Begin typing your search above and press return to search.

నేను గే అనే పుకారు విన్నాను.. ఒప్పుకున్న మౌనిరాయ్

మౌని రాయ్ - సూరజ్ నంబియార్ తాము విడిపోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉమ్మడి ప్రకటన ద్వారా అధికారికంగా వెల్లడించారు.

By:  Sivaji Kontham   |   14 Jun 2026 1:29 AM IST
నేను గే అనే పుకారు విన్నాను.. ఒప్పుకున్న మౌనిరాయ్
X

అందాల నటి మౌని రాయ్ తన వైవాహిక జీవితం, వ్యక్తిగత విషయాలపై వస్తున్న వదంతులకు సంబంధించి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. 2022లో వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ను వివాహం చేసుకున్న మౌని ఇటీవలే మే 2026లో తాము పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ బ్రేక‌ప్ తర్వాత మౌని లైంగికత గురించి నెట్టింట కొన్ని పుకార్లు షికారు చేశాయి. తాజాగా యూట్యూబ్‌లో మోనికా శర్మ నిర్వహించిన ఒక టాక్ షోలో పాల్గొన్న మౌని.. బాలీవుడ్‌లో తన గురించి విన్న అతిపెద్ద వదంతి ఏమిటని అడగ్గా.. ఏమాత్రం సంకోచించకుండా ``నేను గే అనే పుకారు విన్నాను`` అంటూ క్లారిటీ ఇచ్చారు.

విడాకుల ప్రకటన వెలువడిన కొద్ది వారాలకే ఈ ఇంటర్వ్యూలో మౌని ఆస‌క్తిక‌ర సంగ‌తులు ముచ్చ‌టించారు. జీవితంలో ఎదురైన ఈ కఠినమైన పరిస్థితుల నుండి తాను ఎలా బయటపడగలిగారో మౌని ఈ సందర్భంగా రివీల్ చేసారు. విడిపోయిన తర్వాత ఈ క‌ష్ట‌ కాలాన్ని అధిగమించడానికి తన కుటుంబం, స్నేహితులు తనకు కొండంత అండగా నిలిచారని పేర్కొన్నారు. కష్టకాలంలో తన వెన్నంటి నిలిచిన ఒక బలమైన సపోర్ట్ సిస్టమ్ తనకు లభించడం నిజంగా అదృష్టమని... తన జీవితంలో ఎలాంటి మంచి- చెడు.. గడ్డు పరిస్థితులు ఎదురైన వారంతా ఒక రాయిలా తన వెనుక నిలబడ్డారని మౌని రాయ్ భావోద్వేగానికి లోనయ్యారు.

ముఖ్యంగా తనకున్న మహిళా స్నేహితుల గురించి 40 ఏళ్ల మౌని రాయ్ ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ మనల్ని మానసికంగా పైకి లేపే.. నిరంతరం ప్రోత్సహించే మంచి మహిళా స్నేహితులు ఉండటం చాలా ముఖ్యమని మౌని రాయ్ అభిప్రాయపడ్డారు. తన గర్ల్‌ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అత్యుత్తమమైన వారని.. వారు తనకు ఇచ్చిన మద్దతు వెలకట్టలేనిదని కొనియాడారు. దీనితో పాటు నేటి కాలంలో మహిళలు స్వయం సమృద్ధిగా ఎదగడం ఎంత అవసరమో చెప్తూ.. యువతులు మానసికంగానే కాకుండా ఆర్థికంగా కూడా స్వతంత్రులుగా మారడంపై దృష్టి పెట్టాలని.. అప్పుడే జీవితంలో వచ్చే ఎలాంటి ఒడిదుడుకులనైనా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోగలరని పిలుపునిచ్చారు.

మౌని రాయ్ - సూరజ్ నంబియార్ తాము విడిపోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉమ్మడి ప్రకటన ద్వారా అధికారికంగా వెల్లడించారు. మారుతున్న వ్యక్తిగత ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుని.. పరస్పర గౌరవం- అవగాహనతో విడివిడి మార్గాల్లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు. ప్రస్తుతానికి ఈ కఠినమైన దశను ఎంతో ఆలోచించుకుని... జాగ్ర‌త్త‌గా ముందుకు సాగ‌డంపైనే దృష్టి పెట్టామని.. మునుముందు రోజుల్లో కూడా తమ మధ్య ఉన్న స్నేహాన్ని గౌరవిస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

అయితే వీరిద్దరి విడాకులకు సంబంధించి ఇంటర్నెట్‌లో ర‌క‌ర‌కాల తప్పుడు కథనాలు, పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సూరజ్ నంబియార్ కూడా విడిగా ఒక ప్రకటనను విడుదల చేస్తూ ఆ వదంతులను తీవ్రంగా ఖండించారు. తమ మధ్య ఎలాంటి లీగల్ వివాదాలు లేవని... భరణం క్లెయిమ్‌లు చేయలేదని.. మేం విడిపోవడానికి మూడో వ్యక్తి ప్రమేయం అస్సలు లేదని ఆయన స్పష్టం చేశారు. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతూ... మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలకు ముగింపు పలికారు.