బాలీవుడ్ హీరోయిన్ల పోస్ట్-ప్రెగ్నెన్సీ ఫిట్‌నెస్ & ట్రెండ్స్!
ఒకప్పుడు పెళ్లి, పిల్లలు హీరోయిన్ల కెరీర్‌కు అడ్డంకిగా భావించేవారు. కానీ ఇప్పుడు ఆలియా భట్, దీపికా పదుకొనే, కియారా అద్వానీ వంటి తారలు మాతృత్వం తర్వాత కూడా సినిమాలు, ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతున్నారు. మరోవైపు కత్రినా కైఫ్, సమంత వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. తల్లులైన తర్వాత కెరీర్ కొనసాగించాలా, విరామం తీసుకోవాలా అన్నది తమ ఇష్టమని నేటి తరం హీరోయిన్లు నిరూపిస్తున్నారు.
By: Srikanth Kontham | 18 Nov 2026 8:00 PM ISTఒకప్పుడు హీరోయిన్లకు పెళ్లయిందంటే? కెరీర్ క్లోజ్ అయినట్లేనని ఇండస్ట్రీలో గట్టి నమ్మకం ఉండేది. ఇక తల్లయ్యారంటే మాత్రం రెండేళ్ల పాటు వెండితెర వైపు కన్నెత్తి చూసేవారు కాదు. కానీ ఇప్పుడు ఆ పాత లెక్కలన్నీ పూర్తిగా మారిపోయాయి. నేటి తరం స్టార్ హీరోయిన్లు మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే డెలివరీ అయిన కొన్ని నెలలకే మునుపటి కంటే మరింత నాజూగ్గా.. గ్లామరస్‌గా మారి కెమెరా ముందుకొస్తున్నారు. కఠినమైన ఫిట్‌నెస్ రూల్స్.. కచ్చితమైన డైట్ ప్లాన్స్‌తో తల్లులు సాధిస్తున్న ట్రాన్స్‌ఫర్మేషన్ చూసి పరిశ్రమ సైతం ఆశ్చర్యపోతుంది.
ఈ ట్రెండ్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా ఆలియా భట్, దీపికా పదుకొనే నిలుస్తున్నారు. ఆలియా భట్ కుమార్తె రాహా పుట్టిన నాలుగు నెలల్లోనే తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టి ఆశ్చర్యపరిచింది. `రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ` పాటల చిత్రీకరణలో అలియా ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ చేయడం చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు. దీపికా పదుకొనే కూడా డెలి వరీ తర్వాత ఎలాంటి విరామం తీసుకోకుండా ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ వరుస ప్రాజెక్టులతో బిజీ అయింది.
ఇదే బాటలో మరో బ్యూటీ కియారా అద్వానీ లేటెస్ట్ మేగజైన్ ఫోటోషూట్‌తో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. అసలు డెలివరీ అయిందా? అన్నంతలా బాడీని టోన్ చేసుకుని.. ఎంతో కాన్ఫిడెంట్‌గా పోజులిచ్చి కుర్రకారు మతి పోగొట్టింది. పోస్ట్-ప్రెగ్నెన్సీ తర్వాత కూడా గ్లామర్ ఏమాత్రం తగ్గకుండా మార్కెట్‌ను కాపాడుకోవడంలో కియారా సక్సెస్ అయింది. అందం కోసమే కాకుండా ఆరోగ్యం .. మానసిక ఉల్లాసం కోసవ భామలు జిమ్‌లో గంటల తరబడి చెమటోడుస్తున్నారు.
అయితే అందరూ ఒకేలా ఆలోచించరు కదా. కొందరు హీరోయిన్లు వెంటనే కెమెరా ముందుకొస్తుంటే మరికొందరు మాత్రం వ్యక్తిగత జీవితానికి.. మాతృత్వానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. బాలీవుడ్ స్టార్ కత్రినా కైఫ్ ప్రస్తుతం సినిమాల హడావుడికి దూరంగా ఉంది. ఫ్యామిలీతోనే ఎక్కువ సమయం గడుపుతుంది. మరి సౌత్ క్వీన్ సమంత కూడా అదే బాటలో పయనిస్తుంది. ఆరోగ్యం .. కుటుంబ బాధ్యతలకు సమయం కేటాయించి ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తుంది. అయితే ప్రసవానంతరం కంబ్యాక్ అవ్వడానికి ఎంత సమయం తీసుకుంటుంది? అన్నది చూడాలి.
సినిమాల్లో నటించాలంటే పెళ్లి.. పిల్లలు అడ్డంకి కాదని నేటి తరం హీరోయిన్లు బలంగా నిరూపిస్తున్నారు. వెంటనే రీఎంట్రీ ఇచ్చినా? ఫ్యామిలీ కోసం కాస్త విరామం తీసుకున్నా? ఎవరి ప్రాధాన్యత వారిదే అన్నట్లుగా భామలు తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతో మంది మహిళల్లో స్ఫూర్తిని నింపుతున్నాయి. తెరపై గ్లామర్ ఒలకబోయడంలోనే కాదు. నిజ జీవితంలో బాధ్యతలను బ్యాలెన్స్ చేయడంలోనూ స్టార్ భామలు నిజమైన రోల్ మోడల్స్‌గా నిలుస్తున్నారు.
