డాన్ అని తెలియకుండానే అతడితో లవ్!
బాలీవుడ్ నటి మోనికా బేడి గురించి పరిచయం అవసరం లేదు. 90 కాలంలో ఎన్నో హిందీ సినిమాల్లో నటించింది.
By: Srikanth Kontham | 25 Nov 2025 10:00 PM ISTబాలీవుడ్ నటి మోనికా బేడి గురించి పరిచయం అవసరం లేదు. 90 కాలంలో ఎన్నో హిందీ సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళం, కన్నడం, పంజాబీ భాషల్లో కూడా తనదైన ముద్ర వేసింది. 1994లో మొదలైన ఆమె సినీ ప్రస్థానం 2017 వరకూ కొనసాగింది. అటుపై సినిమాలకు దూరమైంది. హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే మాఫియా డాన్ అబు సలేంతో ప్రేమలో పడింది. చాలా కాలం ఆయనతో కలిసి ప్రయాణం చేసిన నటిగా ఆమెకు పేరుంది. కానీ అతడితో పరిచయం ఎలా? ప్రయాణం ఎలా సాగిందన్నది మాత్రం ఎక్కడా రివీల్ చేయలేదు.
ప్రేమతో జీవితమే తల్లకిందులు:
ఈ నేపథ్యంలో తాజాగా ఆ వివరాలు వెల్లడించింది. `దుబాయ్ ఈవెంట్ కోసం నేరుగా అబు సలేం ఫోన్ చేసారు. తొలిసారి అక్కడే ఆయన్ని కలిసాను. అక్కడ బాగా చూసుకున్నారు. ఆ తర్వాత అప్పుడప్పుడు కాల్ చేసేవారు. అలా తొమ్మిది నెలలు పాటు మాట్లాడుకున్నాం. ఆయన మాటలు , కేరింగ్ నచ్చి ప్రేమలో పడిపోయాను. కానీ అతడు డాన్ అనే విషయం మాత్రం తలియదని తెలిపింది. `అతడి పరిచయంతో ఆమె జీవితమే తల్లకిందులైంది. అప్పటి నుం చి సినిమాలు చేయడం తగ్గింది. 2022 లో నకిలీ పత్రాలతో దేశంలోకి వచ్చినందకు గానూ పోర్చుగల్ లో ఆమెతో పాటు అబు సలేంని అరెస్ట్ చేసారు.
సెకెండ్ ఇన్నింగ్స్ లో స్లోగా:
ఆ తర్వాత ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించింది. డాన్ తో ప్రేమాయణం కారణంగా ఇన్ని రకాలుగా ఇబ్బందులు ప డింది. అతడికి దూరమైన తర్వాత మళ్లీ సినిమాలు చేసింది. కానీ సెకెండ్ ఇన్నింగ్స్ మాత్రం ఎంతో కాలంగా సాగలేదు. 2017 వరకే సినిమాలు చేయగలిగింది. ఆ తర్వాత అవకాశాలు కూడా రాలేదు. అన్ని చిత్ర పరిశ్రమల్లో పోటీ కూడా పెరగడంతో ఛాన్సులు తగ్గిపోయాయి. చాలా కాలానికి `బిగ్ బాస్ సీజన్ 2` లో పాల్గొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం తప్ప నటిగా మాత్రం కనిపించలేదు.
తెలుగులో ఎంట్రీ అలా:
తెలుగులో మోనికా బేడి శ్రీకాంత్ హీరోగా నటించిన అందమైన ప్రేమ కథా చిత్రం `తాజ్ మహల్` తో హీరోయిన్ గా పరిచయమయైంది. `శివయ్య` , `సోగ్గాడి పెళ్ళాం`, `సర్కస్ సత్తిపండు`, `చూడాలని వుంది `. స్పీడ్ డాన్సర్ లాంటి సినిమాల్లో నటించింది. బాలీవుడ్ లో `సురక్ష`తో అడుగు పెట్టింది. మోనికా స్వస్థలం పంజాబ్ లోనిహోషియార్‌పూర్ జిల్లా చబ్బేవాల్ గ్రామం. ఆమె తల్లిదండ్రులు 1979లో నార్వేలోని డ్రామెన్‌కి మారారు.ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం లో విద్యాభ్యాసం పూర్తి చేసింది.
