టాలెంట్ కి తగ్గ గట్స్.. సూపర్..!
మౌళి ప్రశాంత్ ఇతని పేరు కన్నా స్క్రీన్ మీద అతను కనిపిస్తే మాత్రం నవ్వులు పండుతాయి.
By: Ramesh Boddu | 4 Sept 2025 11:37 AM ISTమౌళి ప్రశాంత్ ఇతని పేరు కన్నా స్క్రీన్ మీద అతను కనిపిస్తే మాత్రం నవ్వులు పండుతాయి. హీరో, విలన్, కమెడియన్ ఇలా చెప్పడం కన్నా యాక్టర్ అవ్వడానికి యాక్టర్ గా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి బాగా ట్రై చేస్తున్నాడు. రీల్స్ తో పాపులర్ అయ్యి షార్ట్ సీరీస్, వెబ్ సీరీస్ లో ఛాన్స్ అందుకుని ఇప్పుడు ఏకంగా లీడ్ రోల్ లో అవకాశం అందుకున్నాడు. కృషి ఉంటే అనుకున్నది సాధించొచ్చు అన్నదానికి ఎక్కడో ఉదహరణలు కాదు మౌళిని కూడా తీసుకోవచ్చని ప్రూవ్ చేశాడు.
తన ఓన్ కంటెంట్ తో వీడియోలు..
మిడిల్ క్లాస్ నుంచే వచ్చిన అతను స్టార్ అవుదామని కాదు మంచి నటుడు అవ్వాలని వచ్చాడు. అంతేకాదు తన ఓన్ కంటెంట్ తో తను చేస్తున్న వీడియోలు ఆడియన్స్ కు బాగా నచ్చేస్తున్నాయి. ఐతే ఈ టైం లో అతను తీసుకునే నిర్ణాయాలే అతన్ని ముందుకు వెళ్లేలా చేస్తాయి. మౌళికి ఒక సూపర్ హిట్ సినిమా సీక్వెల్ ఛాన్స్ వచ్చినా కూడా అతను కాదని చెప్పాడట. కారణాలు ఏవైనా ఆ సూపర్ హిట్ సినిమా కాదని మంచి పనే చేశాడని చెప్పొచ్చు.
ఇంతకీ అతను కాదన్న సినిమా ఏదంటే మ్యాడ్ మాక్స్. అదే మ్యాడ్ సినిమాకు సీక్వెల్ గా మరో కథతో వచ్చారు. ఐతే ఆ సినిమాలో లడ్డు రోల్ లో ముందు మౌళీనే అనుకున్నారట మేకర్స్. అతనికి ఆఫర్ ఇస్తే సున్నితంగా ఆ ఆఫర్ కాదన్నాడట. ఆ ఛాన్స్ కాదన్న అతన్ని కొందరు తప్పుగా అనుకున్నా అతను లీడ్ రోల్ లో ఛాన్స్ అందుకోవడం చూసి షాక్ అవుతున్నారు. మౌళీ లీడ్ రోల్ లో సాయి మార్తాండ్ డైరెక్షన్ లో లిటిల్ హార్ట్స్ సినిమా వస్తుంది. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
లిటిల్ హార్ట్స్ సినిమా..
ఆదిత్యా హాసన్ డైరెక్ట్ చేసిన నైంటీస్ వెబ్ సీరీస్ లో మౌళి నటించాడు. ఆ డైరెక్టర్ కి మౌళి బాగా నచ్చాడు అందుకే లిటిల్ హార్ట్స్ సినిమా ప్రొడ్యూస్ చేసి మరీ మౌళి ప్రశాంత్ కి ఛాన్స్ ఇచ్చాడు. సినిమా లీడ్ రోల్ చేయడం అటు ఉంచితే అతను చేసే కంటెంట్ క్రియేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ముందు అతని వీడియోస్ స్కిప్ చేసిన వాళ్లు కూడా ఇప్పుడు వెతికి మరీ అతని రీల్స్ చూస్తున్నారు. మొత్తానికి తక్కువ టైం లోనే తన టాలెంట్ తో ఆడియన్స్ ని ప్రూవ్ చేస్తున్నాడు మౌళి ప్రశాంత్.
లిటిల్ హార్ట్స్ సినిమా ప్రచార చిత్రాలు ఇంప్రెస్ చేస్తున్నాయి. సినిమా హిట్ పడితే మాత్రం మౌళి దశ తిరిగినట్టే లెక్క. ప్రతి అవకాశాన్ని సద్వినియోగ పరచుకుంటున్న మౌళి లిటిల్ హార్ట్స్ తో సక్సెస్ అందుకుంటే మాత్రం అతని రేంజ్ మారినట్టే లెక్క.
