Begin typing your search above and press return to search.

మోక్షు ఎంట్రీకి సర్వం సిద్ధమైనట్లేనా?

నందమూరి కుటుంబానికి చెందిన మరో వారసుడు, సీనియర్ హీరో బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ కోసం అటు అభిమానులు, ఇటు సినీ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.

By:  M Prashanth   |   12 Jan 2026 4:00 AM IST
మోక్షు ఎంట్రీకి సర్వం సిద్ధమైనట్లేనా?
X

నందమూరి కుటుంబానికి చెందిన మరో వారసుడు, సీనియర్ హీరో బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ కోసం అటు అభిమానులు, ఇటు సినీ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అదిగో ఇదిగో అంటూనే కొన్ని నెలలు గడిచిపోయాయి. కానీ మోక్షు బాబు ఎంట్రీ మాత్రం ఇవ్వలేదు. గతంలో టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఉంటుందని అనౌన్స్మెంట్ వచ్చినా.. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది.

అయితే ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ దాదాపు ఫిక్స్ అయినట్లేనని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని వినికిడి. దీంతో నందమూరి అభిమానులు ఖుషీ అయిపోతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. మోక్షజ్ఞ తొలి సినిమా టాలీవుడ్‌ లో క్లాసిక్‌ మూవీగా నిలిచిన ఆదిత్య 369కు సీక్వెల్ గా రూపొందనుందట. ఆ సినిమాకు ఆదిత్య 999 మ్యాక్స్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ ను ఫిక్స్ చేసినట్లు వినికిడి.

టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ తో అప్పట్లో అందరినీ ఆకట్టుకున్న ఆదిత్య 369 మూవీకి సీక్వెల్ గా మోక్షు డెబ్యూ రూపొందుతున్నట్లు వార్తలు వస్తుండటంతో అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. కొద్ది రోజులుగా ఆ విషయంపై వార్తలు వస్తున్నా.. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్లేనని తెలుస్తోంది. మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ఇప్పటికే ఆయన స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ చేశారట.

ఇప్పటికే పీరియాడిక్, ఫాంటసీ సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్న క్రిష్.. ఇప్పుడు మోక్షజ్ఞను పవర్‌ ఫుల్‌ గా పరిచయం చేసేలా కథ సిద్ధం చేశారని వినికిడి. మరికొద్ది రోజుల్లో సినిమాను స్టార్ట్ చేయనున్నారని తెలుస్తోంది. పూజా కార్యక్రమాలతో మూవీని గ్రాండ్ గా ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఆ తర్వాత మార్చి మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు టీమ్ సిద్ధమవుతోంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో ఇతర కీలక పాత్రలపై క్రిష్ ఫుల్ గా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అందరి దృష్టిని ఆకర్షించే నటీనటులను రంగంలోకి దించనున్నారట. సినిమాలో మోక్షజ్ఞతో పాటు ఎక్స్పీరియన్స్ ఉన్న నటీనటులు కనిపించనున్నారని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. కథకు తగినట్లు ప్రతి పాత్ర కోసం చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

అదే సమయంలో మోక్షజ్ఞ లుక్ విషయంలోనూ క్రిష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. స్టైలిష్‌ గా, మోడ్రన్‌ గా చూపించడంతో పాటు బాలయ్య వారసుడు అంటే ఎలా ఉండాలో.. అలాగే డిజైన్ చేస్తున్నారని సమాచారం. తొలి సినిమాతోనే మోక్షుకు స్ట్రాంగ్ ఇమేజ్ తీసుకురావడమే లక్ష్యంగా వర్క్ చేస్తున్నారని సమాచారం. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారని టాక్. మొత్తానికి మోక్షు డెబ్యూ మూవీపై లేటెస్ట్ అప్డేట్ అభిమానులతో పాటు సినీ ప్రియుల్లో ఆసక్తి రేపుతోంది.