రానాతో స్నో అక్క.. నెట్టింట వీడియో వైరల్..
ప్రస్తుతం అమెరికాలోని ఉతాలో ఉంటున్న ఆమె.. మోడల్ గా నటిగా కుంటే సోషల్ మీడియాలో క్యాన్సర్ పట్ల అవగాహన కార్యక్రమాలు చేపడుతూ స్ఫూర్తిగా నిలుస్తుంటారు
By: M Prashanth | 15 Nov 2025 9:11 PM ISTమోడల్ కమ్ నటి అయిన మౌనిష చౌదరి గురించి అనేక మందికి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలోని ఉతాలో ఉంటున్న ఆమె.. మోడల్ గా కుంటే సోషల్ మీడియాలో క్యాన్సర్ పట్ల అవగాహన కార్యక్రమాలు చేపడుతూ స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.
2016వ సంవత్సరంలో మౌనిష చౌదరి ఉతా కిరీటాన్ని కూడా కైవసం చేసుకోగా.. స్నో అక్కగా ఇన్ స్టాగ్రామ్ లో గుర్తింపు సంపాదించుకున్నారు. మంచి ఫాలోయింగ్ కూడా దక్కించుకున్నారు. అయితే రీసెంట్ గా ఆమె.. టాలీవుడ్ స్టార్ నటుడు, హల్క్ రానా దగ్గుబాటితో వీడియో కాల్ లో మాట్లాడారు. అందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.
"2014లో జూబ్లీహిల్స్ లో స్టార్ బక్స్ అప్పుడే ఓపెన్ చేశారు.. అక్కడ నేను మిమ్మల్ని (రానాను) చూశాను.. అందరితో చాలా బాగా మాట్లాడారు.. అందరూ మీ దగ్గరకు వచ్చి ఫోటోలు అడిగారు.. నేను అప్పుడు చాలా సిగ్గుపడి మీ దగ్గర రాలేకపోయాను" అని మౌనిష చౌదరి చెప్పారు. అదే సమయంలో అప్పుడు ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టుల స్క్రీన్ షాట్లను షేర్ చేశారు.
తాను రానాను చూశానని.. స్వర్గమే అంటూ అప్పట్లో మౌనిష పోస్ట్ పెట్టున్నారు. అయితే అప్పుడు సిగ్గుపడి మాట్లాడకపోవడం.. పదేళ్లుగా ఒక రిగ్రెట్ గా ఉండిపోయిందని మౌనిష చెప్పారు. అప్పట్లో సిగ్గు ఎక్కువ.. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ వచ్చాక పోయిందని తెలిపారు. అప్పుడు మొహమాట పడ్డానని.. ఇప్పుడు మాట్లాడినందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు.
అయితే రానా దగ్గుబాటితో మౌనిష చౌదరి మాట్లాడిన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అనేక మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అదే కదా సర్కిల్ టైప్ లైఫ్ అని చెబుతున్నారు. స్నో అక్క రేంజ్ బాగా పెరిగిందని కొందరు అంటున్నారు. సూపర్ అక్క అని మరికొందరు రిప్లైలు పెడుతున్నారు.
