Begin typing your search above and press return to search.

మౌని రాయ్ రెస్టారెంట్‌లో ధ‌ర‌లు షాకింగ్

కొద్దిరోజుల క్రితం శిల్పా శెట్టి బాస్టియ‌న్ రెస్టారెంట్‌ని మూసి వేసింది. వేరొక‌రికి దీనిని విక్ర‌యించింది.

By:  Sivaji Kontham   |   27 Oct 2025 9:07 AM IST
మౌని రాయ్ రెస్టారెంట్‌లో ధ‌ర‌లు షాకింగ్
X

కొద్దిరోజుల క్రితం శిల్పా శెట్టి బాస్టియ‌న్ రెస్టారెంట్‌ని మూసి వేసింది. వేరొక‌రికి దీనిని విక్ర‌యించింది. బాస్టియ‌న్‌లో సెల‌బ్రిటీలంతా క‌ళ్లు చెదిరే బిల్లులు చెల్లిస్తున్నార‌ని, కోట్లాది రూపాయ‌ల ఆదాయం ద‌క్కుతోంద‌ని ప్ర‌చార‌మైనా కానీ, ఇంత‌లోనే శిల్పాశెట్టి ఎందుకు దీనిని విక్ర‌యించాల్సి వ‌చ్చిందో తెలీదు.

ఇప్పుడు అందాల క‌థానాయిక మౌని రాయ్ రెస్టారెంట్ `బద్మాష్‌`లోని మెనూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇక్క‌డ‌ ఫ్యూజన్ ఇండియన్ ఫుడ్, రుచికరమైన వంటకాలు, బాలీవుడ్ సెల‌బ్రిటీల‌కు న‌చ్చే అన్ని ర‌కాల వంట‌కాలు ల‌భిస్తాయి. అయితే ఈ హోట‌ల్ లో ధ‌ర‌లే ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. మెనూలోని చాలా వస్తువుల ధర రూ. 300 మరియు రూ. 800 మధ్య ఉంటుంది. షాహి తుక్డా, గులాబ్ జామున్ ధర ఒక్కొక్కటి రూ. 410. రెస్టారెంట్ అవోకాడో భెల్‌ను కూడా విక్రయిస్తుంది.. దీని ధర రూ. 395. మసాలా పీనట్, మసాలా పాపడ్, క్రిస్పీ కార్న్, సేవ్ పూరి వంటి వస్తువుల ధర ఒక్కొక్కటి రూ. 295. కందా భజియా ధర రూ. 355, రొయ్యల ఆధారిత‌ వంటకాల ధర రూ. 795. తందూరీ రోటీ రూ. 105, నాన్ రూ. 115, అమృతసర్ కుల్చా రూ. 145 ధ‌ర‌ల‌తో ఉన్నాయి. మౌనికి అవ‌కాడో అంటే ఇష్టం కాబట్టి అవోకాడో భెల్ ను క‌స్ట‌మ‌ర్ల‌కు అందిస్తోంది.

ఏది ఏమైనా ఖ‌రీదైన ప్ర‌జ‌లు నివ‌శించే చోట ఆ మాత్రం రేట్లు పెట్ట‌క‌పోతే ఎలా గిట్టుబాటు అవుతుంది. వంట స‌హా రెస్టారెంట్ స్టాఫ్ కి కూడా పెద్ద జీతాలు ఇవ్వాల్సి వ‌స్తోంది. అందువ‌ల్ల మౌనిరాయ్ ఈ ధ‌ర‌ల్ని నిర్ణ‌యించింది. అయితే చాలామంది దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి మ‌న‌స్త‌త్వం ఉన్న‌వారంతా, ఈ ధ‌ర‌లు చూసి నోరెళ్ల‌బెడుతున్నారు. ఒక రోటీ 115 రూపాయ‌ల‌కు కొనుక్కుంటే, అందులోకి 50 గ్రాముల‌ ప‌ప్పు క‌ర్రీ కోసం రూ.800 పెట్టాలేమోన‌ని ఆందోళ‌న చెందుతున్నారు.

అయితే మౌనిరాయ్ ఈ రెస్టారెంట్ ప్రారంభించాల‌నుకోవ‌డానికి కార‌ణం.. త‌న ప్ర‌యాణ స‌మ‌యాల్లో ఎప్పుడూ పుస్త‌కం, కాఫీ త‌న‌తో ఉండాలి. దానికోసం కేఫ్ లో కూర్చునేదానిని.. అని తెలిపింది. ఆ ఆచారం నా సొంత కేఫ్‌ను న‌డిపించే దిశ‌గా ఊహించుకునేలా చేసింది. అప్పట్లో అది వ‌ర్క‌వుట్ కాలేదు. కానీ నా భర్త , ఆయ‌న‌ ప్రాణ స్నేహితులకు ధన్యవాదాలు. నేను ఒక రెస్టారెంట్‌ను ప్రారంభించేందుకు అవకాశం వచ్చింది.. అని తెలిపింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. మౌని రాయ్ చివరిసారిగా `సలాకార్‌`లో క‌నిపించింది. అంతకు ముందు అయాన్ ముఖర్జీ తెర‌కెక్కించిన `బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్ - శివ` (2022)లో కూడా ఉంది. ఈ చిత్రంలో విలన్ జునూన్ పాత్రను పోషించింది.