సినిమా హిట్టైతే పేరెంట్స్ తో ఫారిన్ ట్రిప్
ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మరియు నటుడైన మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటించిన తాజా సినిమా లిటిల్ హార్ట్స్.
By: Sravani Lakshmi Srungarapu | 4 Sept 2025 12:25 PM ISTప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మరియు నటుడైన మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటించిన తాజా సినిమా లిటిల్ హార్ట్స్. 90స్ వెబ్ సిరీస్ తో బాగా పాపులర్ అయిన మౌళి నుంచి వస్తున్న తాజా మూవీ లిటిల్ హార్ట్స్. శివానీ నాగారం హీరోయిన్ గా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. యూత్‌ను ఎట్రాక్ట్ చేసే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీపై అందరికీ మంచి అంచనాలే ఉన్నాయి.
మొదటిసారి పేరెంట్స్ కు థ్యాంక్స్ చెప్తున్నా..
తాజాగా చిత్ర యూనిట్ రోస్ట్ ఈవెంట్ అంటూ ఓ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేయగా దానికి చిత్ర యూనిట్ మొత్తం హాజరైంది. ఆ ఈవెంట్ లో మౌళి తన జర్నీని ఇక్కడి వరకు వచ్చేలా చేసిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలపడంతో పాటూ తన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పారు. పేరెంట్స్ కు తానెప్పుడూ థ్యాంక్స్ చెప్పలేదని, ఇప్పుడే ఫస్ట్ టైమ్ స్టేజ్ పై నుంచి చెప్తున్నా అంటూ ఎమోషనల్ అయ్యారు.
మాకు ట్రిప్ అంటే తిరుపతినే!
వాళ్లు ఎంత కష్టపడ్డా కూడా తనను మాత్రం కింగ్ లానే పెంచారని, ఇప్పటి వరకు తిరుపతి తప్ప ఏ ట్రిప్ కూ వెళ్లని తన ఫ్యామిలీని ఈ సినిమా హిట్ అయితే ఫారిన్ ట్రిప్ తీసుకెళ్తానని చెప్పడంతో అక్కడున్న వారంతా చప్పట్లు కొడుతూ మౌళిని అభినందించారు. తన తండ్రి ఆటో నడుపుతూ ఆ వచ్చిన డబ్బుతోనే తమ కుటుంబాన్ని నడిపే వారని గతంలో మౌళి చెప్పిన విషయం తెలిసిందే.
అందరికీ నచ్చేస్తా.. ఇదే నా వార్నింగ్
దాంతో పాటూ సోషల్ మీడియాలో ఓ బ్యాచ్ తన సినిమాలను బాయ్‌కాట్ చేయమని కామెంట్స్ చేస్తున్నారని చెప్పిన మౌళి, తనంటే ఇష్టం లేనోళ్లకు ఓ మాట చెప్తున్నానని, సెప్టెంబర్ 5న మీ అందరికీ నచ్చేస్తానని, మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తానని, ఈ సినిమా కాకపోతే, నెక్ట్స్ సినిమా, అదీ కాకపోతే ఆ నెక్ట్స్ సినిమా, ఏదొక రోజు మీరు మీ ఫ్యామిలీతో వచ్చి థియేటర్లో కూర్చుని ఈ సినిమా బావుందనేలా చేస్తానని, ఇదే నా వార్నింగ్ అంటూ మాట్లాడారు మౌళి.
