కుంభమేళా మోనాలిసా ఫస్ట్ తెలుగు ఫిలిం లాంఛ్.. పూర్తి వివరాలివే!
అప్పుడప్పుడు కొంతమంది అనుకోకుండా ఫేమస్ అవుతారు. అలాంటి వారిలో మహాకుంభమేళలో ఫేమస్ అయిన మోనాలిసా కూడా ఒకరు..
By: Madhu Reddy | 5 Nov 2025 1:37 PM ISTఅప్పుడప్పుడు కొంతమంది అనుకోకుండా ఫేమస్ అవుతారు. అలాంటి వారిలో మహాకుంభమేళలో ఫేమస్ అయిన మోనాలిసా కూడా ఒకరు.. మహా కుంభమేళ ద్వారా చాలామంది ఫేమస్ అయ్యారు. వారిలో తేనె కళ్ల సుందరి మోనాలిసా కూడా ఫేమస్ అయ్యింది. అలా మహా కుంభమేళలో పూసలు అమ్మే మోనాలిసాని కొంతమంది వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి కాస్త వైరల్ గా మారి ఓవర్ నైట్లో స్టార్ అయిపోయింది. అంతేకాదు మహా కుంభమేళా వెళ్లిన ప్రతి ఒక్కరూ మోనాలిసా ఎక్కడ ఉంది అని ఆమెను వెతికారు. అంతేకాదు ఆమెతో ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి ఎగబడి కాస్త ఇబ్బంది కూడా పెట్టారు. వాళ్ల దెబ్బకి మోనాలిసా మొహం నిండా ముసుగు కప్పుకొని ఎవరికి కనిపించకుండా దొంగ చాటుగా తిరగాల్సి వచ్చింది. అయితే సోషల్ మీడియాలో అంత ఫేమస్ అయిన మోనాలిసాని ఎవరు మాత్రం వదులుకుంటారు..
అలా ఓ బాలీవుడ్ నిర్మాత , డైరెక్టర్ ఏకంగా తమ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా తీసుకుంటానని బహిరంగంగానే ప్రకటించారు. అంతే కాదు మోనాలిసాకి యాక్టింగ్ లో శిక్షణ ఇప్పించి మరీ ఆమెను తన సినిమాలో హీరోయిన్ గా పెట్టుకుంటానని ప్రకటించారు.కానీ ఆ డైరెక్టర్ ని పోలీసులు అరెస్టు చేశారు దాంతో ఆ ప్రాజెక్టు కాస్త అటకెక్కింది. అయితే ప్రస్తుతం మోనాలిసా పలు షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ లో పాల్గొంటూ సందడి చేస్తుంది. అంతేకాదు మొన్న ఒక ఆల్బమ్ సాంగ్ లో కూడా డాన్స్ చేసి ఆకట్టుకుంది.
ఇక ఇప్పుడు తాజాగా ఓ పాన్ ఇండియా మూవీలో మోనాలిసాకి బంపర్ ఆఫర్ వచ్చింది. తాజాగా హైదరాబాద్ లో ఆ సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా ఘనంగా జరిగాయి. ఇట్స్ ఓకే గురు,క్రష్ వంటి సినిమాల్లో నటించిన నటుడు సాయి చరణ్ మరో కొత్త సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. అయితే సాయి చరణ్ హీరోగా రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మోనాలిసాని తీసుకున్నారు.
ఈ సినిమాకి శ్రీను కోటపాటి దర్శకత్వం వహించనుండగా శ్రీ వెంగమాంబ మూవీస్ బ్యానర్ పై అంజయ్య విరిగినేని, ఉష విరిగినేనిలు నిర్మాతలుగా చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి దర్శకత్వం చేస్తున్న శ్రీను కోటపాటి గతంలో ధనాధన్ ధన్ రాజ్, తాగుబోతు రమేష్ లను పెట్టి పీకే రావు ఏకే రావు అనే సినిమా చేశారు.అలాగే నటుడు ఆది సాయికుమార్ తో లవ్ కే రన్ అనే మూవీకి కూడా దర్శకత్వం వహించారు. అలా తాజాగా ఈ డైరెక్టర్ సాయి చరణ్, మోనాలిసాని హీరో హీరోయిన్ గా పెట్టి కొత్త సినిమాకి దర్శకత్వం చేయబోతున్నారు.ఇక ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా హిందీ ,తమిళ, మలయాళ,కన్నడ భాషల్లో కూడా ఏకకాలంలో తెరకెక్కబోతోంది.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాదులో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో సినీ నిర్మాతలు,డైరెక్టర్, హీరో సాయి చరణ్, హీరోయిన్ మోనాలిసాలు పాల్గొన్నారు. ఈ మూవీలో సీనియర్ నటుడు హరీష్ కూడా ఒక కీ రోల్ పోషిస్తున్నట్టు అర్థమవుతుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే అధికారికంగా బయట పడబోతున్నాయి. ఏది ఏమైనప్పటికీ మోనాలిసా పాన్ ఇండియా మూవీలో ఆఫర్ కొట్టేయడంతో చాలామంది నెటిజెన్స్ మోనాలిసా నక్కతోక తొక్కింది పో..ఏకంగా పాన్ ఇండియా మూవీలో అవకాశం అందుకుంది.. అదృష్టం అంటే నీదే అంటూ కామెంట్లు పెడుతున్నారు.
