Begin typing your search above and press return to search.

డబుల్ సూపర్ స్టార్స్ మూవీ.. అనుకున్న డేట్ కే వస్తుందా?

దాదాపు ప్రతి మూవీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ ఒకరే ఉంటే.. మాలీవుడ్ లో మాత్రం ఇద్దరు ఉన్నారని చెప్పాలి.

By:  M Prashanth   |   9 March 2026 1:00 AM IST
డబుల్ సూపర్ స్టార్స్ మూవీ.. అనుకున్న డేట్ కే వస్తుందా?
X

దాదాపు ప్రతి మూవీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ ఒకరే ఉంటే.. మాలీవుడ్ లో మాత్రం ఇద్దరు ఉన్నారని చెప్పాలి. మలయాళ చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న ఇద్దరు సూపర్ స్టార్లు మమ్ముట్టి, మోహన్ లాల్. వీరిద్దరికీ భారీ ఫ్యాన్ బేస్ తోపాటు బాక్సాఫీస్ వద్ద స్పెషల్ మార్కెట్ ఉంది. ఒకే భాషలో కొన్నేళ్లుగా ఇద్దరు సూపర్ స్టార్లు ఏలుతుండడం మాలీవుడ్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

అయితే ఆ ఇద్దరు దిగ్గజ నటులు కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ పాట్రియట్ (Patriot). ప్రముఖ దర్శకుడు మహేష్ నారాయణ్ ఆ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందుతున్న ఆ చిత్రం ప్రస్తుతం సినీ ప్రియుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. సినిమాలో మమ్ముట్టి, మోహన్‌ లాల్‌ తోపాటు పలువురు ప్రముఖ నటీనటులు యాక్ట్ చేస్తున్నారు.

ఫహాద్ ఫాజిల్, నయనతార, బోబన్, దర్శన రాజేంద్రన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌ తో తెరకెక్కుతున్న ఆ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకు సిద్ధమవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా నుంచి టీజర్ గత ఏడాది మేకర్స్ రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ముఖ్యంగా మమ్ముట్టి, మోహన్‌ లాల్ మధ్య జరిగే తీవ్ర పోరాటాన్ని సూచించే సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరు దిగ్గజ నటులు ఒకే స్క్రీన్‌ పై కనిపించనున్న నేపథ్యంలో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు మహేష్ నారాయణన్ గతంలో తెరకెక్కించిన ట్రాఫిక్, మాలిక్ వంటి చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.

అదే రేంజ్ లో ఇప్పుడు కూడా కథ, రాజకీయ నేపథ్యం, గూఢచారి అంశాలతో పాట్రియాట్ సినిమా రూపొందిస్తున్నట్లు సమాచారం. అయితే మూవీని మొదటగా 2026 ఏప్రిల్ 23న విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. దీంతో మూవీ లవర్స్ అంతా ఆ తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఆ రిలీజ్ డేట్‌ పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

థియేటర్స్ రైట్స్ విషయంలో ఇంకా డీల్స్ సెట్ అవ్వలేదని తెలుస్తోంది. సినిమా విడుదలైన తర్వాత తొలి రెండు వారాల్లో వచ్చే కలెక్షన్లలో 60 శాతం నిర్మాతకు, మిగిలిన 40 శాతం ఎగ్జిబిటర్స్ కు అన్నట్లు డీల్ సెట్ చేసుకోవాలని మేకర్స్ అడిగినట్లు సమాచారం. దానికి ఇంకా ఎవరూ ఓకే అవ్వలేదని వినికిడి. దీంతో ఆ విషయంపై త్వరగా క్లారిటీ రాకపోతే సినిమా విడుదల తేదీపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ మూవీ అనుకున్నట్టే ఏప్రిల్ 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేక రిలీజ్ వాయిదా పడుతుందా? అన్నది సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌ గా మారింది. మరేం జరుగుతుందో చూడాలి.