Begin typing your search above and press return to search.

నాగినీకి పోటీగా నాగ‌మ్మ‌..ఇదేం ట్విస్ట్!

తాజాగా మాలీవుడ్ లో అమ్మ‌డు లాంచ్ అవుతుంది. మోనా లిసా ప్ర‌ధాన పాత్ర‌లో `నాగ‌మ్మ` అనే చిత్రం కొచ్చిలో ప్రారంభ‌మైంది.

By:  Srikanth Kontham   |   27 Aug 2025 8:00 PM IST
నాగినీకి పోటీగా నాగ‌మ్మ‌..ఇదేం ట్విస్ట్!
X

టాలీవుడ్ కి ఇప్ప‌టికే ఓ నాగ‌మ్మ( మౌనీరాయ్) ఎంట్రీ ఇస్తుంది. నాగినీగా తెలుగు ఆడియ‌న్స్ లో ఎంతోఫేమ‌స్. హిందీ డ‌బ్బింగ్ సీరియ‌ళ్ల‌తో నాగినిగా ఈ గుర్తింపు సాధ్య‌మైంది. `విశ్వంభ‌ర` చిత్రంతో అమ్మ‌డు ఐటం భామ‌గానూ అల‌రించ‌డానికి సిద్ద‌మ‌వుతోన్న‌సంగ‌తి తెలిసిందే. ఎంతో మంది బాలీవుడ్ హీరోయిన్లు కాద‌ని మౌనీరాయ్ కి ఆ పాట‌లో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి తో క‌లిసి స్టెప్ అందుకోబోతుంది. సినిమా అంతా ఒక ఎత్తైతే..ఈ పాట మ‌రో ఎత్తు.

పాట‌లో చిరు స‌హా నాగినీ డాన్స్ తో అల‌రిస్తారు? అనే ప్ర‌చారం కూడా ఇప్ప‌టికే జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో మౌనీ రాయ్ క్రేజ్ అంత‌కంత‌కు పెరిగిపోతుంది. ఈ నేప‌థ్యంలో నాగినికి పోటీగా `నాగ‌మ్మ` రంగంలోకి దిగుతుంది. ఈవిడ కూడా అచ్చం తాచుపాము రూపాన్నే క‌లిగి ఉంటుంది. ఆ గాజు క‌ళ్లు.. ముక్కు..రూప లావ‌ణ్యం నాగినీనే తల‌పిస్తారు. ఎవ‌రా బ్యూటీ ? అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆమె మోనాలిసా భోంస్లే. ఈ పేరు సోష‌ల్ మీడియాకి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు.

ప్ర‌యాగ్ రాజ్ లో పూస‌లు అమ్మ‌డంతోనే సోష‌ల్ మీడియాలోపెద్దస్టార్ అయింది. అక్క‌డ నుంచి బాలీవుడ్ సినిమా అవ‌కాశాలు ఆశ చూపింది. టాలీవుడ్ కూడా ఛాన్సులిస్తున్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగు తోంది. ఇవేవి ఇంత వ‌ర‌కూ జ‌ర‌గ‌లేదు గానీ, తాజాగా మాలీవుడ్ లో అమ్మ‌డు లాంచ్ అవుతుంది. మోనా లిసా ప్ర‌ధాన పాత్ర‌లో `నాగ‌మ్మ` అనే చిత్రం కొచ్చిలో ప్రారంభ‌మైంది. సెప్టెంబ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వుతుంది. పి. బిను వ‌ర్గీస్ ఈచిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.

ఇదీ ఓ పాము కాన్సెప్ట్ ను ఆధారంగా తీసుకుని తెర‌కెక్కిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో క‌థ‌ను జ‌స్ట్ ఫై చేస్తూ `నాగ‌మ్మ` అనే టైటిల్ పెట్టిన‌ట్లు క‌నిపిస్తుంది. ఈ త‌ర‌హా సినిమాలొచ్చి చాలా కాల మ‌వుతుంది. సినిమా ట్రెండ్ మారిన నేప‌థ్యంలో క‌థ‌లు కూడా మారాయి. దీంతో సోషియో ఫాంట‌సీ క‌థ‌ల‌కు డిమాండ్ త‌గ్గింది. తాజాగా `నాగ‌మ్మ‌`తో మ‌ళ్లీ మాలీవుడ్ కంబ్యాక్ అవ్వ‌డం విశేషం. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా అనువదించే అవ‌కాశం ఉందంటున్నారు.