Begin typing your search above and press return to search.

ప్రైవసీ కావాలంటూ ట్యాలెంటెడ్ న‌టి ఎమోషనల్

తన ప్రైవసీని గౌరవించాలని.. దయచేసి తనను ఇకపై కెమెరాల్లో బంధించవద్దని మౌని ఫోటోగ్రాఫర్లను వేడుకున్నారు.

By:  Sivaji Kontham   |   16 July 2026 11:10 AM IST
ప్రైవసీ కావాలంటూ ట్యాలెంటెడ్ న‌టి ఎమోషనల్
X

బాలీవుడ్ నటి మౌనీ రాయ్ త‌న జీవితంలో ఎమోష‌న‌ల్ ఘ‌ట్టంలో ఉన్నారు. ముంబై స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్లు అలాగే, సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల నుండి త‌న‌కు ఎదుర‌వుతున్న విమ‌ర్శ‌లే దీనికి కార‌ణం. తనను ఎక్కడికక్కడ వెంబడిస్తూ ఫోటోలు, వీడియోలు తీయడం ఆపాలన మౌని ఇన్‌స్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ అప్పీల్ చేశారు. తన ప్రైవసీని గౌరవించాలని.. దయచేసి తనను ఇకపై కెమెరాల్లో బంధించవద్దని మౌని ఫోటోగ్రాఫర్లను వేడుకున్నారు.

తాను ఎప్పుడూ ఫోటోగ్రాఫ‌ర్ల‌ను ప్రత్యేకంగా పిలవలేదని.. ఒక వ్యక్తిగా తన స్థాయిని, స్థానాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని మౌనీ రాయ్ స్పష్టం చేశారు. అయితే ఈ పోస్ట్ వైరల్ భయానీ లాంటి సోషల్ మీడియా పేజీల్లో ప్రత్యక్షం కావడంతో నెటిజన్ల నుండి భిన్నమైన స్పందనలు వచ్చాయి. కొందరు నెటిజన్లు మౌనీని తీవ్రంగా ట్రోలింగ్ చేస్తుండగా.. మరికొందరు త‌న‌ ప్రైవసీ హక్కుకు మద్దతుగా నిలుస్తున్నారు.

ట్రోలర్స్ మౌనీ రాయ్‌ను టార్గెట్ చేస్తూ.. సెలబ్రిటీలు సాధారణంగా తామే స్వయంగా పీఆర్ టీమ్స్ ద్వారా ఫోటోగ్రాఫర్లకు సమాచారం ఇచ్చి పిలిపించుకుంటారని.. ఇప్పుడు ఇలా డ్రామాలు ఆడ‌డం విడ్డూరంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదో లైమ్‌లైట్ కోరిక‌తోనో లేదా పబ్లిసిటీ స్టంట్ కోసమో ఇలా చేస్తోందని కొందరు... రెండు రోజులు మీడియా కవరేజ్ లేకపోతే సెలబ్రిటీలు తట్టుకోలేరంటూ మరికొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మౌని గతంలో మద్యం మత్తులో ఉన్న వీడియోలు బయటకు వచ్చాయంటూ కొందరు త‌ప్పుడు ప్ర‌చారానికి సైతం తెరలేపారు.

అయితే ఈ ట్రోలింగ్‌ను మౌనీ రాయ్ అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. సెలబ్రిటీ అయినంత మాత్రాన వారు పబ్లిక్ ప్రాపర్టీ (సమాజపు ఆస్తి) కాదని... ఒక మహిళగా, కూతురిగా త‌న‌కు సొంత జీవితం, ప్రైవసీ ఉంటాయని అభిమానులు గట్టిగా వాదిస్తున్నారు. మౌని ప్రస్తుతం ఏదో ఒక అనారోగ్యం లేదా చికిత్స పొందుతున్న సమయంలో ఇలాంటి ఊహాగానాలు, నెగెటివిటీ వ్యాప్తి చేయడం దారుణమని... అన్-వెరిఫైడ్ వార్తలను నమ్మవద్దని కోరుతున్నారు. జయా బచ్చన్ లాంటి సీనియర్లకే రక్షణ లేని చోట... మౌనీ రాయ్ తన ఆవేదనను వ్యక్తపరచడంలో ఎలాంటి తప్పులేదని సపోర్ట్ చేస్తున్నారు.

గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నంత మాత్రాన ప్రతిసారీ కెమెరాల ముందు నవ్వుతూ కనిపించే మానసిక స్థితిలో ఎవరూ ఉండరని... కనీస మానవత్వాన్ని చూపించాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇండస్ట్రీకి ఎంతో కష్టపడి గుర్తింపు తెచ్చుకున్న ఒక నటి తన ఆరోగ్యం బాగోలేనప్పుడు కెమెరాలకు దూరంగా ఉండాలనుకోవడం త‌న ప్రాథమిక హక్కు అని... ఈ విషయంలో అటు మీడియా... ఇటు సోషల్ మీడియా యూజర్లు హద్దులు దాటకూడదని సినీ విశ్లేషకులు కూడా సూచిస్తున్నారు. మౌనిరాయ్ ఇటీవ‌లే భ‌ర్త సురాజ్ నంబియార్ నుంచి విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ బ్రేక‌ప్ త‌ర్వాత మౌనీని నెటిజ‌నులు మ‌రింత ఘాటుగా విమ‌ర్శిస్తున్నారు.