తండ్రి ఛాయలో కాదు.. సొంత ఇమేజ్‌తో మోక్షజ్ఞ!
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన తాజా సమాచారం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
By: Sravani Lakshmi Srungarapu | 21 Sept 2026 12:38 PM ISTనందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అయితే సాధారణంగా స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చే వారసుల డెబ్యూ సినిమాలపై ఉండే అంచనాలకు భిన్నంగా.. మోక్షజ్ఞ మొదటి సినిమాను ఇంట్రెస్టింగ్ ఎక్స్‌పెరిమెంట్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. మోక్షజ్ఞ తేజ డెబ్యూ మూవీకి వశిష్ఠ దర్శకత్వం వహించబోతున్న విషయం ఇప్పటికే కన్ఫర్మ్ అయి, అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన తాజా సమాచారం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా సోషియో ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. పునర్జన్మలు, మల్టిపుల్ టైమ్‌లైన్స్, భారీ విజువల్ ఎఫెక్ట్స్ వంటి అంశాలు కథలో కీలకంగా ఉండొచ్చనే టాక్ ఉంది. ఇక్కడే మోక్షజ్ఞ డెబ్యూ విషయంలో మరో ఇంట్రెస్టింగ్ అంశం కనిపిస్తోంది. సినిమా కథను పూర్తిగా వెల్లడించకుండా.. అసలు ప్రపంచం ఎలా ఉంటుంది? మోక్షజ్ఞ ఏ పాత్రలో కనిపిస్తాడు? గత జన్మతో అతడి సంబంధం ఏంటి? పలు టైమ్‌లైన్స్ మధ్య కథ ఎలా ప్రయాణిస్తుంది? అనే ప్రశ్నలను ఆడియన్స్ లో పెంచే విధంగా ప్రమోషన్‌ను డిజైన్ చేసే అవకాశం ఉంది. అంటే ఈ సినిమాకు కథతో పాటు మిస్టరీ కూడా మెయిన్ ప్రమోషనల్ టూల్‌గా మారే ఛాన్స్ కనిపిస్తోంది.
మరోవైపు ఈ ప్రాజెక్ట్‌ను చూస్తే బాలకృష్ణ సినిమాల మాస్ ఫార్ములాను మోక్షజ్ఞపై డైరెక్ట్ గా ప్రయోగించే ఆలోచన కంటే.. అతడికి స్పెషల్ ఇమేజ్‌ను నిర్మించాలనే ప్రయత్నం కనిపిస్తోందనే డిస్కషన్ జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ స్క్రీన్‌పై తనకంటూ ఏర్పరచుకున్న మాస్ ఇమేజ్‌ను కంటిన్యూ చేయడం కంటే, మోక్షజ్ఞను కొత్త జానర్‌లో కొత్త ప్రపంచంతో పరిచయం చేయడం ద్వారా అతడి సొంత గుర్తింపును మొదటి సినిమాతోనే నిర్మించాలనే ఆలోచన ఉండొచ్చనే విశ్లేషణ వినిపిస్తోంది. అదే జరిగితే.. ఇది కేవలం మరో వారసుడి ఎంట్రీగా కాకుండా, ఒక కొత్త హీరో బ్రాండ్‌ను మొదటి నుంచే డిజైన్ చేసే ప్రయత్నంగా మారుతుంది.
డైరెక్టర్ గా వశిష్ఠను ఎంచుకోవడం వెనుక కూడా హీరో కంటే జానర్‌నే ముందుగా చూసి ఉండొచ్చనే మరో కోణం ఆసక్తికరంగా మారింది. భారీ ఫాంటసీ ప్రపంచాన్ని, విజువల్ స్కేల్‌ను, టైమ్‌లైన్ ఆధారిత కథనాన్ని సమర్థంగా తెరకెక్కించగల దర్శకుడి అవసరం ఉండటంతోనే వశిష్ఠను సెలెక్ట్ చేసుకున్నారనే టాక్ ఉంది. ఈ యాంగిల్ లో చూస్తే.. మోక్షజ్ఞకు సరిపోయే డైరెక్టర్ ను వెతకడం కంటే, మోక్షజ్ఞను పరిచయం చేయాలనుకున్న ప్రపంచానికి సరిపోయే డైరెక్టర్ ను ఎంపిక చేశారనే మాటకు ప్రాధాన్యత వస్తుంది. అందుకే మోక్షజ్ఞ డెబ్యూను కేవలం మరో నందమూరి వారసుడి లాంచ్‌గా కాకుండా.. బాలయ్య ఇమేజ్‌ను ఫాలో కాకుండా, కొడుక్కి పూర్తిగా కొత్త ఇమేజ్‌ను నిర్మించే ప్రయత్నంగా చూడాలనే ఆసక్తి ఏర్పడుతోంది. మరి ఈ మిస్టరీ, కొత్త జానర్, భారీ ప్రపంచం మోక్షజ్ఞకు ఎలాంటి ఆరంభాన్ని ఇస్తాయో చూడాలి.
