Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : బాబు మరింత సన్నబడ్డాడు

నందమూరి ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ అదుగో ఇదుగో అంటూ వాయిదా పడుతూ వస్తోంది.

By:  Ramesh Palla   |   18 Aug 2025 4:27 PM IST
పిక్‌టాక్‌ : బాబు మరింత సన్నబడ్డాడు
X

నందమూరి ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ అదుగో ఇదుగో అంటూ వాయిదా పడుతూ వస్తోంది. 2020 నుంచి మొదలుకుని మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానుల చర్చలు మొదలు అయ్యాయి. ప్రస్తుతం మోక్షజ్ఞ సినిమాల్లో నటించేందుకు గాను శిక్షణ తీసుకుంటున్న విషయం తెల్సిందే. విదేశాల్లో గత కొన్నాళ్లుగా ట్రైనింగ్‌ తీసుకుంటున్న మోక్షజ్ఞ ప్రస్తుతం కథలు వింటున్నాడనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది చివరి నుంచి ఆయన సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ మధ్య ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా ప్రారంభం అంటూ వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా పట్టాలెక్కలేదు. దాంతో ఏ దర్శకుడు ఆయనను పరిచయం చేస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మూవీ క్యాన్సల్‌

బాలకృష్ణ ప్రస్తుతం మోక్షజ్ఞ కోసం కథలు వింటున్నాడని తెలుస్తోంది. అంతే కాకుండా బాలకృష్ణ ఒక మంచి దర్శకుడి కోసం కూడా ఎదురు చూస్తున్నాడని సమాచారం అందుతోంది. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో సినిమా అనగానే నందమూరి ఫ్యాన్స్‌ చాలా సంతోషం వ్యక్తం చేశారు. కానీ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ కథ విషయంల పట్టు విడుపులు చూపించక పోవడం వల్లే ప్రాజెక్ట్‌ క్యాన్సల్‌ అయిందని తెలుస్తోంది. ఇప్పటి వరకు మోక్షజ్ఞ తో సినిమా ఎందుకు క్యాన్సల్‌ అయింది అనే విషయాన్ని గురించి దర్శకుడు ప్రశాంత్‌ వర్మ నోరు విప్పడం లేదు. అంతే కాకుండా నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా ఈ విషయమై ఎలాంటి స్పష్టత లేదు. ముందు ముందు అయినా ఈ విషయం గురించి క్లారిటీ వస్తుందేమో చూడాలి.

మోక్షజ్ఞ న్యూ లుక్‌ కి ఫ్యాన్స్‌ ఫిదా

మోక్షజ్ఞ గతంలో ఎక్కువ బరువుతో కనిపించేవాడు. మోక్షజ్ఞ కు అసలు సినిమాల్లోకి వచ్చే ఆసక్తి ఉందా అని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేసే వారు. కానీ ఇప్పుడు మోక్షజ్ఞ ను చూస్తూ ఉంటే సర్‌ప్రైజింగ్‌గా ఉందని ఫ్యాన్స్‌ అంటున్నారు. ఈ మధ్య కాలంలో మోక్షజ్ఞ మరింత సన్నబడ్డట్లుగా అనిపిస్తుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు హీరోగా సరైన దారిలో మోక్షజ్ఞ ఉన్నాడని, అతడు ఖచ్చితంగా ఒక సూపర్‌ స్టార్‌గా మారబోతున్నాడు అంటూ అభిమానులు నమ్మకంగా ఉన్నారు. సోషల్‌ మీడియాలో మోక్షజ్ఞ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఎప్పటిలాగే ఈ ఫోటోలు కూడా వైరల్‌ అవుతున్నాయి. మోక్షజ్ఞ న్యూ లుక్ కి ఫిదా అవుతూ ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు మోక్షజ్ఞ టాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌ హీరోగా నిలవడం ఖాయం అని నందమూరి ఫ్యాన్స్‌లో చర్చ మొదలైంది.

అఖండ 2 తో రాబోతున్న బాలకృష్ణ

బాలకృష్ణ హీరోగా వచ్చిన ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్‌గా రూపొందబోతున్న ఆదిత్య 999 సినిమాలో మోక్షజ్ఞ కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య బాలకృష్ణ స్వయంగా మోక్షజ్ఞ ను తన సినిమాలో నటింపజేస్తాను అన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ విషయమై మరింత స్పష్టత రాలేదు. అసలు ఆదిత్య 999 సినిమా ఉండే ఛాన్స్ ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. అఖండ 2 సినిమాతో పాటు మరో సినిమాను బాలకృష్ణ చేయబోతున్నాడు. ఆ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది. అతి త్వరలోనే సినిమా ప్రారంభం చేస్తారనే వార్తలు వస్తున్నాయి. అఖండ 2 సినిమాతో ఈ ఏడాదిలో బాలయ్య రాబోతున్నారు. మోక్షజ్ఞ ను బోయపాటి పరిచయం చేస్తాడనే వార్తలు కూడా ఉన్నాయి. కానీ ఆ విషయంలోనూ క్లారిటీ రావాల్సి ఉంది. .