమ స్నేహితులు ఫైర్, హార్ట్ ఎమోజీలను పోస్ట్ చేస్తూ ఆమె స్టైలింగ్- అందాన్ని ప్రశంసించారు. తోటి నటీనటులు, టెలివిజన్ ప్రముఖులు చూపిన ఈ ఆప్యాయత సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.




మౌనీ రాయ్ అభిమానులు, ఫ్యాన్ పేజీలు ఆమెను ఎంతగానో అభినందిస్తూ కామెంట్లు చేశారు. చాలామంది `రాకుమారి (షెహజాదీ)`, `డిస్నీ ప్రిన్సెస్`.. `దివా` అని అభివర్ణించారు. మౌని కేశాలంకరణ, దుస్తుల ఎంపికను మెచ్చుకుంటూ నెటిజన్లు ఆమెను ఫ్యాషన్ ఐకాన్‌గా అభివర్ణించారు.




ఈ పోస్ట్ తో మౌని రాయ్ కు ఉన్న‌ అంతర్జాతీయ, ప్రాంతీయ ప్రజాదరణ మరోసారి నిరూపితమైంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శుభాకాంక్షలతో పాటు, సొంత రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్‌కు చెందిన అభిమానులు ``సుభో శారదీయ`` అని బెంగాలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేశారు. భాషలు, సరిహద్దులతో సంబంధం లేకుండా మౌనీకి ఉన్న క్రేజ్‌కు ఇది నిదర్శనంగా నిలిచింది.

మొత్తానికి ఒక్క పోస్ట్‌తో సోషల్ మీడియా వేదికగా ఈ స్థాయి స్పందన రావడం మౌనీ రాయ్ డిజిటల్ ఇంపాక్ట్ కి, స్టార్ డమ్‌కు అద్దం పడుతోంది. వెండితెరపైనే కాకుండా, సోషల్ మీడియాలోనూ తన విలక్షణమైన స్టైల్‌తో మిలియన్ల మంది అభిమానులను ఆకట్టుకుంటూ ఇంటర్నెట్ సెన్సేషన్‌గా కొనసాగుతున్నారు.