మోక్షజ్ఞ.. ఎలివేషన్స్ ఒకే కానీ..
వయసు 30 దాటుతున్నా ఇంకా మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. అదిగో ఇదిగో అంటూ కొన్నేళ్లు అలానే గడిచిపోయాయి.
By: M Prashanth | 17 Sept 2025 12:36 PM ISTమోక్షజ్ఞ తేజ.. ముద్దుగా మోక్షు బాబు అంటూ నందమూరి అభిమానులు పిలుచుకునే నటసింహం బాలకృష్ణ వారసుడి సినీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందోనని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. వయసు 30 దాటుతున్నా ఇంకా మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. అదిగో ఇదిగో అంటూ కొన్నేళ్లు అలానే గడిచిపోయాయి.
ఏడాది క్రితం మోక్షు బాబు తొలి సినిమా ప్రకటన వచ్చింది. హనుమాన్ ఫేమ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో డెబ్యూ చేస్తాడని బాలయ్య స్వయంగా ప్రకటించారు. సింబా రాబోతున్నాడంటూ ప్రశాంత్ వర్మ సందడి చేసి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ సినిమా పూజ కార్యక్రమాలు కూడా జరగలేదు.
దీనిపై ఓ సారి బాలయ్య.. మోక్షుకు జ్వరం తగ్గాక మొదలు పెడతామని చెప్పారు. కానీ ఇంకా మొదలవ్వలేదు. దీంతో సినిమా ఆగిపోయిందని కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా ప్రశాంత్ వర్మ వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి. ఓ కార్యక్రమంలో తాను సినిమా కోసం ఏం చెప్పలేనని, నిర్మాతలే చెప్పాలని అనేశారు.
దీంతో మోక్షు- ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఇప్పటికైతే నిలిచిపోయినట్లు క్లియర్ గా తెలుస్తోంది. ఏదేమైనా మోక్షజ్ఞ ఇప్పుడు మంచి లవ్ స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నారని నారా రోహిత్ చెప్పారు. కాబట్టి బాలయ్య వారసుడి డెబ్యూ ఇంకా ఫిక్స్ అవ్వనట్లు ఉంది. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి మోక్షు తొలి సినిమా తీస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. అది ఆదిత్య 999 కూడా కావచ్చని అన్నారు.
అయితే రీసెంట్ గా మోక్షజ్ఞ మరో పుట్టినరోజు జరుపుకున్నా కూడా ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో అసలేం జరుగుతుందోనని నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు. అదే సమయంలో ఫ్యాన్స్ మాత్రం మోక్షు బాబుకు ఓ రేంజ్ లో ఎలివేషన్లు ఇస్తున్నారు. ఇటీవల బాలయ్య, తన కొడుకుతో కలిసి సూపర్ హిట్ మిరాయ్ మూవీని వీక్షించారు.
హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమ్యాక్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ కు బాలయ్య, మోక్షు వెళ్లిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. అదే సమయంలో థియేటర్ నుంచి బయటకు వస్తుండగా.. మోక్షజ్ఞ సూపర్ లుక్ లో కనిపిస్తున్నారు. నందమూరి వారసుడి లుక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. వీడియోను ఫుల్ వైరల్ చేస్తున్నారు.
అయితే ఎలివేషన్స్ ఓకే కానీ.. డెబ్యూ మూవీ సంగతేంటని మరికొందరు నెటిజన్లు క్వశ్చన్స్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్నేళ్లు గడిచిపోయాయని అంటున్నారు. ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలని చెబుతున్నారు. ఏదేమైనా మోక్షు డెబ్యూపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో అనేది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది. మరి అసలైన అప్డేట్ ఎప్పుడు ఇస్తారో చూడాలి.
